Meltdown in Pakistan after India US trade deal announcement:  ఇండియా, అమెరికా మధ్య కుదిరిన నూతన వాణిజ్య ఒప్పందం పాకిస్థాన్‌లో భారీ రాజకీయ దుమారానికి దారితీసింది. భారత్‌పై అమెరికా టారిఫ్ లను తగ్గించడం, వాణిజ్యపరమైన వెసులుబాట్లు కల్పించడంపై పాక్ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అగ్రరాజ్యం భారత్‌కు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి పాక్ నెటిజన్లు ఆశ్చర్యపోతుంటే, మరోవైపు తమ ప్రభుత్వం దౌత్యపరంగా పూర్తిగా విఫలమైందంటూ ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా టారిఫ్స్ అనే అంశం చుట్టూ ఈ వివాదం నడుస్తోంది. భారత్ నుంచి వెళ్లే వస్తువులపై అమెరికా రాయితీలు ప్రకటించడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, పాక్ వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్లో ఆదరణ కరువవుతుందని అక్కడి ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ ప్రపంచ స్థాయి శక్తిగా ఎదుగుతుంటే, పాకిస్థాన్ కేవలం అప్పుల కోసం ప్రపంచ దేశాల చుట్టూ తిరగడానికే పరిమితమైందని పాక్ పౌరులు ఎద్దేవా చేస్తున్నారు.

🚨 INDIA-US TRADE DEAL SPARKS PAKISTAN BACKLASH

India has successfully negotiated a major trade deal with the US, resulting in a tariff cut to 18% for Indian goods. This news has triggered a massive meltdown in Pakistan, where the tariff rate remains higher at 19%. Critics in… pic.twitter.com/28nO1lo7mO

— Eshani Verma (@eshaniverma809) February 5, 2026

సోషల్ మీడియాలో మెల్ట్‌డౌన్ పేరుతో పాక్ ప్రభుత్వంపై ట్రోల్స్ హోరెత్తుతున్నాయి ఒకవైపు భారత్ అమెరికాతో బిలియన్ డాలర్ల ఒప్పందాలు చేసుకుంటుంటే, మన ప్రభుత్వం మాత్రం ఇంకా పాత సమస్యల్లోనే కూరుకుపోయింది అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. భారత్-అమెరికా బంధం బలోపేతం కావడం వల్ల దక్షిణాసియాలో పాకిస్థాన్ ఒంటరి అవుతుందన్న భయం అక్కడి రాజకీయ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఒప్పందం కేవలం వాణిజ్యమే కాకుండా, దౌత్యపరంగా భారత్ సాధించిన గొప్ప విజయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

BREAKING 🚨: Meltdown 😂

Despite the Nobel nomination, joining the “Board of Peace,” and offering exclusive mineral access, Pakistan has failed to secure a favorable outcome.

While India just locked in a massive new trade deal.

A diplomatic failure for Pak.😂😂#tradedeal pic.twitter.com/PXX4SA7QTj

— @धूर्त_Politician (@AbhinavGagan1) February 2, 2026

ఈ పరిణామం పాక్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో తాము వెనుకబడ్డామనే వాస్తవాన్ని అంగీకరించలేక, ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కోలేక పాక్ పాలకులు సతమతమవుతున్నారు. భారత్ సాధించిన ఈ మైలురాయిపై పాక్ విదేశాంగ శాఖ స్పందించాల్సి ఉండగా, పౌరుల ఆగ్రహం చూసి స్పందించడం మానేశారు.