Natalie Burn Viral Girl From Yash Toxic Teaser : హాలీవుడ్ నటి నటాలియా బర్న్... ఇప్పుడు ఇంటర్నెట్ అంతా ఈమె కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు. రాకింగ్ స్టార్ యష్‌తో కలిసి బోల్డ్ సీన్‌లో నటించిన ఈమె ఎవరా అంటూ ఆరా తీస్తున్నారు. 'టాక్సిక్' మూవీలో 'రాయ'గా పవర్ ఫుల్ లుక్‌లో యష్ కనిపించనుండగా తాజాగా ఇంట్రడ్యూస్ వీడియోలో నటాలియా హల్చల్ చేసింది.

అసలెవరీ నటాలియా?

యష్ 'టాక్సిక్' టీజర్‌లో రొమాంటిక్ సీన్‌తో వైరల్ అయిన ఈ నటాలియా ఉక్రెనియన్ అమెరికన్ నటి. ఈమె హాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించారు. మోడల్, నిర్మాత, రచయితగానూ గుర్తింపు పొందింది. ప్రస్తుతం టాక్సిక్ మూవీకి సహ నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. అలాగే 'టాక్సిక్' మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. ఉక్రెయిన్ కీవ్‌లో జన్మించిన ఈమె అమెరికన్ పౌరురాలిగా మారారు. ఆ తర్వాత మోడల్‌, నటిగా సత్తా చాటింది.

హాలీవుడ్‌లో టది ఎక్స్‌పెండబుల్స్ 3', 'మెకానిక్ : రిసరెక్షన్', 'ది కమ్ బ్యాక్ ట్రైల్', 'టిల్ డెత్ టు అస్ పార్ట్' వంటి చిత్రాల్లో నటాలియా నటించింది. మార్షల్ ఆర్ట్స్‌లోనూ ప్రావీణ్యం ఉంది. 2006లో నటాలియా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా... పలు హాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే, '7 హెవెన్ ప్రొడక్షన్స్' అనే నిర్మాణ సంస్థను సైతం కలిగి ఉంది. ఎక్కువగా యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది.

ఇండియన్ సినిమాలో...

'టాక్సిక్' మూవీతోనే నటాలియా ఇండియన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మూవీలో ఆమె రోల్‌ను సీక్రెట్‌గా ఉంచారు. అయితే, టీజర్‌లో కొంత అభ్యంతరకర బోల్డ్ సీన్ ఉన్నప్పటికీ రాయకు, ఆమెకు మధ్య ఉన్న రిలేషన్, ఎమోషన్ మూవీకి హైలెట్‌గా ఉండనుందని మాత్రం అర్థమవుతోంది.

Also Read : సంప్రదాయం Vs ఫుల్ యాక్షన్ మోడ్ - సమంత 'మా ఇంటి బంగారం' టీజర్ ట్రైలర్ వచ్చేసింది