Nindu Manasulu Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "నిండు మనసులు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(జూన్‌ 22న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అక్కడ ఏదో జరిగింది సిద్ధూ..

సిద్ధూ, ప్రేరణ ఇద్దరూ పెన్‌డ్రైవ్‌లోని ఫుటేజ్ చూస్తారు. సాహితితో పాటు మొత్తం పది మంది పార్టీకి అటెండ్ అవుతారు. అందులో చివరకు సాహితి, వరుణ్ మాత్రమే ఉండటం.. అక్కడికి గణ రావడం.. తర్వాత సాహితి టెన్షన్ పడటం.. వరుణ్ మిస్ అవ్వడం.. గణ సాహితో మాట్లాడి తీసుకెళ్లిపోవడం అన్నీ చూస్తారు. సాహితి ఫ్రెండ్ వరుణ్ మిస్ అవ్వడం ఇలా మొత్తం చూసి సాహితి ఫ్రెండ్స్‌ని ఎంక్వైరీ చేయాలి అనుకుంటారు. అందుకు సుధాకర్ సాయం తీసుకోవాలని ప్రేరణ తన మామయ్యకి ఫోన్ చేస్తుంది.

అన్ని డిటైల్స్ తెలుసుకోండి మామయ్య..

ప్రేరణ సుధాకర్‌తో ఆ టైంలో స్పాట్‌లో ఉన్న ఫోన్ నెంబర్లు చూసి ఆ నెంబర్లు ఎవరివి వాళ్ల డిటైల్స్ అన్నీ కాసేపట్లో కావాలి అని అంటుంది. అక్క కూతురు అడిగితే చేయక తప్పదు కదా అని సుధాకర్ ఓకే అంటాడు. టెలికాం డిపార్ట్‌మెంట్‌తో మాట్లాడి డిటైల్స్ కనుక్కుంటాడు. అతను చూసి మీరు చెప్పిన టైంలో మీరు చెప్పిన నెంబరుతో పాటు మరొ నెంబరు మాత్రమే ఆన్‌లో ఉంది అని చెప్పి నెంబరు సుధాకర్‌కి పంపిస్తాడు. ఇది అక్కడి మేనేజర్ నెంబరు కదా.. సాహితి నెంబరు ఈయన నెంబరు తప్ప మిగతా వాళ్ల నెంబర్లు ఎందుకు లేవు అని సుధాకర్ అనుకుంటాడు.

మనం ఊహించిన దానికంటే పెద్దదే జరిగింది..

ప్రేరణకు సుధాకర్ కాల్ చేసి మీరు చెప్పిన డిటైల్స్ కాదు కదా.. నెంబర్లు కూడా తెలుసుకోలేకపోయాం అని అంటాడు. అదేంటి అని అడిగితే అక్కడ సాహితి నెంబరు మేనేజరు నెంబరు తప్ప ఇంకెవరివీ డిటెక్ట్ కాలేదు అని అంటాడు. అదేంటి అని ప్రేరణ షాక్ అవుతుంది. ఫోన్ నెంబరు కూడా కనెక్ట్ కాలేదు అంటే గణ గాడు పక్కా ప్లాన్‌తో ఇదంతా చేశాడు అని సిద్ధూ, ప్రేరణ అనుకుంటారు. వాడు ఏం ప్లాన్ చేసినా సాహితి వాడిని ఎలా నమ్మిందో అర్థం కావడం లేదు.. మనం ఊహించిన దానికంటే పెద్దదే జరిగింది అని సిద్ధూ అంటాడు.

మన గురించి ఎంక్వైరీ మొదలు పెట్టారు..

