Mysore Pak Recipe : ఇంట్లోనే మైసూర్ పాక్ ఇలా చేసుకోండి.. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా టేస్టీగా ఉంటుంది, రెసిపీ ఇదే
4 weeks ago 2
ARTICLE AD
కావాల్సిన పదార్థాలు
శనగ పిండి - కప్పు
పంచదార -  కప్పు
నెయ్యి - కప్పు
Also Read : కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది.. రెసిపీ ఇదే
తయారీ విధానం
మైసూర్ పాక్ తయారు చేయడానికి.. కప్పు శనగపిండిని తీసుకోండి. ఉండలు లేకుండా ఉండేలా జల్లించుకోవాలి. ఇప్పుడు ఒక పాన్​లో కొద్దిగా నెయ్యి వేసి స్టౌవ్ వెలిగించి దానిపై పెట్టాలి. దానిలో శనగపిండిని వేసి తక్కువ మంట మీద వేయించాలి. అడుగున మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. శనగపిండి పచ్చి వాసన పోయి.. తేలికపాటి సువాసన రావడం వస్తున్నప్పుడు మంటను ఆపేయాలి. శనగపిండి రంగు మరీ ముదురుగా లేనప్పుడు.. కరిగించిన నెయ్యిని కొద్దికొద్దిగా వేస్తూ.. ఉండలు రాకుండా బాగా కలపాలి. బాగా కలిపి ముద్దగా మారిన తర్వాత దానిని పక్కన పెట్టాలి.
పంచదార పాకం కోసం..
ఇప్పుడు మరొ కడాయి​లో కప్పు పంచదార, కొద్దిగా నీరు కలపండి. మీడియం మంట మీద, నిరంతరం కలుపుతూ ఉడికించండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత.. పాకాన్ని కొన్ని నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడకనివ్వాలి. మైసూర్ పాక్ కోసం.. పాకం మరీ చిక్కగా ఉండనవసరం లేదు. పాకం సిద్ధమైన తర్వాత.. శనగపిండి, నెయ్యి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసి పంచదార పాకంలో పూర్తిగా కలిసేలా, ఉండలు లేకుండా కలపండి. మిగిలిన నెయ్యిని కొద్దికొద్దిగా కలపండి. కొంత సమయం తర్వాత.. పిండి చిక్కబడటం ప్రారంభిస్తుంది. కడాయి అంచుల నుంచి వేరవుతుంది. అప్పటివరకు కలుపుతూనే ఉండాలి.
Also Read : ఆంధ్రా స్పెషల్ బెల్లం తాళికలు.. పండుగ రోజుల్లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది, వినాయకచవితికి చేసేయండి
ఇప్పుడు ఒక ట్రే లేదా కంచం తీసుకుని.. దానికి కొద్దిగా నెయ్యి రాయాలి. సిద్ధం చేసుకున్న మైసూర్ పాక్ మిశ్రమాన్ని అందులో పోసి.. ఒక చెంచాతో సమానంగా పరచండి. దానిని కాసేపు చల్లారనివ్వండి. దీంతో పాకం కొద్దిగా గట్టిపడుతుంది. అప్పుడు మీకు నచ్చిన షేప్​లలో వాటిని కట్ చేసుకోవచ్చు. అంతే నోరూరించే టేస్టీ మైసూర్ పాక్ రెడీ. మైసూర్ పాక్ మృదువుగా ఉండాలంటే.. దానిని ఎక్కువగా ఉడికించకూడదు. ఎక్కువ సేపు ఉడికిస్తే అది గట్టిగా మారిపోతుంది.
ఇంట్లో తయారుచేసుకున్న ఈ స్వీట్​ని శుభ్రమైన, పొడి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. పండుగలు లేదా ప్రత్యేక సందర్భాలలో అతిథులకు కూడా పెట్టవచ్చు. మీకు శనగపిండితో చేసిన స్వీట్స్ ఇష్టమైతే.. ఇంట్లో తప్పకుండా మైసూర్ పాక్ ట్రై చేయండి.
Also Read : ఉడికించిన శనగలతో నోరూరించే బ్రౌనీ చేసేయండిలా.. సింపుల్, టేస్టీ రెసిపీ ఇదే
Read Entire Article