Mukesh Ambani gifted 22 storey luxury building to Friend Manoj Modi : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తన అత్యంత నమ్మకస్తుడు, చిన్ననాటి మిత్రుడు మనోజ్ మోదీ కి ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 22 అంతస్తుల విలాసవంతమైన భవనాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆయన చాలా కాలంగా రిలయన్స్ లోనే పని చేస్తున్నారు. సుమారు రూ. 1,500 కోట్ల విలువైన ఈ భవనం భారత కార్పొరేట్ చరిత్రలోనే ఒక ఉద్యోగికి అందిన అత్యంత ఖరీదైన కానుకగా నిలిచింది.

మనోజ్ మోదీని రిలయన్స్ సామ్రాజ్యంలో ముకేశ్ అంబానీ కుడి భుజంగా పిలుస్తారు. వీరిద్దరూ ముంబైలోని యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లో కలిసి చదువుకున్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు. 1980లలో ధీరూభాయ్ అంబానీ హయాంలోనే రిలయన్స్‌లో చేరిన మనోజ్ మోదీ, అప్పటి నుండి ముకేశ్‌తోనే ఉంటూ కంపెనీ తీసుకున్న ప్రతి పెద్ద నిర్ణయంలోనూ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన రిలయన్స్ రిటైల్ మరియు జియో బోర్డులలో డైరెక్టర్‌గా ఉన్నారు.

ముకేశ్ అంబానీ బహుమతిగా ఇచ్చిన ఈ భవనానికి బృందావన్ అని పేరు పెట్టారు. ఇది దక్షిణ ముంబైలోని అత్యంత ఖరీదైన నేపియన్ సీ రోడ్ లో ఉంది. మొత్తం 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో ఒక్కో అంతస్తు వైశాల్యం సుమారు 8,000 చదరపు అడుగులు. ఈ ప్రాంతంలో ఆస్తుల ధరలు చదరపు అడుగుకు రూ. 45,000 నుండి రూ. 70,000 వరకు పలుకుతున్నాయి.

ఈ 22 అంతస్తుల భవనంలో మొదటి 7 అంతస్తులు కేవలం కార్ పార్కింగ్‌ కోసమే కేటాయించారు. 8, 9, 10 అంతస్తులలో స్విమ్మింగ్ పూల్, జిమ్, స్పాతో పాటు 50 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న అత్యాధునిక సినిమా థియేటర్ ఉన్నాయి. 19 నుండి 21వ అంతస్తు వరకు మనోజ్ మోదీ నివాసం ఉండగా, మిగిలిన అంతస్తులను ఆయన కుమార్తెలు , వారి కుటుంబాల కోసం కేటాయించారు. ఇందులోని ఫర్నిచర్‌ను ప్రత్యేకంగా ఇటలీ నుండి తెప్పించారు.

BIG NEWS 🚨 Mukesh Ambani has gifted his trusted aide and close friend Manoj Modi a 22-storey luxury building in South Mumbai.

The premium property is located on Nepean Sea Road, one of India’s most expensive residential areas.

The building is estimated to be worth around… pic.twitter.com/fFj3VAnPuc

— News Algebra (@NewsAlgebraIND) January 6, 2026

రిలయన్స్ గ్రూప్ సాధించిన అనేక చారిత్రాత్మక విజయాల వెనుక మనోజ్ మోదీ మేధస్సు ఉంది. ముఖ్యంగా 2020లో లాక్‌డౌన్ సమయంలో ఫేస్‌బుక్ తో కుదిరిన సుమారు రూ. 43,000 కోట్ల ఒప్పందంలో ఆయనే ప్రధాన పాత్ర పోషించారు. అలాగే జియో లాంచ్, రిలయన్స్ రిటైల్ విస్తరణ వంటి మెగా ప్రాజెక్టులను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. ముకేశ్ అంబానీకి అత్యంత సన్నిహితంగా ఉంటూ, మూడు తరాల అంబానీలతో ధీరూభాయ్, ముకేశ్, ఇప్పుడు ఆకాశ్/ఈశా పనిచేసిన ఆయన విధేయతకు దక్కిన గుర్తింపుగా ఈ భవనాన్ని భావిస్తారు.

ఇంతటి భారీ ఆస్తికి యజమాని అయినప్పటికీ, మనోజ్ మోదీ చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయన సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. ప్రచారాన్ని అస్సలు ఇష్టపడరు. రిలయన్స్ ఏ డీల్ చేసినా తెర వెనుక ఉండి నడిపించే వ్యూహకర్తగా ఆయనకు పేరుంది.