Nindu Manasulu Serial Today Episode గణ విజయానంద్‌కి బ్లాక్‌మెయిల్ చేస్తాడు. దానికి విజయానంద్ నీ దగ్గర ఈ ఫైల్ ఉండొచ్చు.. కానీ నేను తలచుకుంటే నువ్వే లేకుండా చేయగలనురా అని అంటాడు. ఈ ఫైల్‌ అడ్డు పెట్టుకొని నువ్వు నన్ను టచ్ కూడా చేయలేవు అని అంటాడు.

గణ విజయానంద్‌తో ఆవేశ పడుతున్నారు సార్ ఆలోచించడం లేదు.. మీరు ఒక శిఖరం.. పోలీసుల్ని గుప్పెట్లో పెట్టుకోగలరు.. ప్రపంచాన్ని మోసం చేయగలరు.. నన్ను కూడా కనిపించకుండా చేయగలరు కానీ సిద్ధూ అనే ఒకడు ఉన్నాడు సార్.. మీ కొడుకు కాని కొడుకు.. మీ వాళ్ల అన్యాయం అయిపోయింది వాడు కదా.. మీ వల్ల సొంత తండ్రిని కోల్పోయింది వాడు కదా.. మామూలుగా సిద్ధూకి ఓపిక తక్కువ.. నిజం తెలిస్తే ఏం చేస్తాడో తెలుసు కదా.. ఇక సిద్ధూ తల్లికి అదే సార్ మీ భార్యకి తెలిస్తే.. సిద్ధూకి మీరు చేసిన అన్యాయం.. తెలిస్తే మీ జీవితం పేకమేడల్లా కూలిపోతుంది అని బెదిరిస్తాడు. నాలాంటి వాడికి నిజం తెలిస్తే మీ అద్దాల మేడ పగిలిపోతుంది సార్ అని అంటాడు. విజయానంద్‌ కోపంతో వెళ్లిపోతాడు.

రంజిత్ ఐశ్వర్యని తీసుకొని తన ఫ్రెండ్ సంగీత క్లాస్‌లకు తీసుకొస్తాడు. శ్రద్ధగా నేర్చుకో అని చెప్తాడు. గురువుగారు ఐశ్వర్యని టెస్ట్ చేసి నెలకు పది వేలు అవుతుంది అని అంటాడు. అంత డబ్బు నేను ఇవ్వలేను వెళ్లిపోదాం అని ఐశ్వర్య అంటే రమణ నేను ఫీజు కడతా అని రంజిత్ చెప్తాడు. ఐశ్వర్య రంజిత్‌కి థ్యాంక్స్ చెప్తుంది.

విజయానంద్ గణ చేసిన బ్లాక్‌మెయిల్ గుర్తు చేసుకొని సిద్ధు తనని పొడిచేసినట్లు కలగంటాడు. మంజు భయంతో ఏమైంది ఎందుకు అలా ఉలిక్కి పడ్డారు అని అడుగుతుంది. మన సిద్ధూ బిజినెస్‌లు చూసుకుంటే నేను హాయిగా రెస్ట్ తీసుకునేవాడిని అని విజయానంద్ అంటే అది జరగదులే అని మంజుల అంటుంది. ఇక సిద్ధూని భోజనానికి పిలుస్తుంది.

విజయానంద్‌ సిద్ధూని చూసి డైనింగ్ టేబుల్ మీద ఉన్న చాకు దాచేసి లేచి నిల్చొంటాడు. సిద్ధూ పక్కన కూర్చొడానికి భయపడి ఎదురుగా కూర్చొంటాడు. సిద్ధూని చూసి విజయానంద్‌ చాలా కంగారు పడతాడు. మంజుల కొడుకుతో మీ నాన్న ఊరికే టెన్షన్ పడిపోతున్నారురా అంటుంది. టెన్షన్ ఏం లేదు అని విజయానంద్ అంటాడు. ఇక సాహితి భోజనానికి వచ్చి మంజులతో గణ గారు కాల్ చేశారు.. నీకు థ్యాంక్స్ చెప్పమన్నారు అని అంటుంది. సిద్ధూ, విజయానంద్ కోపంగా చూస్తారు. రెండు మూడు రోజుల్లో అనుకున్నది సాధిస్తాడంట.. దానికి కారణం నువ్వు చెప్పిన గుడి గురించే అంట అని చెప్తుంది. ఏయ్ ఏంటే నీ గోల ప్రశాంతంగా తిననివ్వవా.. తింటుంటే గోల చేస్తున్నావ్ అని అరిచి వెళ్లిపోతాడు.

సాహితి హర్ట్ అయిపోతుంది. ఇక విజయానంద్‌కి మినిస్టర్ కాల్ చేసి త్వరగా రమ్మని చెప్తాడు. ప్రేరణ సిద్ధూ గురించి ఆలోచిస్తూ వంట చేస్తూ కూర మాడ్చేస్తుంది. ఇందిర చూసి ఏమైంది అని అడుగుతుంది. ప్రేరణ ఏం లేదు అనేస్తుంది. ఏమైందని ఇందిర రెట్టించి అడుగుతుంది. ప్రేరణ తల్లితో ఒకరు తన ఫ్రెండ్ ప్రేమని గెలిపించాలి అనుకుంటున్నారు.. ఇంకొకరు బంధాలు నిలబెట్టాలి అనుకుంటున్నారు.. ఏది తప్పు కాదు ఏది రైట్ కాదు అని అంటుంది. ఇద్దరూ మంచి కోసమే పాటు పడుతున్నారు.. కానీ దారులు వేరు అని ఇందిర అంటుంది. ఇద్దరూ పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి అంటుంది. ఈ విషయం మొత్తం సిద్ధూ గురించేనా అని ఇందిర అంటే అవును అని ప్రేరణ అంటుంది. తను ఎప్పుడూ తను అనుకున్నదే చేయాలి అనుకుంటాడు అంటే సిద్ధూ బాబు మంచోడు.. ఈ రోజు తన ఆలోచన తప్పు అనుకుంటారు కానీ రేపు అది కరెక్ట్అవుతుంది అని అంటుంది. సిద్ధూని తిట్టాను అని ప్రేరణ అంటుంది. సిద్ధూ నీ కంటే తెలివైన వాడు అది గమనించు అని ఇందిర అంటుంది. ప్రేరణ తల్లి మాటలను ఆలోచిస్తూ ఉంటుంది. పాపం సిద్ధూ ఏం అనుకుంటున్నాడో ఏంటో అని బాధ పడుతుంది. వెంటనే సిద్ధూకి కాల్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.