Nindu Manasulu Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "నిండు మనసులు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(సెప్టెంబరు 19న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రేరణ: నిన్ను ఎలా విడిచి పెట్టారు ఓ నీకున్న డబ్బుతో తప్పుని కూడా ఒప్పు చేసుకున్నావా..
సిద్ధూ: ప్రేరణా మీ నాన్న నా తండ్రిని చంపాడు. కానీ నేను మీ నాన్నని చంపాలనుకోలేదు. నువ్వు ఇన్నీ మాటలు మాట్లాడుతున్నావు కానీ మీ నాన్న నేనేం తప్పు చేయలేదు అని వాంగ్మూలం ఇచ్చాడు తెలుసా.
విజయానంద్: ప్రేరణ నువ్వు అనవసరంగా సిద్ధూ మీద అభాండాలు వేస్తున్నావు. నువ్వు ఒక్క విషయాన్ని మర్చిపోతున్నావు. సిద్ధూ తండ్రిని చంపిన వాళ్ల మీద కేసు పెట్టి జైల్లో వేయించే అవకాశం మాకు ఉంది. అది మేము చేయాలనుకోట్లేదు. అది మా సిద్ధూ మంచితనం.
మంజు: వదిలేయండి. వాళ్లు మనకి చేసిన ద్రోహానికి ఇదొక క్షమాభిక్ష అనుకుని వదిలిపెట్టండి. రాజశేఖరం ఏం చేశాడో మనకి తెలుసు. సిద్ధూ అతని నుంచి నిజం మాత్రమే తెలుసుకోవాలనుకున్నాడు. కానీ నీ తండ్రి నమ్మిన వాళ్లనే మోసం చేశాడు.
ప్రేరణ: ఇదంతా అబద్ధం. ఒకటి మాత్రమే నిజం. మా నాన్న కూడా ఏ తప్పు చేయలేదు. మా నాన్నని చంపాలనుకున్నది మాత్రం నువ్వే సిద్ధూ అది నేను నా కళ్లారా చూశాను. మీ నాన్నని మా నాన్న చంపడం నువ్వు చూశావా..
సిద్ధూ: ప్రేరణ మూర్ఖంగా మాట్లాడకు. నేను తప్పు చేసుంటే స్వయంగా ఒప్పుకుని శిక్ష అనుభవించేవాన్ని నేను చేయలేదు ప్రేరణా. నాకి విషయం తెలిశాకే ఈ నిజం బయటపడింది. కానీ నువ్వూ నీకు నిజం తెలిసి కూడా నాకు చెప్పకుండా దాచావు. అంటే నువ్వూ మీ నాన్నా అందరూ కలిసి నన్ను మోసం చేశారు.
ప్రేరణ: మోసం చేసేవాళ్లమైతే నువ్వు ఇన్నిరోజులు సంతోషంగా ఉండలేవు సిద్ధూ. నీకు ఈ నిజం సాక్ష్యాలతో సహా చూపించాలని మా నాన్న అనుకున్నారు. కానీ కొంతమంది రాక్షసుల వల్ల నువ్వు నిజాన్ని అబద్ధంగా నమ్ముతున్నావు.
మంజు: నా కొడుకు తప్పు చేశాడని నువ్వు అనుకుంటున్నావా ప్రేరణా? నీ నాన్న బాడీలో దిగిన బుల్లెట్ సిద్ధూ గన్లో నుండి వచ్చింది కాదు అని కోర్టు క్లీన్ చిట్టించింది. అయినా నువ్వు సిద్ధూనే అనుమానిస్తున్నావా?
ప్రేరణ: మీరు అంతటి సమర్థులే కదా.. మీకు అలాంటి క్లీన్ చిట్ సంపాదించడం ఎంతసేపు పడుతుంది?
సిద్ధూ: ప్రేరణ నువ్వు ఒక మూర్ఖురాలివి. నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. నా తండ్రిని చంపిన హంతకుడికి అండగా నిలిచే వాళ్లు కూడా నా దృష్టిలో నేరస్తులే. ఇప్పుడు నువ్వు కూడా తప్పు చేసిన దోషివే.
ప్రేరణ: మా నాన్న తప్పు చేయడు.. అది నేను నమ్ముతాను.
సిద్ధూ: ప్రేరణ వాళ్లు ఇంతలా మోసం చేస్తారు అనుకోలేదు.. మీ నాన్న ఓ హంతకుడు.. నిజం తెలిసి కూడా అతన్ని వదిలేసినందుకు అసహ్యం వేస్తుంది. అసలు అతన్నే కాదు నిన్ను నేను వదలను. అలాంటి వాడి కడుపున పుట్టిన నీకు ఇంకేం మాటలు వస్తాయి. అసలు నీ పుట్టుకే..
ప్రేరణ: నా పుట్టక గురించి మాట్లాడే అంతటివాడివి అయ్యావా.. మీ నాన్నని చంపిన వాడు మీ ఇంట్లోనే ఉన్నాడు..
సిద్ధూ: మానాన్నని చంపిన వాడిన కూతుర్ని పెళ్లి చేసుకున్నందుకు అసహ్యంగా ఉంది. ఇలాంటి దాన్ని నా దగ్గర పంపిన వాడిని ఛీ..

