Nindu Manasulu Serial Today Episode ప్రేరణ సిద్ధూ తనని ప్రేమిస్తున్నాడని.. సిద్ధూని నిలదీస్తుంది. నా లక్ష్యానికి మన స్నేహం అడ్డు వస్తే ఆ స్నేహాన్ని కూడా వదిలేస్తా అంటుంది. ఇంతలో కుమార్ వచ్చి ఆ స్టేటస్‌ పెట్టింది నేను అని చెప్తాడు. ఎందుకు అలా చేశావ్ అని సిద్ధూ అంటే మీ ఇద్దరినీ కలపాలి అని ఇలా చేశాను అంటాడు. అదేంటి అని ప్రేరణ అడిగితే నేను శైలు ప్రేమించుకున్నాం కదా.. అలాగే మీరు కలిసి ఉంటే సంతోషంగా ఉంటారు అని అంటాడు. మీరు అంటే లవర్స్ మేం కాదు కదా అని ప్రేరణ కుమార్‌ని తిడుతుంది.

గణ తన మనిషితో ఐశ్వర్య ఫోన్ దొంగతనం చేయించి.. తను చెప్పిన పని చేయమని అంటాడు. వెంటనే తన వాళ్లకి కాల్ చేసి ఏం చేయాలో చెప్తాడు. ప్రేరణ కోపంగా ఉంటే సిద్ధూ వెళ్లి మాట్లాడతాడు. నేను ఏంటో నీకు తెలుసు కదా నేను ఇలా చేస్తా అని నువ్వు ఎందుకు అనుకున్నావ్.. నీ మనసుకి కష్టపెట్టే పని నేను ఎప్పటికీ చేయను అని అంటాడు. ఇంతలో ఐశ్వర్య ఫోన్ నుంచి మెసేజ్ రావడంతో ప్రేరణ సిద్ధూతో ఆడిషన్స్ గురించి చెప్తుంది. ప్రేరణ మెసేజ్ చూసి బిత్తరపోతుంది. అక్క నేను ప్రమాదంలో ఉన్నాను.. త్వరగా రా అని లొకేషన్ పంపిస్తుంది. ఇదంతా ఐశ్వర్య పంపిందని అనుకుంటారు. కంగారుగా ప్రేరణ వెళ్తాను అని అంటే సిద్ధూ ప్రేరణకు విషయం చెప్పమని అంటాడు.

సుధాకర్ గణ దగ్గర ఉంటే ప్రేరణ కాల్ చేస్తుంది. దాంతో సుధాకర్ కాల్ లిఫ్ట్ చేయడు.. సిద్ధూ, ప్రేరణ ఇద్దరూ లొకేషన్‌కి వెళ్తారు. ఐశ్వర్య కోసం ఇళ్లంతా వెతుకుతారు. ఇక గణ మనిషి గణకి కాల్ చేస్తాడు. సిద్ధూ, ప్రేరణలు మీరు చెప్పిన ప్లేస్‌కి వచ్చారు అని అంటాడు. గణ ఏదో చేస్తున్నాడు అని సుధాకర్ అనుకుంటాడు. ఏదో చేస్తున్నారు సార్ చెప్పండి అని అడుగుతాడు. పోయిన నా ఉద్యోగం మళ్లీ తిరిగి వచ్చేస్తుంది సుధా మళ్లీ నేను డ్యూటీ ఎక్కబోతున్నా అని అంటాడు. ఏం చేశారు సార్ ఇప్పటివరకు రాని ఉద్యోగం ఇప్పుడు వస్తుంది అని సుధా అడిగితే కాస్త ఓపిక పట్టు అని అంటాడు. ప్రేరణ, సిద్ధూలతో గణ మనిషి ఐశ్వర్యని పైకి తీసుకెళ్లారు అని అంటాడు. ఇద్దరూ కంగారుగా ఇళ్లంతా వెతుకుతూ ఓ గదిలోకి వెళ్తారు. గణ మనిషి ఆ గది తలుపులు వేసేస్తాడు.

పోలీసులు వచ్చి ఇళ్లంతా సెర్చ్ చేస్తారు. ఏదో జరుగుతుందని ప్రేరణ, సిద్ధూ అనుకుంటారు. ఇంతలో పోలీసులు వచ్చి ప్రేరణ సిద్ధూలను కూడా అరెస్ట్ చేయమని అంటారు. మమల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు అని ప్రేరణ అడిగితే మరి వ్యభిచారం చేసే ఇంట్లో మీకు ఏంటి పని అని చెప్పి ప్రేరణ, సిద్ధూల ఫోన్లు తీసుకొని వాళ్లని కూడా అరెస్ట్ చేస్తారు. అందరితో పాటు సిద్ధూ ప్రేరణల్ని కూడా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తారు. ఎఫ్‌ఐఆర్ కూడా రాయమని అంటారు. సిద్ధూ, ప్రేరణలు ఎంత చెప్పినా వినరు. తర్వాత గణ పోలీస్ ధనుంజయ్‌కి కాల్ చేస్తాడు. నాకు వాళ్ల ముఖాలు చూడాలి అని ఉంది..అర్జెంటుగా వాళ్ల ఫోటో తీసి పంపు అని అంటాడు. ప్రేరణ ఏడుస్తుంటే ధనుంజయ్ ఫోటో తీసి గణకి పంపిస్తాడు. అది చూసి గణ పొంగిపోతాడు. ఇంతలో కొత్తగా ట్రాన్సఫర్ అయిన డీసీపీ స్టేషన్‌కి వస్తారు అని ధనుంజయ్‌కి తెలుస్తుంది. ఆయన వస్తే జాగ్రత్తగా ఉండాలి అని అందరూ అనుకుంటారు.

ఇంతలో డీసీపీ జయకృష్ణ ఎంట్రీ ఇస్తాడు. డీసీపీని చూసి ఎస్‌ఐ చాలా భయపడతాడు. ఎస్‌ఐ గదికి వెళ్లి మాట్లాడతాడు. ఎస్‌ఐ ధనుంజయ్ సీటు దగ్గర ఉన్న లంచం డబ్బు చూసి ఏంటి ఇది ఇలాంటివి బాలేవు ఎస్‌ఐ.. నిజం చెప్పు ఈ డబ్బు ఎలా వచ్చింది.. నిజంగా నా డబ్బే అని రాసి సంతకం పెట్టు నిజం అని తేలితే వదిలేస్తా.. అదే అబద్ధం అయితే నీ ఉద్యోగం తీసేస్తా అని ధనుంజయ్‌కి 5 నిమిషాలు టైం ఇచ్చి అవి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే వెళ్లిపోవాలి అని అంటాడు. దాంతో ధనుంజయ్ తప్పు ఒప్పుకుంటాడు. ఇంతలో సిద్ధూ, ప్రేరణలకు సంతకం పెట్టమని అంటే మేం ఏ తప్పు చేయలేదు మమల్ని వదిలేయండి అని గోల చేస్తారు. ఏమైందని డీసీపీ అడిగితే వ్యభిచారం కేసులో దొరికారని ఎస్‌ఐ చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.