Nindu Manasulu Serial Today Episode విజయానంద్, విశ్వాసం పోలీస్ స్టేషన్‌కి వస్తారు. విజయానంద్ కారులో ఉంటానని గణని పిలుచుకురమ్మని విశ్వాసాన్ని పంపిస్తాడు. విశ్వాసం వెళ్లి గణని విష్ చేసి సార్ బయట ఉన్నారని చెప్తాడు. సార్ బయట వెయిట్ చేస్తున్నారా.. పద పద.. అని గణ బయటకు వస్తాడు.

విజయానంద్ గణ దగ్గరకి రాగానే సార్ మీరేంటి సార్ నాకోసం ఇలా ఇక్కడికి రావడం రండి సార్ రండి అని స్టాఫ్‌ని పలిచి చైర్స్ తీసుకురమ్మని చెప్తాడు. చైర్ ఇచ్చి కూర్చొమని చెప్పి కూర్చొండి సార్ నా పక్కన టామీలు కుక్కలు కూర్చొవు..పెద్ద మనుషులే కూర్చొంటారు మీలాగా అని గతంలో భోజనానికి విజయానంద్ గణని పిలిచి అవమానించిన మాటల్ని దెప్పిపొడుస్తాడు. విజయానంద్ కాళ్ల మీద కాలు వేసుకొని కూర్చొగానే గణ కూడా కాలి మీద కాలు వేసుకొని కూర్చొంటాడు.

గణ విజయానంద్‌కి వచ్చిన విషయం అడిగి చెప్పే టైంకి కాఫీ తీసుకురా సురేందర్ అని తన మనిషికి చెప్తాడు. విశ్వాసం ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకొని మా సార్ కాఫీ మానేశారు అంటాడు. దానికి గణ సార్ అయితే మంచివారిలా మారిపోయారు అన్నమాట అని తనకు కాఫీ కావాలని చెప్తాడు. విశ్వాసం విజయానంద్‌తో సార్ అన్నీ గుర్తు పెట్టుకున్నాడు అని అంటాడు. నేనేం గుర్తు పెట్టుకోలేదు విశ్వాసం అన్నీ మర్చిపోయా అంటాడు. ఇక విషయం విజయానంద్‌కి అడిగితే సిద్ధార్థ్‌ని అరెస్ట్ చేశారు కదా అని అంటాడు. ఓహో మీరు నన్ను ప్రశంసించడానికి వచ్చారా.. మీకు ఇది గుడ్‌న్యూసే కదా అని అంటే విజయానంద్ సిద్ధూని విడిపించమని అంటాడు. గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అయిపోయిందా అని అంటే.. సిద్ధూ ఇంకొక్క క్షణం కూడా పోలీస్ స్టేషన్‌లో ఉండటానికి వీల్లేదు అని విజయానంద్ అంటాడు.

గణ విజయానంద్‌తో ఆ రోజు వదలొద్దు అన్నారు ఇప్పుడు వదిలేయమని అంటున్నారు ఏంటి సార్ ఇదంతా అంటే నేను కదా చెప్తున్నా వదిలేయ్ అని విజయానంద్ అంటే కుదరదు సార్ ఎఫ్‌ఐఆర్ రాసేశాం.. సాక్ష్యాలు అన్నీ వాళ్లకి వ్యతిరేకంగా ఉన్నాయ్ అంటాడు. నేనేం చెప్తున్నా నవ్వు ఎవరికి చెప్తున్నావో అర్థమవుతుందా అని విజయానంద్ అంటే నాకు అర్థమవుతుంది సార్ మీకు అర్థమవుతుందా ఏం కేసో ..దొంగతనం, అటమ్‌ టూ మర్డర్ అని అంటాడు. విజయానంద్ షాక్ అయిపోతాడు. ఇంతకు మించి నేను మీకు చెప్పేది ఏం లేదు సార్ వాడి గురించి మర్చిపోండి అని గణ అనేయడంతో విజయానంద్ కోపంలేచి విశ్వాసం కార్ తీయమని చెప్పు అని వెళ్లిపోతాడు. సార్ మీరంటే నాకు చాలా ఇష్టం సార్ మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు ఐలవ్‌యూ అని గణ అరుస్తాడు. విజయానంద్ గణని చూసి వెటకారంగా నవ్వి వెళ్లిపోతాడు. గణ మనసులో మార్పు వచ్చింది అంట మార్పు నువ్వు మారినా నేను మారను విజయానంద్ నిన్ను ఇలా చూడటం నాకు చాలా హ్యాపీగా ఉంది అని అనుకుంటాడు.

