Nindu Manasulu Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "నిండు మనసులు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు (అక్టోబరు 14న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ రౌడీ చాలా డేంజర్..

గణ దగ్గరకు ఓ అధికారి వచ్చి ఓ పెద్ద క్రిమినల్‌ ఫొటో ఇచ్చి ప్రేరణ మేడం ఈయన గురించి తెలుసుకోమన్నారు.. చాలా డేంజర్ వీడు.. అని ఫుల్ డిటైల్స్ ఎస్‌ఐ గణకి చెప్తాడు. ఇంకా ఏదైనా సమాచారం తెలిస్తే చెప్పండి.. నేను చూసుకుంటా అని గణ చెప్తాడు. గణ ఆ రౌడీ ఫొటో చూస్తే ఎవరి ద్వారా నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నావో నిన్ను పట్టుకుంటే తెలుస్తుంది అని అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే విజయానంద్‌ని చూపిస్తారు.

నువ్వు చచ్చిపో..

విజయానంద్ రాజశేఖరం గురించి ఆలోచిస్తూ వీడి మీద మంజులకు కూడా సంపథీ వచ్చేసింది.. నిజం తెలిసేలోపు రాజశేఖరాన్ని చంపేయాలి అనుకుంటాడు. ఇక రాజశేఖరాన్ని పిలిచి మాట్లాడుతాడు. ఆ రోజు నిజం చెప్పాలి అనుకున్నావ్ కానీ ఏం జరిగిందో చూశావ్ కదా.. ఆ రోజు నిజం చెప్పించకపోయి ఉంటే కనీసం నీ కూతురు నా ఇంట్లో సంతోషంగా ఉండేది కదా.. వాళ్లు విడిపోవడానికి కారణం నువ్వేరా.. వాళ్లు కలిసి ఉండాలి అంటే నువ్వు ఈ లోకం నుంచి వెళ్లిపోవాలి.. సీరియస్‌గా చెప్తున్నా రాజశేఖరం.. నువ్వు చచ్చిపోతే వాళ్లు కలిసిపోతారు. నేను ఎన్ని సార్లు నిన్ను చంపాలి అనుకున్నా నేను చంపలేకపోతున్నా.. నిన్ను కారుతో గుద్దించింది కూడా నేనే.. నీ చావు వెనక ప్రతీ సారి నేనే ఉన్నా అని విజయానంద్ అంటాడు. దానికి రాజశేఖరం ఆ రోజు గన్‌తో కాల్చడం వెనక నువ్వే ఉన్నావా అని రాజశేఖరం అంటే తెలిసిపోయిందా అని విజయానంద్ అంటాడు. కనీసం నువ్వు చనిపోతే నిన్ను చంపాలి అనుకున్న సిద్ధూ కోపం తగ్గిపోతుంది. జాలి పడి ప్రేరణతో మళ్లీ కలిసి ఉంటాడు అని విజయానంద్ చెప్పి బాగా ఆలోచించు.. నువ్వు లేకపోతే ప్రేరణ జీవితం బాగుంటుంది అని విజయానంద్ అంటాడు.

మామని కాపాడి ఇంటికి తెచ్చిన సిద్ధూ..

విజయానంద్ మాటలు విన్న రాజశేఖరం నాకు సిద్ధూ, ప్రేరణలు కలిసి ఉండటం ముఖ్యం ఇప్పుడే చేయాలి అని ఆలోచించుకుంటూ రోడ్డు మధ్యలో నడుచుకుంటూ వెళ్తాడు. ఇంతలో విజయానంద్ తన మనిషికి చెప్పి రాజశేఖరాన్ని గుద్దేయాలి అని అంటాడు. రాజశేఖరాన్ని కారు ఢీ కొట్టే టైంకి సిద్ధూ కాపాడి ఇంటికి తీసుకొస్తాడు. ప్రేరణ ఏమైంది అని అడిగితే ఈ పెద్ద మనిషి కూతురు అల్లుడు కోసం ఆలోచించి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే యాక్సిడెంట్ అవ్వబోయింది.. అని మీ నాన్న చనిపోయినా ఆ నింద నా మీద వేసినా మీ అక్క వేస్తుంది ఐశ్వర్య అని సిద్ధూ అంటాడు. ఈ రోజు కాపాడావు కానీ ఆ రోజు నువ్వే అంతా చేశావ్ అని ప్రేరణ అంటుంది.

ఆరు నెలలు కలిసి ఉండండి..

సిద్ధూ, ప్రేరణలు రెండు కుటుంబాలతో కలిసి జడ్జి దగ్గరకు వెళ్తారు. జడ్జి ప్రేరణ వాళ్లతో మీకు పెళ్లయి మూడున్నర ఏళ్లు అయినా కేవలం ఆరు నెలలే కలిసి ఉన్నారు.. అందుకే ఇద్దరూ మరో ఆరు నెలలు కలిసి ఉండాలి అని జడ్జి అంటారు. ప్రేరణ సిద్ధూ వద్దు అంటారు. జడ్జి కుదరదు అని మీ ఇద్దరూ 6 నెలలు ఒకే ఇంట్లో ఉండాలి.. అప్పుడు మీలో మార్పు వస్తుంది అని అంటారు. కుదరదు అని ప్రేరణ, సిద్ధూ అంటే మీరు నాకు చెప్పడం కాదు.. నేను చెప్పింది మీరే వినాలి. ఆరు నెలలు కలిసి ఉంటే ఎక్కడ కలిసిపోవాలి అని భయపడుతున్నారు.. ఏది ఏమైనా మీరు కలిసే ఉండాలి అని జడ్జి అంటారు. నేను వాళ్ల ఇంటికి వెళ్లను అని సిద్ధూ అంటే నాకు మాత్రం మీ ఇంటికి రావడం ఇష్టం అంటాను అనుకున్నావా నేను రాను అని ప్రేరణ అంటే మీరు ఎవరి ఇంట్లో ఎవరు ఉంటారో మీ ఇష్టం.. కానీ కలిసే ఉండాలి.. కాదు కూడదు అని అంటే మీకు విడాకులు ఇవ్వను అని అంటారు. రాజశేఖరం విజయానంద్‌ దగ్గరకు వెళ్లి హగ్ చేసుకొని నువ్వు సూపర్ విజయానంద్ వాళ్లు 6 నెలలు కలిసి ఉండాలని నువ్వు చెప్పకపోయింటే జడ్జి ఇద్దరినీ కలిపి ఉంచే వాళ్లు కాదు.. నువ్వు సూపర్ అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.