నటిగా మాత్రమే కాదు నిర్మాతగాను నిహారిక కొణిదెల (Niharika Konidela) తన మార్క్ చూపించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థను స్థాపించిన ఆవిడ తొలుత వెబ్ సిరీస్‌లు ప్రొడ్యూస్ చేశారు. ఓటీటీ వీక్షకులను మెప్పించారు. 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాతో వెండితెరకు నిర్మాతగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతో పలు అవార్డులు - బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు సాధించారు. ఇప్పుడు ఆవిడ సంస్థలో మరో రెండు సినిమాలు రూపొందుతున్నాయి.

'కమిటీ కుర్రోళ్ళు' దర్శకుడికి మళ్ళీ ఛాన్స్!
'కమిటీ కుర్రోళ్ళు' సినిమా తర్వాత నిహారిక నిర్మాణ సంస్థలో సంగీత్ శోభన్ హీరోగా ఓ సినిమా మొదలైంది. అతనితో 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేశారు నిహారిక. ఇప్పుడు వెండితెరపై సోలో హీరోగా అతడిని పరిచయం చేస్తున్నారు. సంగీత్ శోభన్ సినిమా తర్వాత మరొక సినిమా కూడా నిహారిక ఓకే చేశారు.

'కమిటీ కుర్రోళ్ళ'తో దర్శకుడిగా పరిచయమైన యదు వంశీకి మరో సినిమా చేసే అవకాశం ఇచ్చారు నిహారిక. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళనుంది. సుమారు 10 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా పాతిక కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ సినిమాతో 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లను పరిచయం చేశారు. 'కమిటీ కుర్రోళ్ళు' దర్శక నిర్మాతల కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతున్న నేపథ్యంలో... ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: కళ్యాణీ ప్రియదర్శన్ గ్లామర్ ట్రీట్... బెల్లీ డ్యాన్స్‌తో షేక్ ఆడించిందంతే

సంగీత్ శోభన్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకం మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా‌ నిహారిక నిర్మిస్తున్న చిత్రానికి మానసా శర్మ దర్శకురాలు. అందులో నయన్ సారిక హీరోయిన్. మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ ఉప్పాలతో కలసి స్క్రీన్ ప్లే రాయడంతో పాటు సొంతంగా కథను అందించారు మానస శర్మ. ఫాంటసీ కామెడీ జోనర్‌లో ఆ సినిమా రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో 'కమిటీ కుర్రోళ్ళు' తెరకెక్కించిన యదు వంశీ ఎప్పుడు ఎటువంటి సినిమా చేస్తారో చూడాలి.

Also Read: ఫ్లాపుల్లో ఉన్నా పూజా హెగ్డే రెమ్యూనరేషన్ తగ్గలేదు... దుల్కర్ సల్మాన్ సినిమాకు ఎంత తీసుకుంటుందో తెలుసా?