Latest Driving Licence Rule In India 2026: ఏదైనా వాహనం తీసుకుని రోడ్డుపైకి వచ్చినప్పుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. రూల్స్‌ జంప్‌ చేసినప్పుడు చలాన్ కడితే సరిపోతుందని చాలామంది భావిస్తారు. కానీ పదేపదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్‌పై కూడా ప్రభావం పడవచ్చు. ఒక ఏడాదిలో 5 లేదా అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదైతే లైసెన్సింగ్ అథారిటీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్‌ కూడా చేయవచ్చు.

ఈ కొత్త నిబంధన 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఐదు చలాన్లు వచ్చిన వెంటనే లైసెన్స్ రద్దవుతుందని అనుకోవద్దు. వర్తించే చట్ట నిబంధనలు, అధికారిక రికార్డులు, సంబంధిత అధికారుల ప్రక్రియ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఏ ఉల్లంఘనలు లెక్కలోకి వస్తాయి? లైసెన్స్‌పై ఎలాంటి చర్యలు ఉండవచ్చు? తప్పుగా చలాన్ పడితే ఏం చేయాలి? తెలుసుకుందాం.

5-Strike డ్రైవింగ్ లైసెన్స్ రూల్ అంటే ఏమిటి?

ఈ నిబంధన ప్రకారం, ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదైతే సంబంధిత లైసెన్సింగ్ అథారిటీ సంబంధింత వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్‌పై చర్యలు తీసుకోవచ్చు. ఈ ఉల్లంఘనలన్నీ ఒకే రకానికి చెందినవే కావాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు.. ఒకసారి అతివేగంగా నడపడం, మరోసారి రెడ్ సిగ్నల్ దాటడం, ఇంకోసారి హెల్మెట్ లేకుండా బైక్ నడపడం వంటి వేర్వేరు ఉల్లంఘనలు కూడా రికార్డులోకి రావచ్చు. ట్రాఫిక్ కెమెరా ద్వారా నమోదైన చలాన్ అయినా, ట్రాఫిక్ పోలీసు జారీ చేసిన చలాన్ అయినా, అందులో పేర్కొన్న ఉల్లంఘన వివరాలు ముఖ్యం. జరిమానా చెల్లించినంత మాత్రాన ఆ ఉల్లంఘన రికార్డు నుంచి తొలగిపోతుందని భావించకూడదు.

ఇది కూడా చదవండి: E20, E100, B100 ఇంధనాలపై కేంద్రం కొత్త నిబంధనలు.. మారుతి WagonR Flex Fuel ప్రత్యేకతలివే!

ఏ ట్రాఫిక్ ఉల్లంఘనలు లెక్కలోకి రావచ్చు?

- అతివేగంగా వాహనం నడపడం.
- రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం.
- టూవీలర్‌పై హెల్మెట్ లేకుండా ప్రయాణించడం. కొన్ని రాష్ట్రాల్లో, వెనుక కూర్చున్నవారికి కూడా హెల్మెట్ అవసరం.
- కారు ప్రయాణంలో సీట్ బెల్ట్ ధరించకపోవడం.
- డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం.
- రాంగ్ సైడ్‌లో వాహనం నడపడం.
- నిషేధిత ప్రాంతాల్లో పార్కింగ్ చేయడం లేదా ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించడం.
- ఇతరుల భద్రతకు ప్రమాదం కలిగించేలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం.
- అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులు లేదా సరుకులను తీసుకెళ్లడం.
- వాహనానికి అవసరమైన చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా ప్రయాణించడం.
- లేన్ నిబంధనలను ఉల్లంఘించడం లేదా ప్రమాదకరంగా లేన్లు మార్చడం.

ఇవి సాధారణ ఉల్లంఘనలు మాత్రమే. వాహనం చోరీ, ప్రయాణికులపై దాడి, ప్రయాణికులను అపహరించడం వంటివాటిని కూడా తీవ్రమైన ఉల్లంఘనలుగా అధికారులు పరిగణించవచ్చు.

ఇది కూడా చదవండి: Tata Nexon నుంచి Hyundai Creta వరకు.. పానోరమిక్ సన్‌రూఫ్ ఉన్న 10 కార్లు, మీ బడ్జెట్‌లోనే కొనొచ్చు!

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.