Nandamuri Balakrishna Movie Update : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఇప్పుడు 'డాకు మహారాజ్' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ మూవీని థియేటర్లలో చూసిన నందమూరి అభిమానులు బాలయ్య నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బాలయ్య నెక్స్ట్ మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్ కోసం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వర్క్ చేయబోతున్నారనే క్రేజీ అప్డేట్ బయట కొచ్చింది.

బాలయ్య తో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు

బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న బాలయ్య వరుస హిట్స్ తో జోరు మీద ఉన్నారు. ఇదే జోష్ తో ఆయన వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. త్వరలోనే బాలయ్య నెక్స్ట్ మూవీని మొదలు పెట్టబోతున్నారు. అయితే ఇప్పటికే బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల్లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న ప్రాజెక్ట్ కూడా ఒకటి. బాలయ్య కెరీర్లో 111వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే మొదలు పెట్టారు డైరెక్టర్ గోపిచంద్. ఇక ఈ మూవీలో హీరోయిన్లుగా చెన్నై చిన్నది త్రిష, మాళవిక మోహనన్ లను సెలెక్ట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

అత్యంత భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థకు కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించబోతోంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య - గోపీచంద్ ప్రాజెక్టుకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించబోతున్నాడని అంటున్నారు. ఈ వార్తలు గనక నిజమైతే... బాలయ్య రోల్ కు తన సంగీతంతో అనిరుధ్ ఇచ్చే మాస్ ఎలివేషన్ మ్యూజిక్ తో థియేటర్లు బద్దలవ్వడం ఖాయం. త్వరలోనే దీని గురించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

అయితే ఒక్క సినిమాకే హైప్ ఇలా ఉంటే, అనిరుధ్ బాలయ్యతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయబోతున్నాడనే క్రేజీ రూమర్ ఒకటి చక్కర్లు కొడుతోంది. గోపీచంద్ తో పాటు బాలయ్య నెక్స్ట్ ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాడని టాక్ నడుస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న 'జైలర్ 2' అనౌన్స్మెంట్ తర్వాత, ఇందులో బాలయ్య ఓ కీలక పాత్ర పోషించబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ ప్రాజెక్టుకి కూడా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండడంతో, బాలయ్య - అనిరుధ్ కాంబోలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తెరకెక్కుతున్నట్టుగా అయింది. అలాగే బాలయ్య - అనిరుధ్ కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ మూవీ NBK 111 కావడం విశేషం.

బాలయ్య నెక్స్ట్ మూవీ ఇదే...

నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 'అఖండ 2' షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది. కంటిన్యూగా నాలుగు సినిమాలతో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డును క్రియేట్ చేసిన బాలయ్య అతి త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ తర్వాత గోపీచంద్ మలినేని - బాలయ్య కాంబోలో ప్రాజెక్ట్ తెరపైకి వెళ్లనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన 'వీర సింహా రెడ్డి' మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ హిట్ కాంబో మరోసారి రిపీట్ అవుతుండడంతో 'NBK 111'పై అంచనాలు భారీగా ఉన్నాయి.

Also Read: 'వైఫ్ ఆఫ్' రివ్యూ: రాత్రికొచ్చే అమ్మాయి... గంజాయి... ఎఫైర్లు... ETV Winలో కొత్త సస్పెన్స్ డ్రామా ఎలా ఉందంటే?