PM Modi Launches Namo Bharat Corridor In Delhi: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఢిల్లీ - ఘజియాబాద్ - మేరఠ్ నమో భారత్ కారిడార్‌ను (Namo Bharat Corridor) ఆదివారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్, ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్ఆర్‌టీఎస్ (RRTS) కారిడార్‌లో 13 కి.మీల అదనపు సెక్షన్‌ను ఆయన ప్రారంభించారు. హిండన్ ఎయిర్‌బేస్ నుంచి సాహిబాబాద్ చేరుకున్న ప్రధాని అదనపు మెట్రో లైన్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి సాహిబాబాద్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు ప్రయాణించారు. చిన్నారులు వేసిన పెయింటింగ్స్‌ను ఆసక్తిగా తిలకించి వారితో సరదాగా ముచ్చటించారు. ఈ మార్గంలో కొత్తగా ప్రారంభించిన రైలు 13 కి.మీ విభాగంలో 6 కి.మీ మేర భూగర్భంలో నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నమో భారత్ రైళ్లు భూగర్భ విభాగంలో నడపడం ఇదే తొలిసారి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లను అనుసంధానం చేసేలా నమో భారత్ స్టేషన్లను రూపొందించారు.

Also Read: Indian Coast Guard Helicopter Crash: గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం