AndhraPradesh investments Forbs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన ఒక ఆసక్తికరమైన ట్వీట్ సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారతదేశం 2025-26 ఆర్థిక సంవత్సర మొత్తం పెట్టుబడులలో ఆంధ్రప్రదేశ్ వాటా ఏకంగా 25.3 శాతంగా ఉంది! ఏపీ కేవలం ఇతరులతో పోటీ పడటం లేదు.. అందరికంటే ముందు దూసుకుపోతోంది అంటూ ఆయన పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇదేనని, పెట్టుబడిదారులు ఏపీని ఎంచుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

నారా లోకేష్ ఈ ట్వీట్ చేయడానికి ప్రధాన కారణం ఫోర్బ్స్ ఇండియా (Forbes India) , సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) వెల్లడించిన తాజా గణాంకాలు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఆకర్షించిన పెట్టుబడులను విశ్లేషించిన ఈ నివేదికల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తానికి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనల్లో నాలుగో వంతు వాటా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కాయి. ఇది రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో ఒక చారిత్రాత్మక విజయంగా ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ఇన్వెస్టర్లలో గొప్ప నమ్మకాన్ని కలిగించింది. గతంలో కేవలం అనుమతులకే పరిమితమైన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో, ఇప్పుడు అనుమతులతో పాటు పరిశ్రమల స్థాపనలో వేగాన్ని జోడించడం వల్ల గూగుల్, రిలయన్స్, అదానీ, రాయ్‌డెన్ ఇన్ఫోటెక్ వంటి దిగ్గజ సంస్థలు వేల కోట్ల పెట్టుబడులతో ఏపీకి క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ , ఐటీ రంగాల్లో ఏపీ అగ్రగామిగా నిలవడం ఈ గణాంకాల ద్వారా స్పష్టమవుతోందని నారా లోకేష్ చెబుతున్నారు.

విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేయనున్న ఏఐ డేటా హబ్, కర్నూలులో డ్రోన్ సిటీ , అమరావతిలో క్వాంటం వ్యాలీ వంటి మెగా ప్రాజెక్టులు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దౌత్యం, లోకేష్ పారిశ్రామిక అనుకూల ప్రసంగాలు గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించాయి. దేశంలోని సగటు పెట్టుబడుల వృద్ధి రేటు కంటే ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు చాలా రెట్లు ఎక్కువగా ఉందని ఈ నివేదికలు నొక్కి చెబుతున్నాయని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.

25.3% of India’s FY26 investments! #AndhraPradesh isn’t catching up - it’s pulling ahead.

This is what Speed of Doing Business looks like.#ChooseSpeedChooseAP https://t.co/7JKtosffXu

— Lokesh Nara (@naralokesh) January 2, 2026

నారా లోకేష్ చేసిన ఈ ట్వీట్ ఆంధ్రప్రదేశ్ మళ్లీ పారిశ్రామికంగా పుంజుకుందని చెప్పడమే కాకుండా, దక్షిణాదిలో పెట్టుబడుల రాజధానిగా ఎదిగిందని చాటుతోంది. దేశంలోనే అతిపెద్ద పెట్టుబడులను దక్కించుకోవడం ద్వారా, రాబోయే రోజుల్లో లక్షలాది మంది యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.