Nindu Manasulu Serial Today Episode ప్రేరణ, సిద్ధూ రిటర్న్‌ అవుతారు. సిద్ధూ డల్‌గా ఉండటం చూసి ప్రేరణ ఇక ఆ మేటర్ వదిలేయ్ నవ్వు అని చెప్తుంది. మీ నాన్న చెప్పినట్లు ఇంట్లో కేక్ కట్ చేయాల్సింది కదా అంటుంది. అది జరగదు అని సిద్ధూ అంటాడు. మీ చెల్లి కోసం ఆలోచించాల్సింది అని ప్రేరణ అంటే లోపలికి వెళ్లడానికి నా క్యారెక్టర్ ఒప్పుకోదు అని అంటాడు.

ప్రేరణ సిద్ధూతో నీ క్యారెక్టర్ రోడ్డు మీద ఐస్‌క్రీమ్ తినడానికి ఒప్పుకుంటుందా నాకు ఐస్‌క్రీమ్ తినిపించు అని అంటాడు. గణకి విజయానంద్ కాల్ చేసి సిద్ధూ, ప్రేరణని ఎందుకు వదిలేశావ్ కాఫీ షాప్ కూడా పెట్టేశారు నువ్వేంటి చేతులు కట్టుకొని కూర్చొన్నావ్ అని అంటాడు. సార్ ఆఫ్ట్రాల్ ఓ కాఫీ షాప్ చూసి ఎందుకు అంత కంగారు పడుతున్నారు అని గణ అంటాడు. రేపు ఈ టైంకి గుడ్ న్యూస్ వింటారని గణ అంటాడు.

సుధాకర్ గణ దగ్గరకు వచ్చి సిద్ధూ, ప్రేరణ కాఫీ షాప్ ఓపెన్ చేయాలని మీరు అనుకున్నారు వాళ్లని ఆశీర్వదించారు. ఓపెనింగ్ బ్రహ్మాండం జరిగిందని అంటాడు. చిన్న కాఫీ షాప్కే అంత బిల్డప్ ఇస్తున్నారువాళ్ల పని చెప్తా అని అంటాడు. సుధాకర్ గణని తిట్టుకుంటాడు.

ప్రేరణ, సిద్ధూ ఇద్దరూ ఐస్‌క్రీమ్ తింటుంటారు. ప్రేరణ సిద్ధూకి విజయానంద్‌ గురించి అడిగితే ఆయన టాపిక్ ఎత్తితే నిన్ను ఇక్కడే వదిలేస్తా అని సిద్ధూ అంటాడు. వద్దు వద్ద అని ప్రేరణ అంటుంది. మనం అంటే ఆ మాత్రం భయం ఉండాలి అని సిద్ధూ అంటాడు. ఇక ప్రేరణకు రోడ్డు మీద గతంలో తాను పోగొట్టుకున్న చెవిపోగు కనిపిస్తుంది. ఇదేంటి అనుకుంటుంది. ఎవరికి దొరికిందో దొంగముఖాలు అని నాకు ఇవ్వలేదు అని తిడుతుంది. వాళ్లని తిట్టొద్దు అని సిద్ధూ అంటే ప్రేరణ తిడుతుంది. నేను వాళ్లకి తిడితే నీకు ఏంటి ప్రాబ్లమ్ అని ప్రేరణ అంటుంది.

ప్రేరణ సాహితికి కాల్ చేసి అన్నయ్యకి కాస్త దూరంగా రండి.. రేపు కేఫ్‌లో నేను భర్త్డే చేసుకుంటా. అమ్మానాన్న ఒప్పుకున్నారు.. మీరే చూసుకోండి అని అంటుంది. ఇక ప్రేరణ సిద్ధూతో రేపు కేఫ్‌లో భర్త్‌డే సెలబ్రేషన్స్ చేయమని ఓ ఆర్డర్ వచ్చింది అన్నీ మనమే చేయాలని అంటుంది. సిద్ధూ హ్యాపీగా ఫీలవుతూ ఈ టైంలో అర్డర్ ఏంటి అని అంటాడు. నీకు అర్డర్ ముఖ్యం కాదా అవన్నీ వదిలేయ్ అంటుంది.

సుధాకర్ ఇందిర దగ్గరకు వెళ్లి గణ కేఫ్‌ని ఏదో చేయాలనుకుంటున్నాడని అది ప్రేరణకి చెప్పాలి అనుకుంటున్నా అని అంటాడు. ప్రేరణ ఇంకా రాలేదు అని కంగారు పడతారు. ఎందుకు ఇంత లేటు అయింది అని ఇందిర అడుగుతుంది. సిద్ధూ వాళ్ల చెల్లి భర్త్‌డే అని వెళ్లాం అని అంటుంది. ప్రేరణతో సుధాకర్ గణ విషయంలో జాగ్రత్తగా ఉండమని మీ కాఫీ షాప్ క్లోజ్ చేయించాలని అనుకుంటున్నాడు జాగ్రత్తగా ఉండు అని అంటాడు. దేన్ని అయినా మేం ఎదుర్కొంటాం దాన్ని మా నుంచి దాన్ని ఎవరూ వేరు చేయలేరు అని అంటుంది. వాడి ప్లాన్ నేను తెలుసుకొని చెప్తా అని అంటాడు.

ఉదయం సిద్ధూ పడుకొని ఉంటే ప్రేరణ వెళ్లి బెడ్ షీట్ లాగేస్తుంది. సిద్ధూ కుమార్ అనుకుంటాడు. ఏమైంది అని ప్రేరణని అడిగితే చేసింది అంతా చేసి అబద్ధం చెప్తావేంటి అని అడుగుతుంది. ఏమైందని సిద్ధూ అడిగితే నా చెవి పోగు నీదగ్గరే ఉంటే అబద్ధం ఎందుకు చెప్పావ్ అని అంటుంది. నా దగ్గర ఏం లేదు అని సిద్ధూ అంటే ప్రేరణ అక్కడే ఉన్న పోగు చూపిస్తుంది. సిద్ధూ కవర్ చేస్తాడు. దొరికిన రింగ్ ఎందుకు ఇవ్వలేదు అని ప్రేరణ అడుగుతుంది. మర్చిపోయా అని సిద్ధూ అంటాడు. తీరా చూస్తే ఇదంతా సిద్ధూ కల. కుమార్ వచ్చి అడిగితే పొద్దున్నే మంచి కల చెడగొట్టేశాడని అంటాడు. మరోవైపు కేఫ్‌లోకి గణ మనిషి వెళ్లి డ్రగ్స్ కలిపేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.