Nimmala Ramanaidu : సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి - సామాన్య రైతులా పొలం పనులు, వ్యవసాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి అని వెల్లడి
10 months ago 9
ARTICLE AD
Nimmala Ramanaidu : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగ 3 రోజులూ పిల్లా పెద్దా అంతా కలిసి కుటుంబాలతో గ్రామాల్లో వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కనుమ పండుగ రోజు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ తాను రైతునే అన్న విషయాన్ని మర్చిపోకుండా.. తన విలువేంటో చూపించారు. సాధారణంగా మంత్రి అంటేనే చాలా పనులుంటాయి. క్షణం తీరిక లేకుండా రాష్ట్ర సంక్షేమం కోసం పాటుపడుతూ.. మరో పక్క కుటుంబంతో గడపడం చాలా కష్టమైన, కఠినమైన పని. కానీ రామానాయుడు కాస్త టైం దొరికే సరికి తన పొలంలో ప్రత్యక్షమయ్యారు. కనుమ పండగ నాడు సొంతూరైన ఏలూరు జిల్లా ఆగర్తిపాలెంలో పర్యటించారు. ఈ క్రమంలో నిమ్మల తన పొలానికి వెళ్లి వరి చేనుకు పురుగుల మందు స్ప్రే చేశారు. దీనికి సంబంధించిన పలు వీడియాలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.
పొలానికి పిచికారీ చేసిన మంత్రి
మొదట్నుంచీ పొలం పనులంటే ఇష్టమున్న మంత్రి రామానాయుడు.. అధ్యాపకుడిగా పని చేస్తూనే వ్యవసాయం చేసేవారు. అప్పట్లోనే ఆయన ఎకరానికి 55 నుంచి 60 బస్తాల దిగుబడి సాధించేవారట. వ్యవసాయంలోనే కాదు ఆక్వా సాగులోనూ మంత్రి తన సత్తా చాటుకున్నారు. 2014, 2019, 2024 సంవత్సరాల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి నేడు మంత్రి పదవి చేపట్టినా వ్యవసాయ పనులు మాత్రం మర్చిపోకుండా ఉండడం ఆయన గొప్పతనాన్ని ప్రతిబింబిస్తోంది.
పొలం పనులు చేసుకోవడంలోనే నిజమైన సంతృప్తి
కనుమ పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి రామానాయుడు.. ఈ సంవత్సరమంతా పంటలు బాగా పండాలని, రైతులందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని నిమ్మల ఆకాంక్షించారు. వ్యవసాయం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. మంత్రిగా తీరిక లేకుండా ఉన్నా పొలంలోకి దిగి పనులు చేసుకోవడం నిజమైన సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నా... కాలేజీ అధ్యాపకుడిగా పని చేస్తున్న నా సొంత గ్రామంలో వ్యవసాయం మాత్రం నేనే సొంతంగా చేస్తూ వరిలో ఎకరానికి 55 నుండి 60 బస్తాలు దిగుబడి సాధించడమే కాక ఆక్వా సాగులో కూడా మంచి ఫలితాలు సాధించే వాడిని. మంత్రిగా సమయం దొరకని స్థితిలో నేడు… pic.twitter.com/YGxrbktfY2
— Nimmala Ramanaidu (@RamanaiduTDP) January 15, 2025
Read Entire Article