యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)తో శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) గత ఏడాది డిసెంబర్ 4న ఏడు అడుగులు వేశారు. వీళ్లిద్దరి పెళ్లి అయిన తర్వాత విడుదల అవుతున్న నాగ చైతన్య సినిమా 'తండేల్' (Thandel). భర్తకు బెస్ట్ విషెష్ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో క్యూట్ పోస్ట్ చేశారు.

నీ దర్శనం అవుతుంది సామీ - శోభితా ధూళిపాళ
''ఈ సినిమా ('తండేల్') చిత్రీకరణ చేసేటప్పుడు మీరు ఎంత ఫోకస్డ్, పాజిటివ్‌గా ఉన్నారో చూశా. ఈ ఎక్స్ట్రా - ఆర్డినరీ (అసాధారణ) ప్రేమ కథను థియేటర్లలో ఎక్స్‌పీరియన్స్‌ చేయడానికి ప్రేక్షకులు అందరితో పాటు నేనూ ఎగ్జైటెడ్‌గా ఉన్నాను'' అని శోభితా ధూళిపాళ పోస్ట్ చేశారు.

'తండేల్' సినిమాలో రాజు క్యారెక్టర్ కోసం నాగ చైతన్య గడ్డం పెంచారు. కొన్ని నెలలుగా ఆయన గడ్డంతో కనిపిస్తున్నారు. ఇప్పుడు గడ్డం తీసేశారు. క్లీన్ షేవ్ చేశారు. ఆ విషయాన్ని శోభితా ధూళిపాళ చెబుతూ ''ఫైనల్లీ గడ్డం షేవ్ చేశావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ'' అని భర్త నాగ చైతన్యను ట్యాగ్ చేశారు. ''థాంక్యూ మై బుజ్జి తల్లి'' అని నాగ చైతన్య రిప్లై ఇచ్చారు. అన్నట్టు పెళ్లిలోనూ ఆయన గడ్డంతోనే ఉన్నారు. పెళ్లి తర్వాత భార్యకు క్లీన్ షేవ్ లుక్‌తో కనిపించడం ఇదే మొదటిసారి.

వీళ్లిద్దరి ఇన్‌స్టా కన్వర్జేషన్ అభిమానులకు ఎంతో ముద్దు ముద్దుగా ఉంది. 'తండేల్' సినిమాకు అమెరికా ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ లభిస్తోంది. దాంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.

Also Read: ఊరిలో భార్య... సిటీలో మరొక మహిళతో ఎఫైర్... అయినా చాలదన్నట్టు ఇతరులపై కన్నేసిన మగాడు... ఓటీటీలోకి వచ్చిన దేవర విలన్ సినిమా

విశాఖ అల్లుడిని... మంచి కథ వస్తే శోభితతో చేస్తా!
'తండేల్' ప్రచార కార్యక్రమాల్లో తన భార్య శోభితా ధూళిపాళ గురించి నాగ చైతన్య మాట్లాడారు. విశాఖ వెళ్ళినప్పుడు తనకు వైజాగ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. ''నేను విశాఖ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్. సినిమాను మీరు ఇక్కడ బ్లాక్ బస్టర్ చేయాలి. లేదంటే పరువు పోతుంది'' అని చెప్పారు నాగ చైతన్య.

అంతే కాదు... భార్యతో కలిసి నటించేందుకు తాను సిద్ధం అని మరొక సందర్భంలో చెప్పారు. తన బుజ్జి తల్లి శోభితా ధూళిపాళ అని చెప్పిన ఆయన... మంచి కథలు వస్తే శోభితతో నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. 'తండేల్'తో నాగ చైతన్య హిందీలో అడుగు పెడుతున్నారు. ఆమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా'లో నటించినప్పటికీ... అది అతిథి పాత్ర. హీరోగా ఆయన ఫస్ట్ పాన్ ఇండియా చిత్రమిది. శోభితా ధూళిపాళ హిందీలో పలు సినిమాలు చేశారు. వీళ్ళిద్దరూ కలిసి నటిస్తే ఆ సినిమా పాన్ ఇండియా లెవల్ క్రేజ్ సొంతం చేసుకోవడం గ్యారెంటీ

Also Read: చిరుత ఏవరేజా... ఏంటిది అల్లు మామ? అప్పుడు మెగాస్టార్ మీద కృతజ్ఞత అన్నావ్... ఇప్పుడు మేనల్లుడి మీద చూపిస్తున్నది అసూయా? ప్రేమా?