Nindu Manasulu Serial Today November 27th: నిండు మనసులు: రేపే గణ, సాహితిల నిశ్చితార్థం! సిద్ధూ, ప్రేరణలు చేతులు కలపడానికి కారణమేంటి?
1 week ago 1
ARTICLE AD
Nindu Manasulu Serial Today Episode గణతో సాహితి పెళ్లి చేయాలన్న విషయం విజయానంద్ ఇంట్లో చెప్తాడు. సాహితి కూడా ఓకే చెప్తుంది. సిద్ధూ ఎంత వద్దు అని చెప్పినా ఎవరూ వినరు. ఇక గణ సాహితికి కాల్ చేసి మాట్లాడుతాడు. సాహితి గణతో మాట్లాడుతూ ఉంటే సిద్ధూ వస్తాడు.
సిద్ధూ సాహితితో నేను ఈ పెళ్లి వద్దు అన్నది పెద్దాయన్న ఎదురిస్తుంది నీ కోసమే.. ఆ గణని నమ్మొద్దు అని అంటాడు. ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు అన్నయ్యా.. అమ్మానాన్నలు ఏం చెప్తే నేను అది చేస్తా అంటుంది. గణ గారు అంటే నీకు తప్పుడు అభిప్రాయం ఉంటే నాకూ తప్పుడు అభిప్రాయం ఉండాలా.. అని అంటుంది. సిద్ధూఎంత చెప్పాలి అని ప్రయత్నించినా సాహితి వినదు. గణని పెళ్లి చేసుకుంటా నన్ను ఇబ్బంది పెట్టకు అని అన్నతో చెప్తుంది.
విజయానంద్ దగ్గరకు సిద్ధూ వెళ్లి ఇప్పటి వరకు మా అమ్మని మానిప్యులేట్ చేశావ్.. ఇప్పుడు సాహితిని చేస్తున్నావ్.. తెలిసి తెలిసి సాహితి జీవితంతో ఆడుకుంటున్నావు అంటే దీని వెనక ఏదో బలమైన కారణమే ఉంటుంది. వాడి గురించి నీకు తెలుసు.. అయినా పట్టు పట్టి సాహితి నోటే ఈ పెళ్లి ఇష్టం అనిపించి ఈ పెళ్లి చేయాలి అనుకుంటున్నావ్ అంటే ఎవరికీ తెలీయని ఏదో పెద్ద రహస్యమే నీ వెనక ఉంది. నేను అంటే నీ కొడుకు కాదు.. నన్ను నాశనం చేయాలి అని నువ్వు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు.. కానీ సాహితి నీ కన్న కూతురే కదా.. అయినా నువ్వు ఇలా మోసం చేయాలి అనుకుంటున్నావ్ అంటే దీని వెనక ఏదో ఉంది.. నువ్వు ఊహించని అపాయం ఏదో జరుగుతుందని భయంతో ఇలా చేస్తున్నావ్.. నీకు లాభం వస్తుంది అంటే కన్న కూతుర్ని రోడ్డు మీద పెట్టి అమ్మేస్తావ్ కూడా అంత నీచుడువి నువ్వు అని సిద్ధు అంటాడు. ఆ మాటలు విన్న మంజుల సిద్ధూ అని అరుస్తుంది.
సాహితి తనని అర్థం చేసుకోవడం లేదని సిద్ధూ ప్రేరణ దగ్గర బాధపడతాడు. నా మాట అంటే వినే నా చెల్లి నన్ను ఎదురిస్తుంది.. నా బాధ నా ఆవేధన ఏ ఒక్కరికీ అర్థం కావడం లేదు అని అంటాడు. గణకి ఆయనకు అల్లుడు అయ్యే హక్కులేదు కానీ ఆయన మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్లు లేరు సిద్ధూ అని ప్రేరణ అంటుంది. ఆ మనిషి తనకు లాభం ఉంటుంది అంటే ముందు వెనక ఆలోచించడు అని అంటుంది. అయినా సాహితికి ఆ గణ గురించి ఎంత చెప్పినా వినడం లేదు వాడినే మంచోడిని గొప్పొడిని చేసి మాట్లాడుతుంది అని బాధ పడతాడు.
విజయానంద్ ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాడు అని ఇద్దరూ ఆలోచిస్తారు. సంబంధం మాట్లాడినంత ఈజీ కాదు పెళ్లి చేయడం ఈ లోపు వాడి బుద్ధి అందరికీ తెలిసేలా చేద్దాం.. నేను ఒక ఆడపిల్లనే వాడి గురించి ఆ ఆడపిల్లకి తెలిసేలా చేస్తా అని సిద్ధూ చేతిని తన చేతిలోకి తీసుకొని నీకు ఎవరూ లేరు అనుకోవద్దు నీకు నేను ఉన్నా.. సాహితిని ఆ దుర్మార్గుడి చేతి నుంచి కాపాడుకుందాం అని అంటుంది. సిద్ధూ ప్రేరణకు థ్యాంక్స్ చెప్తాడు. ఒంటరిగా ఉన్న ప్రతీసారి నాకు నువ్వు అండగా ఉంటున్నావ్ అంటాడు.
విజయానంద్, మంజుల పంతులుని పిలిపించి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టమని అంటారు. రేపే మంచి ముహూర్తం అని పంతులు చెప్తాడు. సిద్ధూ రాగానే మంజుల విషయం చెప్తుంది. మీకు నచ్చినట్లు సంబంధం చూశారు.. మీకు నచ్చింది చేస్తున్నారు.. మధ్యలో నాకు చెప్పడం అడగటం ఏంటి.. మీకు నచ్చింది చేసుకోండి అని సిద్ధూ వెళ్లిపోతాడు.
గణ ఇంటికి ప్రేరణ వెళ్తుంది. నాన్నని చూడటానికి వచ్చింది చూసి వెళ్లిపోతుందిలే అని గణ తల్లితో చెప్పి వెళ్లి చూసిరా అని అంటాడు. ప్రేరణ తండ్రి దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Read Entire Article