గణ సాహితి దగ్గరకు వెళ్లి వీడియో చూపించి సిద్ధూ, ప్రేరణ మన మీద ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్తాడు. సాహితి వీడియో చూస్తుంది. మీ వాళ్లకి నీ మీద ప్రేమ లేదు అందుకే ఇలా చూస్తున్నారు అని అంటాడు. సాహితి మనసులో అన్నయ్యకి నిజం తెలిస్తే అస్సలు ఊరుకోడు.. అని అనుకుంటుంది. ఇప్పుడేం చేద్దాం అని గణ అంటే నిజం చెప్పేద్దాం అసలు విషయం అన్నయ్యకి తెలిస్తే ఇంత మోసం చేస్తావా అని అన్నయ్య నన్ను చంపేస్తాడు అని అంటుంది. వద్దు అలా చెప్తే ఇప్పటి వరకు మనం చేసింది అంతా వృథా అయిపోతుందని గణ అంటే లేదండీ ఇప్పుడు చెప్తే మనం మీద కనీసం జాలి అయినా ఉంటుంది లేదంటే చంపేస్తారు అని సాహితి అంటుంది. వాళ్లకి ఏ సాక్ష్యాలు దొరకవు నేను అంతా పకడ్బందీగా చేశా అని గణ అంటాడు. నాకు భయం వేస్తుంది అన్నయ్య వాళ్లు నిజం తెలుసుకుంటారని భయంగా ఉందని సాహితి అంటుంది. నిజం చెప్పేద్దాం అని సాహితి అంటే వద్దు అని గణ బతిమాలుతాడు. అంతా నేను చూసుకుంటా నువ్వేం మాట్లాడొద్దు అని గణ అంటాడు.

ALSO READ: Karthika Deepam 2 Serial Today June 20th: కార్తీకదీపం 2 సీరియల్: ఇది కదా నాకు కావాల్సింది.. జ్యోత్స్న చిందులు! దీప మీద తాత సీరియస్.. సాయంత్రం వరకు గడువు!

అసలేం జరుగుతుంది ఈ ఇంట్లో..

గణ బయట మీటింగ్ పెడతాడు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది. ఈ ఇంట్లో అందరూ మంచోళ్లే అనుకున్నాం ఇదంతా ఏంటి అని గణ అడుగుతాడు. ప్రతీ సారి ఏంటయ్యా ఇది మాకు చిన్న పిల్లాడిలా పంచాయితీలు పెడుతున్నావ్ అని విజయానంద్ అంటాడు. దానికి గణ నేను చెప్పేది వింటారా.. నేను ఈ సిద్ధూ, ప్రేరణల గురించి చెప్పాలి అనుకుంటున్నా అని అంటాడు. దానికి విజయానంద్ ఏంటమ్మా ప్రేరణ మళ్లీ ఏ గాడిద బొమ్మో వేసి ఈ అడ్డగాడిదను ఏడిపించారా అని అడుగుతాడు. ఆ రోజు నుంచి బొమ్మలు గీయడం మానేశాం మామయ్య గారు అని ప్రేరణ అంటుంది.

వీళ్ల తప్పుడు పని అది..

నేను మాట్లాడేది బొమ్మల గురించి కాదు వీళ్లు చేసిన తప్పుడు పని గురించి అని గణ అంటాడు. ఏంటి అది అని విజయానంద్ అంటే వీళ్లు ఓ ప్రైవేట్ ప్రోపర్టీలోకి వెళ్లి ఎంక్వైరీ చేశారు నాకు కంప్లైంట్ వచ్చింది అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్లారు.. మీరు చేసిన పనికి ఇక్కడికిక్కడే మిమల్ని అరెస్ట్ చేయొచ్చు తెలుసా అని అంటాడు. ఇదంతా నీకు ఎలా తెలుసురా గూండాలను పంపించింది నువ్వే కదా.. మేం అక్కడికి వెళ్లినట్లు నీకు ముందే తెలిసినట్లు ఉందే.. ఇది కంప్లైంట్ కాదు మాకు ఎక్కడ దొరికిపోతావా అనే నీ భయం అని సిద్ధూ అంటాడు. నేను ఏ తప్పు చేయలేదు అని గణ అంటాడు.

మేం తెలుసుకున్నాం..

