Nindu Manasulu Serial Today Episode విజయానంద్‌ ఇంట్లో దీపావళి వేడుకకు మినిస్టర్ వస్తాడు. సిద్ధూ విజయానంద్‌ కొడుకు అని తెలుసుకొని షాక్ అయిపోతాడు. ప్రేరణని చూసి కోడలు అని చెప్పకయ్యా నా గుండెకు స్టంట్ వేశారు అని అంటాడు. అలా ఎందుకు చెప్తాం తను మా అబ్బాయి ఫ్రెండ్ కలిసి బిజినెస్ చేస్తున్నారు అని మంజుల చెప్తుంది.

విజయానంద్ మినిస్టర్‌కి మర్యాదలు చేస్తుంటే నా కూతురు కూడా వచ్చింది అని అంటాడు. కుమార్‌కి శైలు కాల్ చేయడంతో మెలికలు తిరుగుతూ మాట్లాడుతారు. ఇద్దరూ మిస్‌యూలు చెప్పుకుంటూ ఉంటారు. సిద్ధూ ఇంట్లో దీపావళి వేడుకకు వచ్చానని కుమార్ శైలుకి చెప్తే మా నాన్న ఫ్రెండ్ ఇంటికి దీపావళి వేడుకకు వచ్చానని శైలు చెప్తుంది. ఇప్పుడే చూడాలి అని ఉందని కుమార్ అంటాడు. ఇప్పుడు కుదరదు అని శైలు చెప్పడంతో ముద్దు కావాలి అని కుమార్ అడిగి తనే ఫోన్‌లో ముద్దు పెడుతూ సిద్ధూ ఇంటికే వచ్చిన శైలుని చూస్తాడు. నువ్వేంటి ఇక్కడ శైలు అని షాక్ అయిపోతాడు.

శైలు కుమార్ నెత్తి మీద ఒక్కటిచ్చి నాన్న ఫ్రెండ్ ఇళ్లు అని అంటుంది. ఇది నా ఫ్రెండ్ ఇళ్లు అని కుమార్ అంటాడు. ఇంతలో మినిస్టర్ వచ్చి పిలడం మినిస్టర్‌ని శైలు నాన్న అని చెప్పడంతో కుమార్ బిత్తరపోయి ఫోన్ విసిరేస్తాడు. అది వెళ్లి మినిస్టర్ చేతిలో పడుతుంది. నా కూతురి గొంతు ఇందులో వినిపిస్తుందని మినిస్టర్ అడగటంతో శైలు కవర్ చేస్తుంది.

ఇంతలో సిద్ధూ వస్తాడు. మినిస్టర్ మా అమ్మాయి అని శైలు పరిచయం చేస్తాడు. ఈ అమ్మాయి మీ అమ్మాయా అని సిద్ధూ షాక్ అయిపోతాడు. కుమార్ అబ్బా అంటూ గుండె పట్టుకుంటాడు. ఇంతలో ప్రేరణ వచ్చి శైలుని పలకరిస్తుంది. ఈ అమ్మాయి కూడా నీకు ముందే పరిచయం ఉందా అని మినిస్టర్ శైలుని అడుగుతాడు. వైజాగ్‌లో తను నా క్లాస్‌ మీట్ అని శైలు చెప్తుంది. ఒక్కసారి కూడా మన ఇంటికి తీసుకురాలేదని మినిస్టర్ అంటే కుదరలేదు అని శైలు అంటుంది. శైలు కూడా మినిస్టర్ కూతురు అని చెప్పలేదు అంటుంది ప్రేరణ. మినిస్టర్ శైలుని తీసుకొని వెళ్తుంటే సిద్ధూ, ప్రేరణలు శైలు మినిస్టర్ కూతురు అని మాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు. నా ఖర్మరా నా ఖర్మ నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి అని కుమార్ అంటాడు. శైలు వెళ్తూ కన్ను కొట్టడంతో కుమార్ ఫిట్స్ వచ్చినోడిలా అయిపోతాడు.

