Nindu Manasulu Serial Today Episode రాజశేఖరం కనిపించడం లేదని ఇంటికి వచ్చిన గణకి ఈశ్వరి చెప్తుంది. నాన్న కనిపించకపోవడం ఏంటి అమ్మా అని గణ షాక్ అయిపోతాడు. ఇంట్లో ఎక్కడా లేరురా.. ఇందాక నుంచి వెతుకుతూనే ఉన్నాను అని ఈశ్వరి అంటుంది. గణ కూడా ఇళ్లంతా వెతుకుతాడు.

గణ తల్లితో పని మనిషి ఏదమ్మా అని అడుగుతాడు. అది కూడా ఇంట్లో లేదురా అని ఈశ్వరి అంటుంది. ఇంతలో ఇందిర, సుధాకర్ రాజశేఖరాన్ని తీసుకొని వస్తారు. గణ వాళ్లు చూసి షాక్ అయిపోతారు. ఎక్కడికి ఆయన్ని తీసుకెళ్లావ్ అని అంటాడు. నువ్వేంటి పని మనిషితో వచ్చావ్ అంటే నేనేం రాలేదు సార్ కింద కనిపిస్తే అలా వచ్చా అంటాడు. మా నాన్నని ఎక్కడికి తీసుకెళ్లావ్ అని గణ అడిగితే ఇందిర వణికిపోతూ హాస్పిటల్‌కి తీసుకెళ్లా అంటుంది.

గణ ఫుల్‌గా ఫైర్ అయిపోతాడు. నువ్వే ఎవరే మా నాన్నని తీసుకెళ్లడానికి.. ఏం అనుకుంటున్నావే నువ్వు పని మనిషివా ఈ ఇంటి మనిషివా అని తిడతాడు. ఏదో తెలీక చేసింది వదిలేయండి సార్ అని సుధా అంటే పళ్లురాలిపోతాయ్ సుధా దీన్ని చూస్తే నీకే తెలీకుండా చేసినట్లు అనిపిస్తుందా.. ఇది వంట పనుల కంటే మా నాన్న పనులే ఎక్కువ చేస్తుంది అని అంటాడు. నన్ను పనిలో పెట్టుకుందే అందుకు కదా బాబు అని ఇందిర అంటుంది. నీకు అంత ఇంట్రస్ట్ ఏంటి నీకు మా నాన్న అంటే అంత సెంటిమెంట్ ఏంటి.. గత జన్మ జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు. ఏయ్ గణ అని ఈశ్వరి కోప్పడుతుంది.

మనకు తెలీకుండా నాన్నని హాస్పిటల్‌కి తీసుకెళ్లింది ఏం అనుకోవాలి.. నేను తండ్రిని చూసుకోలేని అంత చవటని అనుకుందా అని అడుగుతాడు. క్షమించండి బాబు ఏదో తెలీక చేసేశా అని ఇందిర అంటే ఇప్పుడు నిన్ను క్షమిస్తే రేపు మమల్ని క్షమించే వాళ్లు ఉండరు అని అంటాడు. నువ్వు ఇక ఇక్కడ పని చేయొద్దు వెళ్లిపో అని గణ అంటాడు. ఇందిర గణ, ఈశ్వరి ఇద్దరినీ బతిమాలుతుంది. ఇక్కడ పని చేయకపోతే నాకు బతుకే లేదు అని చెప్తుంది. గణ మాత్రం ఇందిరను అక్కడ ఉండటానికి ఒప్పుకోడు.. వెంటనే వెళ్లిపోమని చెప్పి ఈడ్చుకెళ్లి బయటకు తోసేస్తాడు. అప్పుడే అమ్మా అంటూ ప్రేరణ పట్టుకుంటుంది.

