Most Affordable Level 2 ADAS Cars: భారతదేశంలో నేడు కార్లు కొనేటప్పుడు, ప్రజలు కేవలం డిజైన్, పవర్ లేదా మైలేజీని మాత్రమే కాకుండా, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ భద్రతా జాబితాలో ADAS అంటే అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (Advanced Driver Assistance System) అత్యంత ముఖ్యమైన ఫీచర్‌గా మారింది. వాస్తవానికి, ఈ సిస్టమ్ కారు చుట్టూ ఉన్న పరిస్థితులను గుర్తించడంలో సహాయపడుతుంది. అవసరమైనప్పుడు బ్రేక్‌లు వేయడం, లేన్‌లో ఉండటం లేదా ప్రమాదాలను నివారించడం వంటి పనులు కూడా చేయగలదు. మార్కెట్‌లో ఇప్పుడు అనేక చవకైన కార్లు అందుబాటులో ఉన్నాయి, ఇవి Level-2 ADASతో వస్తాయి. ఈ కార్లు సురక్షితమే కాకుండా, తక్కువ బడ్జెట్‌లో హై-టెక్ ఫీచర్లను కూడా అందిస్తాయి. ఈ చవకైన ADAS కార్లపై ఒక లుక్ వేద్దాం.

హోండా అమేజ్‌(Honda Amaze)

హోండా అమేజ్‌ భారతదేశంలో అత్యంత తక్కువ ధరకు Level-2 ADASను అందిస్తుంది. దీని ప్రారంభ ధర కేవలం 9.15 లక్షలు. ఇది 89 bhp పవర్ ఇచ్చే 1.2-లీటర్ i-VTEC ఇంజిన్‌ను కలిగి ఉంది. దాదాపు 18.65 kmpl మైలేజీనిస్తుంది. దీని Honda Sensing ADAS సూట్ ప్రమాదాలను నివారించడం, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటో హై-బీమ్ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఫ్యామిలీ కారుగా, ఇందులో 416 లీటర్ల పెద్ద బూట్ స్పేస్, వైర్‌లెస్ కనెక్టివిటీ, 6 ఎయిర్‌బ్యాగ్‌లు దీనిని మరింత ఆచరణాత్మకంగా చేస్తాయి.

టాటా నెక్సాన్‌ (Tata Nexon)

టాటా నెక్సాన్‌ దాని 5-స్టార్స్ భద్రతా రేటింగ్, దృఢత్వానికి ప్రసిద్ధి చెందింది. Level-2 ADASతో దీని ధర 12.16 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీని 118 bhp ఇంజిన్ 17–24 kmpl వరకు మైలేజీనిస్తుంది. Nexon ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటోనమస్ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. దీని రెడ్ డార్క్ ఎడిషన్ స్పోర్టీ ఇంటీరియర్, 10.25-అంగుళాల డ్యూయల్ స్క్రీన్, 360-డిగ్రీ కెమెరాతో చాలా ప్రీమియం అనుభూతిని కలిగిస్తుంది.

మహీంద్ర XUV 3XO(Mahindra XUV 3XO)

మహీంద్ర XUV 3XOని ADASతో 12.17 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఇది 130 PS కలిగిన 1.2-లీటర్ టర్బో పెట్రోల్ లేదా 115 bhp కలిగిన డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది దాదాపు 20 kmpl మైలేజీనిస్తుంది. దీని ADAS ఫీచర్లలో ఫార్వర్డ్ కొలిషన్ మిటిగేషన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, స్మార్ట్ పైలట్ అసిస్ట్ ఉన్నాయి. దీని 5స్టార్స్‌ Bharat NCAP రేటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం హర్మాన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ దీనిని ఈ విభాగంలో శక్తివంతమైన ఎంపికగా చేస్తాయి.

హోండా సిటీ(Honda City)

హోండా చాలా కాలంగా తన స్మూత్ రైడ్ క్వాలిటీకి ప్రసిద్ధి చెందింది. Level-2 ADASతో దీని ధర రూ. 12.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీని 1.5-లీటర్ ఇంజిన్ 120 bhp పవర్ ఇస్తుంది. CVTతో 18.4 kmpl మైలేజీనిస్తుంది. కొలిషన్ అవాయిడెన్స్, లేన్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ సిస్టమ్ వంటి ఫీచర్లు దీనిని లాంగ్ టూర్‌లకు మంచి ఎంపికగా చేస్తాయి. 506 లీటర్ల బూట్ స్పేస్, లెదరెట్ సీట్లు దీని ప్రీమియం లుక్‌ను మరింత పెంచుతాయి.

హ్యూందాయి వెర్న్‌ (Hyundai Verna)

హ్యూందాయి వెర్న్‌ తన శక్తివంతమైన 160 bhp టర్బో ఇంజిన్, 20.6 kmpl మైలేజీతో ఈ జాబితాలో అత్యంత శక్తివంతమైన కారు. దీని ధర రూ.14.35 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ అవాయిడెన్స్ వంటి Level-2 ADAS ఫీచర్లు ఉన్నాయి. 528 లీటర్ల బూట్, బోస్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు దీనికి చాలా ప్రీమియం అనుభూతిని ఇస్తాయి. దీని 5-స్టార్స్‌ GNCAP రేటింగ్ దాని భద్రతను మరింత బలపరుస్తుంది.