Salary by 7th every month: భారత ప్రభుత్వం అతిపెద్ద కార్మిక సంస్కరణగా పరిగణించే నాలుగు కార్మిక కోడ్‌లను శుక్రవారం నుంచి అమలులోకి తీసుకువచ్చింది. 29 పాత కేంద్ర చట్టాలను ఏకీకృతం చేసిన ఈ కోడ్‌లలో IT , ITES ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనాబుల్డ్ సర్వీసెస్ సెక్టర్‌కు చెందిన ఉద్యోగులకు ప్రతి నెల 7వ తేదీ నుంచి జీతాలు చెల్లించాల్సి ఉంటుంది . కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ (MoLE) ప్రకటన ప్రకారం, ఈ కోడ్‌లు డిజిటల్, గిగ్ ఎకానమీకు అనుగుణంగా మార్చారు.

భారతీయ IT ఇండస్ట్రీలో 50 లక్షల మంది పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు, కానీ గతంలో జీతాల ఆలస్యం, అనధికార కోతలు వంటి సమస్యలు తరచూ ఎదురవుతూ ఉండేవి. కొత్త కోడ్‌లు ద్వారా, IT/ITES కంపెనీలు ప్రతి నెల 7వ తేదీ నాటికి జీతాలు క్రెడిట్ చేయడం తప్పనిసరి చేసింది. ఇది మునుపటి చట్టాల్లో పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 వంటి వాటిల్లో ఉన్న అస్పష్టతలను తొలగించి, డిజిటల్ పేమెంట్‌లకు అనుగుణంగా మార్చింది. MoLE ప్రకటన ప్రకారం, ఈ మార్పు ఉద్యోగులకు ఆర్థిక ఒత్తిడి తగ్గించి, వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌ను మెరుగుపరుస్తుంది . అలాగే, జీతాల్లో అనధికార కత్తిరిపులు, వేజ్ సీలింగ్ పరిమితులు తొలగించారు.

కొత్త కోడ్‌లు IT ఉద్యోగులకు సమగ్ర రక్షణ అందిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. జీతాల చెల్లింపు ప్రతి నెల 7వ తేదీ నాటికి పూర్తి చేయాలి. ఆలస్యం జరిగితే ఫైన్‌లు, పెనాల్టీలు విధిస్తారు. PF, ESIC, గ్రాచ్యుటీ వంటి బెనిఫిట్స్‌కు అర్హత. 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు ఫ్రీ యాన్యువల్ హెల్త్ చెకప్‌లు ఉండాలి. గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజమ్‌లు, వేగవంతమైన ట్రిబ్యునల్‌లు ఉండాలి. రాతపూర్వక ఆఫర్ లెటర్స్ తప్పనసరిగా ఉడాలి. ప్లాట్‌ఫాం వర్కర్లకు మొదటిసారి PF, ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పిస్తారు.

ఈ మార్పులు IT ఇండస్ట్రీలోని వైట్-కాలర్ ఉద్యోగులకు క్లారిటీ, ఫార్మలైజేషన్, టైమ్లీ పేమెంట్‌లను అందిస్తాయి. నాలుగు కోడ్‌లు – వేజెస్ (2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ (2020), సోషల్ సెక్యూరిటీ (2020), OSHWC (2020) – 1930-50లలో రూపొందిన పాత చట్టాలను భర్తీ చేస్తాయి. అమలు నవంబర్ 21, 2025 నుంచి ప్రారంభమవుతుంది, పాత రూల్స్‌తో ట్రాన్సిషన్ కాలం ఉంటుంది. PIB ప్రకటన ప్రకారం, ఇవి 40 కోట్ల కార్మికులకు మినిమమ్ వేజ్, గ్రాట్యుటీ 1 సంవత్సరం పని తర్వాత , సామాజిక భద్రతను అందిస్తాయి.

A transformational leap in India’s labour landscape!

The Government has made the four Labour Codes effective that consolidate 29 laws into a simple, transparent and future-ready framework, empowering workers while promoting economic growth.#ShramevJayate pic.twitter.com/PAxrVaTylW

— Ministry of Labour & Employment, GoI (@LabourMinistry) November 21, 2025

అయితే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఏడో తేదీ లోపు ఇవ్వాలని అన్నారు కానీ.. ఒకటో తేదీ ఇవ్వాలని అనలేదు. అందుకే బడా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎప్పట్లాగే జీతాలు ఇస్తాయి.