Nindu Manasulu Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "నిండు మనసులు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు (అక్టోబరు 22న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మా ఇల్లు నా ఇష్టం..

ప్రేరణ సిద్ధూకి సేవలు చేయను అని ఐశ్వర్యతో గొడవ పడుతుంది. మీరు సేవలు చేస్తే చేయండి లేదంటే మానేయండి నన్ను ఎందుకు ఊరికే అక్కడికి పంపుతున్నారు అని అరుస్తుంది. ఆ మాటలు విన్న సిద్ధూ ఎందుకు ఇలా కారం తిన్న కాకుల్లా అరుస్తున్నారు. మీ అరుపులకు చిరాకు వస్తుంది అని అంటే మా ఇంట్లో మేం అరుచుకుంటే నీకేంటి ప్రాబ్లమ్.. నువ్వు కావాలనే మా గొడవలో తల దూర్చడానికి వచ్చావ్.. ఇది మా ఇంట్లో విషయం నీకు ఎందుకు అని ప్రేరణ అంటే నా గురించి మాట్లాడుతూ ఉంటే నేను రావడం మానేస్తానా.. ఏమైనా ఉంటే నా గురించి నాతో చెప్పు.. ఎంత మీ ఇల్లు అయినా నా గురించి నీకు మాట్లాడే హక్కు లేదు అని సిద్ధూ అంటే నువ్వు ఈ ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు.. ఎప్పుడెప్పుడు 3 నెలలు అయిపోతాయా అని చూస్తున్నా అని ప్రేరణ అంటే నువ్వు ఎందుకు కలిశావా అని నేను బాధ పడుతున్నా అని సిద్ధూ అంటే కరెక్ట్ నీ వల్ల నాకు ఈ బాధ తప్ప ఇంకేం లేదు అని అంటుంది. నీ వల్ల మనుషులు విడిపోతారు కానీ దగ్గర కాలేరు అని సిద్ధూ అంటాడు.

ముఖ్యమైన విషయం చెప్పాలి..

గణ జరిగింది మొత్తం ఆలోచిస్తూ ఇన్ని రోజులు సిద్ధూ బావని తప్పుగా అర్థం చేసుకున్నా.. ప్రేరణ కూడా తొందర పడింది వెంటనే విషయం ప్రేరణకు చెప్పాలి అని ప్రేరణకు కాల్ చేస్తాడు. ప్రేరణ ఫోన్ కట్ చేస్తే గణ మళ్లీ చేస్తాడు. మీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే నాకు ఇప్పుడు ఏం వినాలి అని లేదు.. నన్ను విసిగించకు ఏమైనా చెప్పాలి అంటే రేపు స్టేషన్‌లో చెప్పు అని ఫోన్ పెట్టేస్తుంది.

మనం సిద్ధూని తప్పుగా అర్థం చేసుకున్నాం..

గణ ఉదయం స్టేషన్‌కి వెళ్లిన తర్వాత ప్రేరణ దగ్గరకు వెళ్లి.. ఇది మీకు చాలా ముఖ్యమైన విషయం. కొంచెం జాగ్రత్తగా వినండి. నిజం చెప్పాలంటే ఇది మనిద్దరికీ సంబంధించిన విషయం. ఒక అబద్ధాన్ని నిజం అనుకుని తప్పుగా అర్థం చేసుకున్నాం. రాజశేఖరం గారిని అంటే నాన్నని మన నాన్నని ఎవరు కాల్చోరో నాకుతెలిసింది అని అంటాడు. దానికి ప్రేరణ అసలు మీకేమైంది గణా? ఇది చెప్పడానికి నాకు ఫోన్ చేశారా? ఇది నాకు ముఖ్యమైన విషయం ఎలా అవుతుంది? అది మర్చిపోని పీడ కల. ఆ రోజు సిద్ధూ నాన్నని కాల్చడం మీరు కళ్లారా చూశారు కదా. సిద్ధూ నాన్నని కాల్చలేదు అని బుకాయించాడు అని అంటుంది. ఆ రోజు సిద్ధూ నిజమే చెప్పాడు. మననే ఆవేశంలో తప్పుగా అర్థం చేసుకున్నాం అని గణ అంటాడు. గణ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థవుతుందా? మనం తప్పుగా అర్థం చేసుకోవడమేంటి? అన్నీ తెలిసికూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావ్. ఆ రోజు సిద్ధూనీ అరెస్ట్ చేసింది కూడా నువ్వే కదా అని అంటుంది.

