<p>Road Accident on national High way in Nellore district | సంగం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై ఓ టిప్పర్‌ వేగంగా దూసుకువచ్చి ఓ కారును ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. టిప్పర్‌ రాంగ్‌ రూట్‌లో వేగంగా దూసుకురావడంతో పాటు కారును ఢీకొట్టి కొద్దిదూరం లాక్కెళ్లింది. ఈ క్రమంలో కారు టిప్పర్‌ కింద చిక్కుకుపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారి మృతదేహాలు తీవ్రంగా నుజ్జునుజ్జయ్యాయి. ఆ కారు నెల్లూరు నుండి కడప వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసులు చేరుకొని స్థానికుల సహాయంతో సహాయ చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. </p>