గణ ఇందిరను ఆపి చేతిలో క్యారీ బ్యాగ్ చూసి ఏంటి అని అడుగుతాడు. బుట్టలో ఏం ఉంది అని అడుగుతాడు. ఇందిర కంగారు పడుతుంది. సుధాకర్ ఇది ఏదో చేసింది అనుకొని ఆ బుట్టలో టిఫెన్ ఉందో పప్పులు ఉన్నాయి అంతే కాదా అంటాడు. తనని అడిగితే నువ్వు చెప్తావేంటి నువ్వు నోరు మూయ్ అని గణ అంటాడు. పాయసం అని ఇందిర అంటే మీ ఇంటి నుంచి ఇక్కడికి పాయసం తేవడం ఏంటి గణ అంటాడు. టైం అయిపోయింది అని ఇంట్లో చేసి తీసుకొచ్చా మీకు ఇష్టం లేదు అంటే పడేస్తా అంటుంది. మా ఇంట్లో మిగిలినవి పని వాళ్లు తీసుకెళ్లాలి.. కానీ మీ ఇంటి నుంచి తీసుకురాకూడదు.. నేను మీ లాంటి వాళ్లింట్లో మంచి నీరు కూడా తాగను అని అంటాడు.

కుమార్ కరెంట్ షాక్ కొట్టినోడిలా కూలబడిపోతాడు. ప్రేరణ, సిద్ధూ పిలిస్తే మినిస్టర్‌ గారు నాకు మీకూతురికి సంబంధం లేదు అని కాళ్లు పట్టుకొని ఏడుస్తాడు. ఓరేయ్ టెన్షన్ పడొద్దురా చచ్చిపోయేలా ఉన్నావ్ అంటాడు. ఎంత సేపు బస్‌స్టాప్‌లో బైక్‌ ఎక్కి బంజారా హిల్స్‌లో బైక్ దిగేది.. నేను కనిపెట్టలేకపోయానురా అని ఏడుస్తాడు. శైలు మీ ఫ్రెండ్ కదా మీరు నన్ను బుక్ చేయాలి అనుకున్నారు కదా అనిఅంటాడు. నాకు తెలీదు అని ప్రేరణ అంటుంది.

ఇంతలో కన్నయ్యా అంటూ శైలు వచ్చి కంగారు పడొద్దు అంటుంది. ఏమే నువ్వు తినే బ్రెడ్ గురించి పడుకునే బెడ్ గురించి చెప్తావ్ కానీ మీ నాన్న మినిస్టర్ అని చెప్పలేదు ఎంత ద్రోహం చేశావే అని అంటాడు. మేం ఉన్నాంలే కుమార్ అని ప్రేరణ అంటే ఏంటి నా తద్దినానికి ఉంటావా అని అంటాడు. నా గురించి చెప్తే నువ్వు భయపడుతావు అని చెప్పలేదు.. ఏం జరిగినా ఎవరికీ భయపడేదిలే నిన్ను వదులుకునేది లే అని నువ్వుకుంటూ బుగ్గగిల్లి పోతుంది. రేయ్ చూశారా దాన్ని ఇక్కడ నా గుండె గుబేల్ మంటుంటే బుగ్గ గిల్లి పోతుంది. నా పరిస్థితి ఏంట్రా అని కుమార్ అంటే నువ్వే చూసుకో మాకు తెలీదు అని సిద్ధూ భయపెడతాడు. కుమార్ పారిపోవాలని చూస్తే పట్టుకొని రారా పూజకు టైం అయింది అంటాడు.

ఇందిర భర్త దగ్గరకు వెళ్లి పాయసం తీసుకొచ్చా అని చెప్తుంది. రాజశేఖరానికి ఇందిర పాయసం తినిపిస్తుంటే ఈశ్వరి చూసి ప్రశ్నిస్తుంది. డాక్టర్ పాయసం పెట్టమన్నారు అంటుంది ఇందిర. దానికి ఈశ్వరి నువ్వు నా పని మనిషివి నువ్వు కేవలం పని చేయ్ ముందు దాన్ని బయట పడేయ్ అని తిడుతుంది. ఇందిర ఏడుస్తుంది.

సిద్ధూ ఇంట్లో పూజ మొదలవుతుంది. శైలు అందరికీ పువ్వులు ఇస్తుంది. మంజులు పూజ చేస్తుంది. పూజ అయిన తర్వాత మంగళ హారతి పాట పాడమని మినిస్టర్ చెప్తాడు. నా కూతురు సాహితి పాడుతుందని విజయానంద్ అంటే భక్తి పాట ఒక్కటి రాదని అంటుంది. మినిస్టర్ తన కూతుర్ని పాడమంటే గొంతు బాలేదు అని శైలు అంటుంది. ప్రేరణ పాడుతుందని సిద్ధూ చెప్తాడు. సాహితి, శైలు ప్రేరణని పాడమంటే అక్కర్లేదు నేనే పాడుతా అని మంజుల పాడుతుంది. మధ్యలో దగ్గు రావడంతో ప్రేరణ అందుకొని పాడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.