Meghasandesam Serial Today Episode: సూర్య ఆగడాలను భరించలేని భూమి ఏదైనా చేసి మెహెందీ తప్పించాలని ఆకాష్‌కు చెప్తుంది. ఆకాష్‌ ఇచ్చిన ఐడియా బాగుందని అలాగే చేయాలని డిసైడ్‌ అవుతుంది. భూమి మీద సూర్యకు డౌట్‌ వస్తుంది. ఇంకా ఇవాళ్టీ మేఘసందేశం సీరియల్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్యను చంపేస్తానన్న ఆకాష్‌

పెళ్లికి ముందే తనతో శోభనం జరగాలని సూర్య బలవంతం చేస్తున్నాడని భూమి బాధపడుతూ గగన్ కు చెప్తుంది. ఆ మాటలు వినగానే గగన్‌ ఆవేశంతో నా భార్యనే శోభనం చేసుకుంటానని మాట్లాడతాడా వాడికి నేనేంటో చూపిస్తాను అంటూ గగన్‌ బయటకు వెళ్లబోతుంటే.. భూమి ఆపేసి హలో ఏం మాట్లాడుతున్నారు మీరు అంటుంది. అందుకు గగన్‌ అంటే మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను కదండి అంటూ మాట మారుస్తాడు గగన్‌. అయినా పెళ్లి కాకుండా అలా ఎలా మాట్లాడతాడు. వాడిని ఊరికే వదల కూడదు.. అంటూ తిడుతాడు.

శరత్‌ చంద్ర కోసం తాను మౌనంగా ఉన్నానన్న భూమి

కొంచెం కూల్‌గా ఆలోచించండి వాళ్ల దగ్గర మా నాన్న హంతకుడు అని నిరూపించే ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఇబ్బంది పడేది మా నాన్న. మా నాన్న గురించి ఆలోచించే వాడు ఏం మాట్లాడినా నేను ఊరుకుంటున్నాను. లేకపోతే నేనే వాడిని చంపేసేదాన్ని అంటూ తిడుతుంది భూమి. వాడు అన్ని మాట్లాడుతున్నా మీరు మీ నాన్న కోసం ఊరికే ఉంటారేమో నేను అసలు ఊరుకోలేను భూమి గారు. వాడు నా భూమితో అలా మాట్లాడుతుంటే.. నేను బతికున్నా చచ్చినట్టే కదా.? మీరే చెప్పండి భూమి గారు.. ఇదే పొజిషన్‌లో ఇదే సిచ్యుయేషన్‌లో గగన్‌ గారు ఉంటే ఎలా రియాక్ట్‌ అయ్యేవారు వాణ్ని వెళ్లి చంపేవారు కదా నేను అదే చేయబోతున్నాను కదా అంటాడు ఆకాష్‌.

ఆకాష్ కిస్‌ చేసిన భూమి

<a title="ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

చూడండి ఆకాష్‌ గారు మీరు నా బావ కాదు మీరు ఆకాష్‌ మీరు మరీ ఎక్కువగా ఆలోచించకండి ఆ సూర్యకు ఎలా బుద్ది చెప్పాలో అది ఆలోచించండి.. ముందు ఈ మెహెందీ ఫంక్షన్‌ ఎలా ఆపాలో అది ఆలోచించండి. తర్వాత ఏం చేయాలో అది చేద్దాం అంటుంది భూమి. అందుకు ఆకాష్‌ ఒక ఐడియా చెప్తాడు భూమికి. ఐడియా బాగుందని అలాగే చేస్తానని బయటకు వెళ్లబోతున్న భూమి కాళ్ల మధ్య కాళ్లు పెట్టేస్తాడు భూమి ఆకాష్‌ మీద పడుతుంది. ఆకాష్‌ రొమాంటిక్‌ గా ఫీలవుతుంటే.. తిట్టి వెళ్లిపోతుంది.

భూమిని అనుమానించిన సూర్య

బయటు ఉన్న సూర్య అనుమానంగా భూమి నిజంగానే వాష్‌ రూంకు వెళ్లిందా..? లేక మెహెందీ ఫంక్షన్‌ చెడగొట్టడానికి ఏదైనా ప్లాన్‌ చేయడానికి వెళ్లిందా..? అంటూ అడగ్గానే.. అది ఏం చేసినా ఆ ఆకాష్‌ గాడితో కలిసే ప్లాన్‌ చేస్తుంది. ఇప్పుడు వాడు ఇక్కడకు రాలేడు కాబట్టి దానికి అంత సీన్‌ లేదు అంటూ అపూర్వ చెప్తుంది. అప్పుడే భూమి వస్తుంది. మెహెందీ పెట్టించుకోవడానికి నిరాకరిస్తుంది. అందరూ షాక్‌ అవుతారు. మధ్యలో చెర్రి కలగజేసుకుని భూమి ఎందుకు మెహెందీ వద్దు అంటుందో నాకు తెలుసు అంటాడు. ఏం మాట్లాడుతున్నావు చెర్రి భూమి వద్దనడానికి కారణం నీకు తెలుసా..? అంటూ శరత్‌ చంద్ర అడగ్గానే.. అవును మామయ్య అసలు భూమికి సూర్యకు పెళ్లి అవుతుంటే.. భూమి వేరే ఎవరితోనో మెహెందీ ఎందుకు పెట్టించుకుంటుంది. పెట్టించుకుంటే సూర్యతో పెట్టించుకుంటుంది అంటూ చెర్రి చెప్తాడు. భార్యకు భర్తే కదా మామయ్య మెహెందీ పెట్టేది. ఇలాంటి చిన్న చిన్న వాటి వల్లే కదా వారి మధ్య రిలేషన్‌ గట్టిపడేది అంటాడు. అందుకు అక్కడున్న వాళ్లు చిన్న వాడివైనా చాలా మంచి మాట చెప్పావు బాబు అంటారు. సూర్యనే మెహెందీ పెట్టమని చెప్తారు. సూర్య నవ్వుతూ వెళ్లి మన ఫస్ట్‌ నైట్‌కు నిన్ను నేనే రెడీ చేస్తా అనుకోలేదు భూమి అంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.