గణ బిత్తరపోయి అమ్మా అని అంటాడు. ఇందిర కూడా షాక్ అయిపోతుంది. ప్రేరణ ఇందిరను లోపలికి తీసుకొస్తుంది. అమ్మేంటి తను మీ అమ్మా అని గణ అడుగుతారు. ఈ వయసులో ఉన్న ఎవరైనా నాకు అమ్మతో సమానమే అయినా మీరు ఏంటి పని మనిషి మీద ప్రతాపం చూపిస్తున్నారు అని ప్రేరణ అడుగుతుంది. అది నీకు అనవసరం అని గణ అంటాడు. అవసరమే అని ప్రేరణ అంటుంది. నువ్వు ఎవరే అని గణ అంటే ప్రతీ సారి చెప్పాలా నేను రాజశేఖరం బిడ్డని అని కావాలి అంటే నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని తిరుగు అంతే కానీ ఇలా అమాయకుల మీద నీ పోలీసుల బుద్ధి చూపించకు అంటుంది.

ఈశ్వరి అది ఏం చేసిందో తెలుసా నా భర్తని హాస్పిటల్‌కి తీసుకెళ్లిందని అంటుంది. తను తీసుకెళ్లలేదు నేను అపాయింట్ మెంట్ తీసుకుంటే తను తీసుకొచ్చిందని అంటుంది. నీకేం హక్కు ఉందా అంటే వీధిలోకి రా నా హక్కు ఏంటో తేల్చుకుందాం అని అంటుంది. గణ దాంతో మాటలు ఏంట్రా ముందు ఇందిరను తరిమేయ్‌రా అని అంటుంది. నా ఇంటి తిండి తింటూ దాని మాటలు వింటావా అని ఇందిరను తిడతాడు.

ఇందిర ఈశ్వరితో అమ్మ మీరు కాదు అంటే నాకు వేరే దారిలేదు తీసేయొద్దు అని అంటుంది. దాంతో ప్రేరణ నీకు ఏం అడ్డు ఉందమ్మా ఇక్కడ నీకు తీసేశారు ఎందుకు తీశారో నీకు అర్థమైంది కదా.. నువ్వు బయట వాళ్లకి చెప్పకుండా ఉంటావా.. వెళ్లమ్మా వెళ్లు అని అంటుంది. ఈశ్వరి షాక్ అయి వెళ్లాల్సింది నా ఇంటి పని మనిషి కాదు ఏయ్ గంగా నువ్వు అతన్ని లోపలికి తీసుకెళ్లు అని ఇందిరను పనిలో ఉంచుతుంది. ప్రేరణ వెళ్లిపోతుంది. గణ ఎందుకు పని మనిషిని ఉంచావ్ అంటే ఈ గొడవ ఇక్కడితో ఆపడం మనకే మంచిది అది పని మనిషిని అడ్డుపెట్టుకొని మన గురించి చెప్పాలి అనుకుంటుంది అని అంటుంది.

సిద్ధూతో కుమార్ బోర్ కొడితే చెప్పరా బీర్ తెస్తా మేడ మీదకు వెళ్లిపోదాం అంటే సిద్ధూ తిడతాడు. నువ్వు మీ ఊరు వెళ్లిపోరా అంటే నేను లేకుండా నువ్వు ఎలా బతుకుతావురా అని కుమార్ అంటాడు. ఈ జన్మలో ఈ ఇంటికి రాను అన్న నువ్వు రావడం ఏంట్రా అని డౌట్ కొడుతుంది అని కుమార్ అంటే నాకు అదే డౌట్రా కుమార్ అని సాహితి అంటుంది. ఈ రాక్షసి వల్లే వచ్చుంటావ్‌రా అని కుమార్ అంటాడు. నేను మా అమ్మ కోసం నా చెల్లి కోసం వచ్చా అంటాడు. సాహితి, సిద్ధూ, కుమార్ హ్యాపీగా మాట్లాడుకోవడం విజయానంద్ చూస్తాడు. ప్రేరణ వల్ల వచ్చానని సిద్ధూ చెప్పడంతో ఈ క్లారిటీ కోసమే వెయిట్ చేశా ఇప్పుడు నీ పని చెప్తా అని అనుకుంటాడు. ఇందిర ప్రేరణతో ఎందుకు అక్కడికి వచ్చావ్ అని అడుగుతుంది. ప్రేరణ రావడం వల్లే నువ్వ బతికావ్ అని అంటాడు సుధాకర్ దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.