Netflix Top Trending Movies Complete List : ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో గత రెండు వారాలుగా బ్లాక్ బస్టర్ మూవీస్‌తో పాటు పలు వెబ్ సిరీస్‌లు కూడా ట్రెండ్ అవుతున్నాయి. టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ ఓసారి చూస్తే...

ఇరుముడి (Irumudi) - మాస్ మహారాజ రవితేజ, శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ఇరుముడి. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.250 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా సెప్టెంబర్ 18 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. తండ్రీ కూతుళ్ల అనుబంధం, అయ్యప్ప దీక్ష, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ చుట్టూ స్టోరీ సాగుతోంది.

మొద రాత్రి (Modha Rathri) - రిషికాంత్, అనిష్మా అనిల్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ మొద రాత్రి. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులో ఉంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న యువతి ఫస్ట్ నైట్ రోజున భర్తకు షాక్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే స్టోరీ. కోలీవుడ్ స్టార్ ధనుష్ ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు.

లస్ట్ స్టోరీస్ 3 (Lust Stories 3) - లస్ట్ స్టోరీస్ 3 అనేది నాలుగు వేర్వేరు కథలతో రూపొందిన ఆంథాలజీ మూవీ. విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ ఈ నాలుగు కథలకు దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ ఒరిజినల్‌తో పాటు తెలుగు, తమిళం ఆడియోలు కూడా అందుబాటులో ఉంది.

విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath And Sons) - కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఫ్యామిలీ డ్రామా విశ్వనాథ్ & సన్స్. Netflixలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.

బేబీ డూ ఆర్ డై (Baby Do Die Do) - హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'బేబీ డూ డై డూ'. నచికేత్ సమంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె బేబీ కర్మాకర్ అనే చెవిటి, మూగ కాంట్రాక్ట్ కిల్లర్‌గా కనిపించారు. సెప్టెంబర్ 25 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read : Bethlehem Kudumba Unit OTT : ఓటీటీలోకి 300 కోట్ల బ్లాక్ బస్టర్ - బెత్లహాం కుటుంబ యూనిట్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

కొరియన్ కనకరాజు (Korean Kanakaraju) - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికా నాయక్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించగా తమన్ మ్యూజిక్ అందించారు. సెప్టెంబర్ 4 నుంచి Netflixలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా అందుబాటులో ఉంది.

ధమాల్ 4 (Dhamaal 4) - 'ధమాల్ 4’ ఇంద్ర కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ కామెడీ అడ్వెంచర్ మూవీ. అజయ్ దేవగణ్, రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ, జావేద్ జాఫ్రీ, సంజయ్ మిశ్రా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 4 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. నిధి కోసం బయలుదేరిన గుడ్డు, అతని స్నేహితులు ఎదుర్కొనే వరుస గందరగోళాలు, కామెడీ సాహసాలే స్టోరీ.

గాంధారి (Gandhari) - తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ గాంధారి. ఈ సినిమాకు దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహించగా... కనికా ధిల్లాన్ స్టోరీతో పాటు నిర్మించారు. డైరెక్ట్‌గా నెట్ ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ ఒరిజినల్‌తో పాటు తెలుగు, తమిళంలో అందుబాటులో ఉంది. కిడ్నాప్‌నకు గురైన తన కూతురిని రక్షించేందుకు చూపును కోల్పోయినా వెనక్కి తగ్గని తల్లి, పిల్లల అక్రమ రవాణా ముఠాపై చేసే పోరాటమే 'గాంధారి' స్టోరీ.

GDN: ప్రముఖ భారతీయ ఆవిష్కర్త జి.డి. నాయుడు (G.D. Naidu) జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. ఇందులో ఆర్. మాధవన్ జి.డి. నాయుడు పాత్రలో నటించారు. Netflixలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం ఆడియోలు అందుబాటులో ఉంది.

ఆల్ఫా (Alpha) - శివ్ రావైల్ దర్శకత్వంలో ఆలియా భట్ ప్రధన పాత్రలో నటించిన సినిమా ఆల్ఫా (Alpha). ఇదొక యాక్షన్ స్పై థ్రిల్లర్. నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

Also Read : Action Thriller OTT : మరో ఓటీటీలోకి సునీల్ యాక్షన్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.