Nagoba Jatara 2026: నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్

3 months ago 6
ARTICLE AD
<p>Nagoba Jatara | ఇంద్రవెల్లి: నాగోబా జాతర సందర్భంగా ఒకరోజు విద్యాసంస్థలకు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సెలవు ప్రకటించారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో నిర్వహించే చారిత్రాత్మక నాగోబా జాతర ప్రజా దర్బార్&zwnj;ను పురస్కరించుకుని, జనవరి 22 (గురువారం) రోజున జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.</p> <p>ఆదివాసీల ఆరాధ్యదైవం, ఆసియాలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర సందర్భంగా,​మెస్రం వంశీయుల విజ్ఞప్తి మేరకు, జాతర విశిష్టతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ తెలిపారు. జనవరి 22 రోజున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలకు సెలవు ఉంటుందనీ, ఈ సెలవుకు బదులుగా, మార్చి 14న (మార్చి రెండవ శనివారం) రోజున జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు పని చేయాల్సి ఉంటుందనీ సూచించారు.</p>
Read Entire Article