Teja Sajja's Mirai OTT Platform: యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'మిరాయ్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. టీజర్, ట్రైలర్, లుక్స్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేయగా అందుకు తగ్గట్లుగానే థియేటర్లలో అలరిస్తోంది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?

'మిరాయ్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్' సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఇందులోనే స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా ఏ మూవీ అయినా థియేటర్లలో వచ్చిన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుంది. హిట్ టాక్ వస్తే స్ట్రీమింగ్ డేట్ కాస్త ఆలస్యం కావొచ్చు. ఈ క్రమంలో దాదాపు 8 వారాల తర్వాత 'మిరాయ్' ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఈ మూవీలో తేజ సజ్జా సూపర్ యోధగా నటించగా... మంచు మనోజ్ విలన్ పాత్రలో మెరిశారు. తేజ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే శ్రియ, జగపతిబాబు, కౌశిక్ మెహతా కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా మూవీని నిర్మించారు.

Also Read: వాట్ ఏ మూమెంట్ - తమన్ స్టూడియోలో బాలయ్య బోయపాటి... 'అఖండ 2' ఇంటర్వెల్ వైబ్