ప్రేరణ గురించి ఇందిర చాలా టెన్షన్ పడుతుంది. ప్రేరణ జైలులో ఉన్నా చూడలేకపోతున్నా బిడ్డ తిన్నాదో లేదో అని సుధాకర్‌కి కాల్ చేసి పోలీస్ స్టేషన్‌కి వస్తా అని అంటుంది. సుధాకర్ వద్దు అంటే ప్రేరణకి భోజనం తీసుకొస్తా అని చెప్తుంది. వద్దు అక్క నువ్వు వస్తే ప్రమాదం అని సుధాకర్ అంటే ఏం కాదురా అని గణకి భోజనం తీసుకొచ్చి అలా ప్రేరణకి తెస్తా అని చెప్తుంది. దాంతో సుధా గణ దగ్గరకు వెళ్లి ఈ రోజు రాత్రి అంతా ఇక్కడే ఉంటారు కదా ఇంటి నుంచి భోజనం తెప్పిస్తా అంటాడు. గణ నవ్వుతూ నా గురించి నీకు బాగా తెలుసు సుధా సరే తెప్పించు అని అంటాడు.

గణ తల్లికి కాల్ చేసి బాక్స్ పంపమని చెప్పడంతో ఇందిర తానే తీసుకెళ్తానని అంటుంది. ఈశ్వరి సరే అంటుంది. ఇందిర గణ, ప్రేరణ ఇద్దరి కోసం బాక్స్ తీసుకొస్తుంది. ఇందిరను గణ చూసేస్తాడేమో అని సుధాకర్ చాలా టెన్షన్ పడతాడు. స్టాఫ్ అందర్ని భోజనానికి పంపించేస్తాడు. ఇక ఇందిర దగ్గర బాక్స్ తీసుకొని గణ దగ్గరకు వెళ్లి తినమని హడావుడి చేస్తాడు. గణ చాలు అన్నా ఆగకుండా దగ్గరుండి ఎక్కువెక్కవ వడ్డించేస్తాడు. మొత్తానికి గణ బయటకు రాకుండా అడ్డుకుంటాడు. ఇంతలో ఇందిర మరో బాక్స్ తీసుకొని ప్రేరణ, సిద్ధూల దగ్గరకు వెళ్తుంది. ప్రేరణని హగ్ చేసుకొని ఏడుస్తుంది. దగ్గరుండి ప్రేరణ, సిద్ధూలకు భోజనం వడ్డిస్తుంది. మీరు తప్పు చేయలేదు మీ మంచితనమే మిమల్ని ఆ సమస్య నుంచి గట్టెక్కిస్తుందని ధైర్యం చెప్తుంది.

గణని సుధాకర్ గదిలో నుంచి బయటకు రాకుండా చేతులు కూడా అక్కడే కడుక్కునే ఏర్పాటు చేస్తాడు. సిద్ధూ, ప్రేరణ కూడా తినేస్తారు. ఇందిర బాక్స్ తీసుకొని వెళ్లే టైంకి గణ బయటకు వస్తాడు. ఇందిరని చూసి ఈవిడేంటి ఇక్కడ అని అడుగుతాడు. మేడం మీకోసం తనతో బాక్స్ పంపారని అంటాడు. డ్రైవర్‌తో పంపిస్తా అని అమ్మ చెప్పిందని గణ అంటాడు. ఇక ఇందిర చేతిలో ఉన్న క్యారేజ్ చూసి ఇది ఎవరి కోసం అని అడిగితే నాకే సార్ నేనే మీ ఇంటి నుంచి తీసుకురమ్మని చెప్పానని నేను మీరు నమ్మని బంటు కదా సార్ అని అంటాడు. దాంతో సుధాకర్‌కి ఆ బాక్స్ ఇచ్చేయమని గణ చెప్తాడు. ఇందిర వెళ్లిపోతుంది. గణ ప్రేరణ వాళ్ల దగ్గరకు వెళ్లి ఏదో ప్రయత్నం చేస్తా అన్నారు ఏమైంది అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.