Janasena MLA Arava Sridhar sexual harassment | అమరావతి: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక దాడి ఆరోపణలపై జనసేన పార్టీ చర్యలు చేపట్టింది. సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని జనసేన రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఈ అంశంపై ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించారు. టి.శివశంకర్, తంబళ్ళపల్లి రమాదేవి, టి.సి.వరుణ్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ 7 రోజుల్లోగా ఈ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ప్రకటనలో పేర్కొంది. ఈ కమిటీ అరవ శ్రీధర్ పై మహిళ చేసిన ఆరోపణలపై నిజానిజాలు విచారణ చేసి పార్టీకి తమ నివేదిక అందిస్తుంది. ా నివేదిక పరిశీలన చేసి, తుది నిర్ణయం వెలువడేంత వరకూ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన అధినేత స్పష్టం చేశారు.

జనసేన ఎమ్మెల్యేపై మహిళ సంచలన ఆరోపణలు..

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఇప్పటికే స్పందించి, బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగిని అరవ శ్రీధర్‌పై అత్యంత తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, తనను భయపెట్టి గత ఏడాది కాలంగా ఆయన లైంగిక దాడికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణకు కమిటీ. pic.twitter.com/Qw9ydOidyg

— JanaSena Party (@JanaSenaParty) January 28, 2026

తన కోరిక తీర్చకపోతే ఆమె మూడేళ్ల కొడుకును చంపేస్తానని ఎమ్మెల్యే బెదిరించారని, ఈ క్రమంలో తాను గర్భవతిని కాగా దాదాపు ఐదుసార్లు బలవంతంగా అబార్షన్ చేయించారని ఆమె వాపోయారు. అంతేకాకుండా, తన భర్తకు విడాకులు ఇవ్వాలని కూడా ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారని, తాను లొంగకపోవడంతో వేధింపులు మితిమీరాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

స్పందించిన ఏపీ మహిళా కమిషన్ చైర్మన్..

ఈ ఘటనపై మీడియాలో వస్తున్న కథనాలను తీవ్రంగా పరిగణించిన ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ బాధితురాలికి భరోసా ఇచ్చారు. ఫోన్ ద్వారా ఆమెతో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న ఆమె, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహిళల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, బాధితురాలికి ప్రభుత్వం మరియు కమిషన్ అండగా ఉంటాయని హామీ ఇచ్చారు.

మరోవైపు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీల ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆమె, సదరు మహిళ తన కుమారుడిని ఉద్దేశపూర్వకంగానే ట్రాప్ చేసిందని ఆరోపించారు. కులం పేరు చెప్పి తమకు దగ్గరైందని, పగలు రాత్రి తేడా లేకుండా ఫోన్లు చేస్తూ పెళ్లి చేసుకోవాలని తన కొడుకును వేధించేదని పేర్కొంటూ, ఇది తన కుమారుడి రాజకీయ ఎదుగుదలను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రగా ఆమె అభివర్ణించారు.