Anushka Shetty To Play Key Role In Nagarjuna 100th Movie: 'కుబేర', 'కూలీ' మూవీస్‌తో ఫుల్ సక్సెస్ జోష్‌లో ఉన్న కింగ్ నాగార్జున ప్రస్తుతం తన 100వ చిత్రం తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ మూవీకి తమిళ డైరెక్టర్ రా కార్తీక్ దర్శకత్వం వహించనుండగా... రీసెంట్‌గానే పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్ ప్రారంభమైంది. సైలెంట్‌గానే మూవీని స్టార్ట్ చేయగా త్వరలోనే పూర్తి షెడ్యూల్ ప్రారంభం కానుంది.

హిట్ పెయిర్ రిపీట్?

ఈ మూవీలో హిట్ పెయిర్స్ రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ రోల్ కోసం సీనియర్ హీరోయిన్ టబును సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. అప్పట్లో నాగ్, టబు కాంబోలో వచ్చిన 'నిన్నే పెళ్లాడతా', 'ఆవిడా మా ఆవిడే' మూవీస్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్నారనే వార్తలతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. తాజాగా మరో బజ్ ఫిలింనగర్ వర్గాల్లో వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో కీలక పాత్ర కోసం స్వీటీ అనుష్కను మూవీ టీం సంప్రదించిందట. ఆ రోల్ చాలా ఇంపార్టెంట్ అని అనుష్క అయితేనే బాగుంటుందని భావిస్తోందట. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. 'సూపర్' సినిమాలో నాగ్, అనుష్క జంటగా నటించారు. ఆ తర్వాత వచ్చిన 'డాన్', 'ఢమరుకం', 'రగడ' చిత్రాలతోనూ హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ఇక నాగార్జున కెరీర్‌లో హిట్ చిత్రంగా నిలిచిన 'సోగ్గాడే చిన్నినాయనా' మూవీలో గెస్ట్ రోల్ చేశారు. అలాగే, 'ఓం నమో వెంకటేశాయ' మూవీలో వెంకటేశుని భక్తురాలిగా నాగార్జునతో కలిసి కనిపించారు. ఇప్పుడు 'కింగ్ 100' మూవీలో హీరోయిన్‌గా నటిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: నేరుగా ఓటీటీలోకే సూపర్ నేచురల్ థ్రిల్లర్ - 'బారాముల్లా' వరల్డ్ ఆ రోజు నుంచే చూసెయ్యండి