సిద్ధూ మాటలకు ప్రేరణ సిద్ధూని లాగి పెట్టి కొట్టి..నా తండ్రి ఏ తప్పు చేయలేదు అని నిరూపించే తీరుతా.. నా తండ్రి ఏం తప్పు చేయలేదు అని నిరూపించే ఈ ఇంట్లో నీ భార్యగా అడుగు పెడతా.. అప్పటి వరకు మా గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని అంటుంది. మంజు సిద్ధూతో సైలెంట్‌గా ఉన్నావేంటి అంటే ఆ హంతకుడి కూతుర్ని నా జీవితంలో నుంచి తీసేస్తా అంటాడు.

కొత్త జీవితం మొదలు పెట్టు..

సిద్ధూ ఆలోచనలో ఉంటే విజయానంద్, మంజు సిద్ధూ దగ్గరకు వెళ్తారు. జరిగినవన్నీ మర్చిపోయి కొత్త జీవితం మొదలు పెట్టు సిద్ధూ అని విజయానంద్ అంటాడు. మంజు సిద్ధూకి ఓ కొత్త జీవితం చూపిద్దాం.. అని అంటాడు.

జరిగింది వేరమ్మా..

ప్రేరణ తండ్రి దగ్గరకు వెళ్లి ఇలా చెప్పావేంటి నాన్న.. మేం చూశాం నాన్న సిద్ధూ కాల్చడం అని అంటే సిద్ధూ ఏ తప్పు చేయడమ్మా.. అని రాజశేఖరం అంటాడు. గణ తండ్రితో నా కళ్ల మందు నీకు ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్లని నేను వదలను అని అంటే నా గురించి నీకు ఎందుకురా.. నేను చస్తే బాగున్ను అనుకున్నావ్ కదా వదిలేయ్ అంటాడు రాజశేఖరం. గణ అన్న దానిలో తప్పేముంది అని ప్రేరణ అంటుంది. నా వల్ల నీ కాపురం కూలిపోకూడదమ్మా మీరు సంతోషంగా ఉండండి అని రాజశేఖరం అంటే మా బంధం తెగిపోయింది నాన్న ఇక దాన్ని గురించి వదిలేయండి నేను నిర్ణయం తీసుకున్నా ఎవరు చెప్పినా నేను వాళ్లని వదలను అని ప్రేరణ అంటుంది. నాన్నని జాగ్రత్తగా చూసుకో అమ్మా నేను నా లక్ష్యం వైపు వెళ్తున్నా సాధించే మళ్లీ వస్తా అని వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.