సిద్ధూ తప్పు చేయలేదు..

అరెస్ట్ చేయడం నిజమే. కానీ సిద్ధూ తప్పు చేయలేదు. ఆ రోజు సిద్ధూ తన మీద పెట్టిన కేసు నుంచి బయటకు వస్తే మానిప్యులేట్ చేసి వచ్చాడని అనుకున్నా. కానీ నిజాయితీతో కడిగిన ముత్యంలా బయటకొచ్చాడు. అప్పుడు ఇన్వెస్టిగేషన్ రిపోర్టులో వచ్చిందే నిజం. అవును నాన్న బాడీలో దిగిన బుల్లెట్ సిద్ధూ గన్ లోంచి రాలేదు. ఆ బుల్లెట్ మొన్న మేం పట్టుకున్న కిల్లర్ గన్ లోంచి వచ్చింది. మీరు నమ్మరు అని నాకు తెలుసు. అందుకే ప్రూఫ్స్‌తో వచ్చాను. అని సాక్ష్యాలు చూపిస్తాడు. ప్రేరణ సాక్ష్యాలు చూసి బిత్తరపోయి గణ నాకేం అర్థం కావట్లేదు. నువ్వు నిజం చెప్తున్నావా? అని అడుగుతుంది. దానికి గణ నిజం చెప్పాలంటే ఆ రోజు సిద్ధూ నాన్నని గన్‌తో బెదిరించాలని చూశాడు. కాల్చలేదు. మనం అక్కడున్న పరిస్థితిని సిద్ధూ చేతిలో ఉన్న గన్ ని మాత్రమే చూసి తానే నాన్నని షూట్ చేశాడని బలంగా నమ్మాం. కానీ అదే మనం చేసిన తప్పు. ఇన్ని రోజులు నాకు సిద్ధూ మీద చాలా కోపం ఉండేది. సిద్ధూకి కూడా నామీద అదే కోపం ఉంది అనుకున్నాను. నేను చచ్చే పరిస్థితి వస్తే వీడు పోవాలని కోరుకుంటాడేమో అనుకున్నాను. కానీ తనకి నామీద అలాంటి నెగెటివ్ ఫీలింగ్ లేదు. రీసెంట్గా జరిగిన ఆపరేషన్ లో తన ప్రాణాన్ని లెక్క చేయకుండా నన్ను కాపాడిన వ్యక్తి సిద్ధూ. అలాంటి సిద్ధూ ఇంకొకరి ప్రాణాలు తీస్తాడని నేను అనుకోవట్లేదు. ఫైనల్ గా అదే నిరూపితమైంది.. అని అంటాడు.

జీవితంలో ఫస్ట్ టైం మీకు నేను చేస్తున్న సాయం ఇదే..

