370 Biryani Guy Vs Sejal Pawar:  సోషల్ మీడియాను కుదిపేస్తున్న గురుగ్రామ్ టెక్కీ హిమాన్షు జంగ్రా రూ. 370 బిర్యానీ వివాదం చల్లారకముందే.. కమెడియన్ ప్రణీత్ మోరేకు చెందిన అదే స్టాండప్ కామెడీ క్రౌడ్-వర్క్ షో నుంచి మరో షాకింగ్ వీడియో బయటకు వచ్చి నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఈసారి వివాదంలో చిక్కుకుంది ఒక సాధారణ వ్యక్తి కాదు.. సమాజంలో దైవంతో సమానంగా చూసే వైద్య వృత్తిలో ఉన్న ముంబైకి చెందిన లేడీ డాక్టర్ సెజల్ పవార్. మరణించిన వ్యక్తుల శరీర భాగాలపై ఆమె హాస్యం పేరిట చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి, నెెటిజన్ల అసహ్యానికి దారితీశాయి.

సదరు కామెడీ షోలో డాక్టర్ సెజల్ పవార్ మాట్లాడుతూ.. తాను, తన స్నేహితులు మెడికల్ కాలేజీలో అనాటమీ క్లాస్ ల్యాబ్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న పురుషుల శవాల ప్రైవేట్ భాగాల పరిమాణాన్ని చెక్ చేస్తూ సరదాగా మాట్లాడుకునేవాళ్లమంటూ నవ్వుతూ చెప్పింది. అంతటితో ఆగకుండా, ప్రాక్టికల్స్ చివర్లో తామంతా కలిసి పురుషుల శవాల ముఖ్యమైన జననాంగ భాగాలను కట్ చేసేవాళ్లమంటూ అత్యంత అసహ్యకరమైన రీతిలో జోక్ చేసింది. మరణించిన తర్వాత కూడా మానవ శరీరానికి ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని దిగజార్చేలా ఒక కాబోయే వైద్యురాలు ఇలా మాట్లాడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

This is Sejal Pawar a doctor in Mumbai
- She came to Pranit More show & joked about how she and her friends check D sizes of dead bodies
- Then she joked how they cut main part of male bodies at the end.
- Degrading Human Bodies in Death
-Rs 370 Biryani Guy Himanshu Jangra was… pic.twitter.com/zZ41ghcHlJ

— Rosy (@rose_k01) June 10, 2026

ఈ వీడియో వైరల్ కావడంతో నెట్టింట జెండర్ బయాస్, డబుల్ స్టాండర్డ్స్ పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. రూ. 370 బిర్యానీ తినిపించి అమ్మాయి నుంచి లైంగిక ప్రయోజనాలు ఆశించిన హిమాన్షు జంగ్రాను అందరూ అసహ్యించుకుని, ఉద్యోగం ఊడబీకేలా ట్రోల్ చేశారని.. మరి శవాలను, పురుషుల శరీర భాగాలను ఇంత దారుణంగా అవమానించిన ఈమె కేవలం ఒక అమ్మాయి అయినందుకే నెటిజన్లు ఎందుకు లైట్ తీసుకుంటున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, మెడికల్ ఎథిక్స్ ను మరుగన పరిచిన ఈమెపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.

ఈ విమర్శల దాడి తీవ్రం కావడంతో మెడికల్ కౌన్సిల్ నుంచి చర్యలు ఉంటాయనే భయంతో డాక్టర్ సెజల్ పవార్ తక్షణమే స్పందించింది. ఆమె ఒక సుదీర్ఘ వీడియో ద్వారా సోషల్ మీడియా వేదికగా దేశ ప్రజలకు, ముఖ్యంగా మెడికల్ కమ్యూనిటీకి బహిరంగ క్షమాపణలు చెప్పింది. ఆ షోలో కేవలం నవ్వుల కోసమే, కమెడియన్ అడిగిన ఫ్లోలో తాను అలా మాట్లాడానని.. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదని కన్నీళ్లు పెట్టుకుంది. వృత్తి పట్ల తనకు అత్యంత గౌరవం ఉందని, తన వ్యాఖ్యలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నట్లు పేర్కొంది.

Dr. Sejal Pawar faces severe backlash for making explicit jokes about male private parts on cadavers during a stand-up show. She later apologized, saying she was “naive.”

A shocking breach of medical ethics?#DoctorControversy #MedicalEthics #ViralVideo #StandUpComedy pic.twitter.com/dqpSOwk837

— UnMuteINDIA (@LetsUnMuteIndia) June 11, 2026

హాస్యం అనేది ఒకరిని నవ్వించడానికి ఉండాలి కానీ.. చనిపోయిన వారిని, లేదా ఒకరి జెండర్‌ను అవమానించేలా ఉండకూడదని ఈ రెండు వరుస వివాదాలు నిరూపించాయి. కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం, కమెడియన్ల చప్పట్ల కోసం యువత ఎంతలా దిగజారుతుందో చెప్పడానికి హిమాన్షు జంగ్రా, డాక్టర్ సెజల్ పవార్ ఉదంతాలే నిలువెత్తు నిదర్శనాలు. క్షమాపణలు చెప్పినప్పటికీ, ఒక డాక్టర్ నోటి నుంచి వచ్చిన ఆ వ్యాఖ్యలు వైద్య రంగానికే మచ్చ తెచ్చేలా ఉన్నాయంటూ నెటిజన్లు ఇప్పటికీ ఆమె వీడియో కింద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.