Nandus World Nandana Madhukar Couple UK Visa Scam Update : నందూస్ వరల్డ్ నందన, మధుకర్ కపుల్‌పై యూకే వీసా స్కాం ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీసా ఇప్పిస్తామని నమ్మబలికి విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ కపుల్ చేతిలో మోసపోయామంటూ ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా గుజరాత్, కర్ణాటక నుంచి కూడా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.

కేసు నమోదు

నందూస్ వరల్డ్ నందనతో పాటు ఆమె భర్త మధుకర్ జాగర్లమూడి ఇద్దరూ కలిసి తెలుగు విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేశారనేది ప్రదాన ఆరోపణ. గత కొద్ది రోజులుగా అటు సోషల్ మీడియా ఇటు మేజర్ మీడియా ఛానళ్లలో యూకే వీసా స్కాం ఆరోపణలే హాట్ టాపిక్‌గా మారాయి. వీసాలు, ఉద్యోగాల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేశారని... సర్టిఫికెట్ స్పాన్షర్షిప్ పేరుతో డబ్బులు దోచుకున్నారని బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.

ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు కాగా... దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. మధుకర్, రమానందన పాత్రపై ఎంక్వైరీ సాగుతోంది. హైదరాబాద్, గుంటూరుల్లో ఆఫీసులు ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

Also Read : Bigg Boss 10 Telugu Contestants : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా... నందూస్ వరల్డ్ నందుకు ఛాన్స్!

నందన పాత్రపై ఆరా

సోషల్ మీడియాలో పాపులర్ అయిన రమా నందన తన భర్తకు సహకరించారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. నందూస్ వరల్డ్ అకౌంట్‌కే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశామని చెబుతున్నారు. కర్ణాటకకు చెందిన ఓ మహిళ తన నుంచి మధుకర్ రూ.22 లక్షలు తీసుకున్నారని పోలీసులకు కంప్లైంట్ చేశారు. అధికారులు ఆమె సమర్పించిన ఆధారాలు పరిశీలిస్తున్నారు.

నేరం రుజువైతే...

ఒకవేళ నేరం రుజువైతే యూకే/భారత చట్టాల ప్రకారం జాగర్లమూడి రమానందన, మధుకర్‌కు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. జైలు శిక్ష తర్వాత పాస్ పోర్ట్ రద్దు చేసి ఇండియాకి డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. పోలీసులు త్వరలోనే ఈ అంశంపై పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. యూట్యూబ్ ఛానల్ కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఈ దంపతులపై భారత్‌లో ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి.

యూట్యూబ్, సోషల్ మీడియా యూజర్లకు నందూస్ వరల్డ్ నందు అంటే తెలీని వారుండరు. వీరు చేసే వీడియోలు చాలా ఫేమస్. ఇదే ఫేమ్‌తో సినిమాల్లోనూ నందన ఛాన్సెస్ దక్కించుకున్నారు. రీసెంట్‌గా 'మన శంకర వరప్రసాద్ గారు'తో పాటు ఓటీటీ రిలీజ్ 'సంధ్యా నామ ఉపాసతే'లో నటించారు.

Also Read : Irumudi: 'ఇరుముడి' కోసం రెండు అయ్యప్ప పాటలు... హీరోయిన్ షేర్ చేసిన వర్కింగ్ స్టిల్స్ చూశారా?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.