ప్రేరణ గణతో నువ్వు చెప్పింది నిజమని నేనెందుకు అనుకోవాలి తను నిన్ను కాపాడినందుకు అతనూ నువ్వు కలిసి నన్ను నమ్మిస్తున్నారనుకోవచ్చు కదా? అని అంటే దానికి గణ నేను ఎప్పటికీ అలాంటి పని చేయను. నా ఒంట్లో కూడా రాజశేఖరం రక్తమే ప్రవేశిస్తోంది అలాంటి మోసం నేను ఎప్పటికీ చేయను మేడం మీకు నా మాటల మీద నమ్మకం కలగకపోతే ఇవే రిపోర్ట్స్ ఇవే డీటైల్స్ మీకు తెలిసిన ఫారెన్సిక్ వాళ్లతో టెస్ట్ చేయించుకొని కన్ఫర్మ్ చేసుకోండి.. కానీ అక్కడ కూడా ఇదే నిజమని వస్తుంది మేడం సిద్ధూ తప్పు చేయలేదు, సిద్ధూ నాన్నని షూట్ చేయలేదు.. మీ అధికారాన్ని ప్రతి సాధారణమైన మనిషికుండే అహంకారాన్ని దాటుకొని నిజమైన ప్రేరణగా ఆలోచించండి అప్పుడు మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు. ఈ విషయం సిద్ధూకి చెప్పి తన మీద పెంచుకున్న కోపాన్ని వదిలేసుకోండి.. ఈ విషయం మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ ఇప్పటికీ చెప్పకపోతే నేను అసలు మనిషినే కాదు.. నా ప్రాణాన్ని కాపాడిన సిద్ధూకి నేను అన్యాయం చేయకూడదు అనుకుంటున్నాను నా జీవితంలో ఫస్ట్ టైం నేను మీకు చేస్తున్న సాయం అనుకోండి నేను చెప్పాల్సిన మీరు తెలుసుకోవసిన నిజం చెప్పాను వీలైనంత తొందరగా మీరు సిద్ధూకి చెప్పి క్షమాపణ చెప్పి అతనితో కలిసిపోండి అని గణ ప్రేరణకు చెప్తాడు.

సిద్ధూకి సారీ చెప్పిన ప్రేరణ..

ప్రేరణ నిజం తెలిసి కుమిలిపోతూ సిద్ధూకి ఈ నిజం ఎలా చెప్పాలి? తనని ఎలా ఫేస్ చేయాలి? నిజం తెలిసిన తర్వాత కూడా చెప్పకపోతే అది నా తప్పు అవుతుంది మోసం అవుతుంది తల దించుకోవాల్సి వచ్చినా పర్వాలేదు కానీ నిజం చెప్పి తీరాల్సిందే అని సిద్ధూ దగ్గరకు వెళ్లి నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. దానికి సిద్ధూ ఈ మధ్య చాలా మాట్లాడుతున్నావు కదా అని అంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం సిద్ధూ.. నువ్వు నన్ను క్షమించాలి.. నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. మా నాన్న మీద జరిగిన అటాక్ విషయంలో నా కళ్లతో చూసిందే నిజం అనుకున్నా. కానీ అది అబద్ధమని నాకు ఇప్పుడే తెలిసింది. ఆరోజు జరిగిన గొడవలో నీ చేతిలో గన్ ఉండడం నాన్నకి బుల్లెట్ తగలడం చూసి నువ్వే చేశావు అనుకున్నాను. కానీ నువ్వు మా నాన్నను కాల్చలేదు అన్న నిజం నాకు ఇప్పుడే తెలిసింది రిపోర్ట్లో కూడా మా నాన్న బాడీలో ఉన్న బుల్లెట్ నీ గన్ లో నుంచి వచ్చింది కాదు అని తేలింది సారీ సిద్ధూ, ఐ యామ్ రియల్లీ సారీ నిన్ను అపార్ధం చేసుకున్నాను, నిన్ను నానా మాటలు అన్నాను, అసహ్యించుకున్నాను నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది సిద్ధూ దయచేసి ఈ విషయంలో నన్ను క్షమించు అని అంటుంది. సిద్ధూ మౌనంగా ఉండటం చూసి నువ్వు అలా మౌనంగా ఉంటే నేను బరించలేను.. నువ్వు ఇలా ఏమీ మాట్లాడకుండా నావైపు చూస్తుంటే నేను తట్టుకోలేను నీ మౌనమే నన్ను వంద ప్రశ్నలు అడుగుతున్నట్టుగా ఉంది నీ చూపులే నన్ను వెలెత్తి చూపుతున్నట్టుగా ఉంది నేను చేసినది తప్పని ఒప్పుకుంటున్నాను కదా ప్లీజ్ సిద్ధూ, నన్ను క్షమించు. అని అంటుంది. దానికి సిద్ధూ అయ్యో, ఎందుకు ప్రేరణ పదే పదే క్షమించు క్షమించు అన్నన్నిసార్లు అడుగ్తావు? నువ్వు అన్నిసార్లు అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు ఇప్పుడు నిన్ను క్షమించకుండా ఎలా ఉంటాను అని అంటాడు. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.