Meghasandesam Serial Today Episode: భూమి, సూర్యల పెళ్లి ఆగిపోగానే నక్షత్ర, అపూర్వ ఇంటికి వెళ్లిపోతారు. ఇల్లంతా చూసిన అపూర్వ ఎలాగూ పెళ్లి పెటాకుల అయిందని డెకరేషన్‌ అంతా తీసేశారు అంటుంది. అవును మమ్మీ మన ముఖాల్లాగే ఇల్లు కూడా బోసిపోయింది.. ఈరోజు భూమి, సూర్యల పెళ్లి అయిపోతుంది. ఈ ఆస్థి అంతా మనది అయిపోతుందని ఎన్ని కలలు కన్నాను మమ్మీ.. మన కలలన్నీ గంగలో కలిసిపోయాయి ఇంక మన బతుకు అంతా నువ్వు పని మనిషి, నేను పని మనిషి కూతురులా బతకాల్సిందే అంటూ నక్షత్ర బాధపడుతుంది.

అరుపులు విని భయపడిపోయిన నక్షత్ర

<a title="ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

అపూర్వ అలసిపోయినట్టు నిట్టూరుస్తూ.. నక్షత్ర నాకు ఊపిరి ఆగడం లేదే వెళ్లి కొన్ని మంచినీళ్లు తీసుకురా అని చెప్తుంది. నక్షత్ర తెస్తాను ఉండు మమ్మీ అంటూ వెళ్లి వాటర్‌ ఇస్తుంది అపూర్వకు అపూర్వ వాటర్‌ తాగుతుంటే.. పై నుంచి గట్టిగా నవ్వుతున్న సౌండ్స్‌ వినిపిస్తాయి. నక్షత్ర భయంగా మమ్మీ ఎవరు మమ్మీ ఎవరు అది అంటుంది. చూద్దాం పద అంటూ సౌండ్స్‌ వచ్చిన రూం దగ్గరకు వెళ్తారు అపూర్వ, నక్షత్ర.

రూంలో సీక్రెట్‌గా మాట్లాడుకున్న భూమి, ఆకాష్‌

రూంలో భూమి, ఆకాష్‌ ఉంటారు. బయటకు వినిపించేలా భూమి మాట్లాడుతుంది. ఆఖరి నిమిషం వరకు మీరు రాకపోతే ఆ పెళ్లి జరిగిపోతుంది. జీవితం అంతా ఆ సూర్య గాడితో చస్తూ బతకాలి అనుకున్నాను. కానీ సరైన సమయంలో పోలీసుల్లా మీరు వచ్చి మా నాన్నను ఫేక్‌ అరెస్ట్‌ చేయించి పెళ్లిని మాత్రం రియల్‌గా ఆపేశారు. మీకు ఎలా థాంక్స్‌ చెప్పాలో అర్థం కావడం లేదు ఆకాష్‌ గారు అంటుంది భూమి. మీరు నా కోసం చేసిన ఆ పనికి మీకు ఏమిచ్చినా తక్కువే కానీ మీకు ఏదో ఒకటి ఇవ్వాలని ఉంది ఆకాష్‌ గారు అంటే ఏమి అడిగినా ఇస్తారా..? అని ఆకాష్‌ అడిగితే ఏం అడిగినా ఇస్తాను అడగండి అంటుంది భూమి.

భూమిని కిస్‌ అడిగిన ఆకాష్‌

<a title="ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

దీంతో ఆకాష్‌ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రేమగా ఒక ముద్దు ఇవ్వండి ఫ్లీజ్‌ అని ఆకాష్‌ అడగ్గానే.. బయటి నుంచి వింటున్న అపూర్వ, నక్షత్ర షాక్‌ అవుతారు. లోపల భూమి సరే అంటూ ఆకాష్‌కు కిస్‌ ఇచ్చినట్టు సౌండ్‌ చేస్తుంది. ఆకాష్‌ అడగ్గానే మీరు ముద్దు ఇవ్వడానికి ఒప్పుకుంటారనుకుంటే ఒక్కటి అడిగేవాణ్ని కాదు చాలా అడిగేవాణ్ని అంటాడు ఆకాష్‌.. అడగకపోయినా ఇప్పుడు ఇస్తాను ఎన్ని ముద్దులైనా అంటూ ఆకాష్‌కు ఫుల్లుగా ముద్దులు ఇచ్చినట్టు నటిస్తుంది.

నెక్స్ట్‌ తన ప్లాన్‌ చెప్పిన ఆకాష్‌

ఇప్పుడు చెప్పండి నెక్ట్స్‌ మీ ఫ్లాన్‌ ఏంటి..? అని భూమి అడిగితే.. నెక్స్ట్‌ ప్లానంటే ఫేక్‌ పోలీస్‌ను క్రియేట్‌ చేసినట్టు ఫేక్‌ కోర్టు, లాయర్లను క్రియేట్‌ చేస్తాను. ఆ కోర్టులోనే ఫేక్‌ జడ్జితో ఫేక్‌ తీర్పు ఇప్పించి ఫేక్‌ శిక్ష పడేలా చేస్తాను. దాని తర్వాత మీ నాన్న గారికి శిక్ష పడిన వెంటనే మీ నాన్నగారికి మొదటగా మైండ్‌లో వచ్చే ఆలోచన నా పెళ్లి. అప్పుడు నేను ప్రేమించిన విషయం చెప్తాను మీ డాడీకి.. అప్పుడు ఆయనే మన పెళ్లికి ఒప్పుకుంటారు నా ప్లాన్‌ ఎలా ఉంది భూమి గారు అంటాడు. బయటి నుంచి అంతా వింటున్న అపూర్వ కోపంగా చూస్తుంది. అసలు ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది ఆకాష్‌ గారు అని భూమి అడిగితే.. ఈ ఐడియా మీరు చెప్పిందే అదే సూర్య ఫేక్‌ పోలీస్ స్టేషన్‌ క్రియేట్‌ చేసి నిన్ను టార్చర్‌ పెట్టాడు అని చెప్పావు కదా అందులోంచి వచ్చిందే ఈ ఐడియా అని ఆకాష్‌ చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?