Nara Lokesh is going to campaign on behalf of NDA in Bihar :  ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ (NDA) అభ్యర్థుల తరపున ప్రచారం చేయబోతున్నారు. బీహార్‌లో 243 నియోజకవర్గాలకు రెండు దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో మొదటి దశ నవంబర్ 6న పూర్తి అయ్యింది. రెండో దశలో 122 నియోజకవర్గాలకు పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. తొమ్మిదో తేదీ అంటే ఆదివారం సాయంత్రం ప్రచారం ముగుస్తుంది. ఈ సమయంలో నారా లోకేష్ చివరి రెండు రోజులు బీహార్ లో ప్రచారంచేయాలని నిర్ణయించారు. శనివారం సాయంత్రం రెండు సమావేశాల్లో పాల్గొంటారు. ఆదివారం పట్నాలో NDA అభ్యర్థులకు మద్దతుగా బహిరంగసభలో ప్రసంగిస్తారు.

యువతకు ఉద్యోగ, ఉపాధి అంశాలపై భరోసా ఇచ్చేందుకు ప్రచారం

ఎన్డీఏ పార్టీలు యువతకు ఉద్యోగాల కల్పన, ఉపాధి విషయంలో ఎక్కువ భరోసా ఇవ్వాలనుకుంటున్నారు. యువకులు తాము వలస పోకుండా బీహార్ లోనే ఉండేలా ఉద్యోగాలు చేసుకోవాలనుకుంటున్నారు. ఏపీకి పరిశ్రమలు తీసుకు వచ్చేందుకు నారా లోకేష్ చేస్తున్న కృషి, గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఆయనకు వచ్చిన ప్రచారం బీహార్ యూత్ లో నమ్మకం కలిగించిందని అంటున్నారు. అందుకే నారా లోకేష్ తో.. ఎన్డీఏ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఘనంగా సృష్టిస్తుందని చెప్పించాలని భావించినట్లుగా తెలుస్తోంది.

చంద్రబాబు, పవన్ కాకుండా నారా లోకేష్‌తోనే ప్రచారం ఎందుకు ?

నిజానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఉత్తరాదిన మంచి గుర్తింపు ఉంది. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉండటమే కాకుండా.. అభివృద్ధి రాజకీయాలకు పెద్దపీట వేస్తారని హిందీ ప్రజల్లో చంద్రబాబుకు పేరుంది. అందుకే గతంలో పలు చోట్ల ఇతర పార్టీల కోసం ప్రచారం చేశారు కూడా. అదే సమయంలో పవన్ కల్యాణ్‌కూ బీహార్ ప్రజల్లో గుర్తింపు ఉంది. సినీ హీరోగా ఆయన సినిమాలో భోజుపురిలోకి డబ్బింగ్ అయ్యాయి.హిందీలోకీ డబ్బింగ్ అయ్యాయి. ఆయన వచ్చినా జన సమీకరణ బాగానే జరుగుతుంది. అయితే ఎన్డీఏ పెద్దలు జన సమీకరణ కన్నా.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకా లోకేష్ ప్రజలకు వివరించే అవకాశం ఉంది.

ఎన్డీఏ పథకాలను వివరించనున్న లోకేష్

బీహార్‌లో యువతకు స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వడంపై దృష్టి పె NDA ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తుందని ప్రచారం చేసే అవకాశం ఉంది. కేంద్ర-రాష్ట్ర డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు అభివృద్ధికి ఎలా దోహదపడతాయో వివరిస్తారు. ప్రధాని మోదీ నాయకత్వంలో NDA బలపడితే బీహార్‌కు మరిన్ని ప్రయోజనాలు వస్తాయని హైలైట్ చేస్తారు. NDA ప్రతిపాదించిన స్కిల్స్ సెన్సస్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, బీహార్ యువతకు ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయని ప్రచారం చేసే అవకాశం ఉంది.