మరి మా గురించి నీకు ఎందుకురా.. మేం మా పని మీద అక్కడికి వెళ్లాం మాకు కావాల్సింది తెలుసుకున్నాం అని సిద్ధూ అంటాడు. గణ, సాహితి ఇద్దరూ షాక్ అయిపోతారు. ఏం తెలుసుకోవడానికి వెళ్లారు. మీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది.. ఓ పోలీసోడి ఫ్యామిలీ ఇలా చేస్తున్నారు అని అంటున్నారు అని గణ అంటాడు. దానికి ప్రేరణ ఓ దుర్మార్గుడి గురించి తెలుసుకోవడానికి.. ఒక అమాయకురాలి జీవితాన్ని కాపడానికి నిజం తెలియని పెద్దవాళ్లకి సాక్ష్యం చూపించడానికి వెళ్లాం.. ఏంటి ఇప్పుడు.. మేం నిజంగా తప్పు చేసి ఉంటే ఈ పాటికే పోలీసులు రావాలి కదా అని అంటుంది ప్రేరణ. నేను పోలీసుని కదా మీకు బుద్ధి ఉందా.. ఇంకెవరు వస్తారు అని గణ అంటాడు. రేయ్ నువ్వు మేక వన్నె పులివిరా.. నిన్ను ఆ డ్రస్ కాపాడుతుంది.. నీ డ్రామాలు ఆపు అని సిద్ధూ అంటాడు.

ఆయన్ను ఏమైనా అంటే ఊరుకోను..

అన్నయ్యా ఎందుకు ఇలా మీరు ఆయన్ను పదే పదే ఏదో ఒకటి అంటున్నారు ఆయన్ను ఏమైనా అంటే నేను ఊరుకోను అని సాహితి అంటుంది. దానికి సిద్ధూ నువ్వు వాడిని ఎందుకు నమ్ముతున్నావో నాకు అర్థం కావడం లేదు అని సిద్ధూ అంటాడు. అసలు ఏంటి ఇదంతా అని మంజుల అడుగుతుంది. దాంతో ప్రేరణ వీడియో చూపించమని సిద్ధూతో చెప్తుంది. సిద్ధూ మొత్తం ల్యాప్‌టాప్‌లో వేసి చూపిస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. గణ మనసులో ఇలా అడ్డంగా దొరికిపోయాను ఏంటి అని అనుకుంటాడు. ఇప్పుడేం చెప్తావురా.. ఇదంతా ఏఐ అని చెప్పు తర్వాత నీ సమాధానం అదే కదా అని ప్రేరణ అంటుంది. కళ్లముందు ఇంత సాక్ష్యం ఉంటే సైలెంట్‌గా ఉన్నావేంట్రా చెప్పు అని విజయానంద్ అంటాడు..

నిజం చెప్పు సాహితి..

నువ్వు అక్కడికి ఎందుకు వెళ్లావురా.. సాహితి నువ్వు అయినా నిజం చెప్పు.. అని సిద్ధూ అడుగుతాడు. సాహితి చాలా భయపడుతుంది. మంజుల కూడా అడుగుతుంది. సాహితి ఇంత వరకు వచ్చిన తర్వాత నువ్వు నిజం చెప్పకపోతే మేం నిజం తెలుసుకోలేమని అనుకుంటున్నావేమో.. ఇంత తెలుసుకున్న మాకు అది పెద్ద కష్టమేమీ కాదు.. సాహితి మేం తెలుసుకుంటే అది సాక్ష్యం అవుతుంది.. అదే నువ్వే చెప్పేస్తే సమాధానం అవుతుంది.. చెప్పు అని సిద్ధూ అడుగుతాడు. సాహితి మనసులో ఇప్పుడేం చేయాలి అని అనుకుంటుంది. గణ మనసులో సాహితి నిజం చెప్తే వీళ్లు నన్ను చంపేస్తారు అని అనుకుంటాడు. నిజం చెప్పొద్దు అని గణ సాహితిని వారిస్తాడు. సాహితి నిజం చెప్పకపోతే ముందు ముందు నీకే ప్రాబ్లమ్ అవుతుంది.. మాకు తెలుసు నీకు వాడు ఇష్టం లేదు అని సిద్ధూ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title=" ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self"> ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.