MeghasandesamSerial Today Episode: పోలీస్ గెటప్‌లో వెళ్లి వీడియో చూపించి శరత్‌ చంద్రను ఆకాష్‌ అరెస్ట్‌ చేసి తీసుకెళ్తుంటే భూమి అడ్డుపడుతుంది. మీరు చూసిన వీడియోలో ఉన్న గగన్‌ నా భర్త. గగన్‌ అటే మా నాన్నకు ఇష్టం లేదన్నది నిజమే కానీ ఒక మనిషిని చంపేంత క్రూరుడు మాత్రం కాదు మా నాన్న. నా బావను చంపింది వీడు. దయచేసి మా నాన్నను వదిలిపెట్టి వీడిని అరెస్ట్‌ చేయండి సార్‌ అంటుంది భూమి.

సూర్య చెంప పగులగొట్టిన శరత్‌ చంద్ర

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

మీరు ఇలా నోటి మాట కాకుండా ఏదైనా సాక్ష్యం ఉంటే చెప్పండి ప్రస్తుతానికి మా దగ్గర ఉన్న సాక్ష్యాన్ని బట్టి నేను మీ నాన్నను అరెస్ట్‌ చేయడం తప్పదు. చూడండి మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉంటే చూపించండి మీసాల రాజు అరెస్ట్‌ చేయ్‌ అని చెప్పగానే.. చెర్రి అరెస్ట్ చేయబోతుంటే శరత్‌ చంద్ర ఒక్క నిమిషం సార్‌ అంటూ సూర్య దగ్గరకు వెళ్లి చెంప పగులగొట్టి చీ ఏమి బతుకురా నీది బంగారం లాంటి భూమి బతుకును బూడిద చేయాలని ఎలా అనిపించిందిరా నీకు నీకంటే చనిపోయిన ఆ గగన్‌ వెయ్యి రెట్లు మేలు కదరా..? వాణ్ని నేను ఎంత అసహ్యించుకుంటున్నా నా బిడ్డను మాత్రం ప్రేమతోనే గెలవలనుకున్నాడు. ఆఖరికి నా బిడ్డ కోసం ప్రాణాలు కూడా వదిలేశాడు. కానీ నీలాగా మాత్రం దిగజారలేదు. వాడు నాకు శత్రువు కాబట్టి వాణ్ని అల్లుడిగా యాక్సెప్ట్‌ చేయలేకపోయాను కానీ నీ లాంటి నీచుడి కంటే మాత్రం వాడే నయంరా చీ నీ ముఖంచూస్తేంటేనే ఒళ్లంతా తేళ్లు జెర్రులు పాకుతున్నట్టు ఉంది. నా బిడ్డను బ్లాక్‌ మెయిల్‌ చేసిన నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టనురా వదిలిపెట్టను అంటూ ఆకాష్‌ గన్‌ లాక్కుని సూర్యను కాల్చబోతాడు.

శరత్‌ చంద్రను తీసుకెళ్లిన ఆకాష్‌

ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

ఆకాష్‌ అడ్డుపడి ఏయ్‌ ఏం చేస్తున్నావు శరత్‌ చంద్ర ఇప్పుడు మీ మీదున్న కేసుకే ఏడేళ్లు శిక్ష పడుతుంది. ఇప్పుడు ఇంకో వ్యక్తిని అది డిపార్ట్‌ మెంట్‌ వ్యక్తిని షూట్‌ చేస్తే జీవితాంతం జైళ్లో ఉండాల్సి వస్తుంది. ఒక్కసారి మీ అమ్మాయి ముఖం చూడండి.. ఇప్పుడు మీరు థింక్‌ చేయాల్సింది వీడి గురించి కాదు.. మీ అమ్మాయి ఫీచర్‌ గురించి మీసాల రాజు అరెస్ట్‌ చేయ్‌ అనగానే.. చెర్రి శరత్‌ చంద్రకు బేడీలు వేస్తాడు. శరత్‌ చంద్ర బాధపడుతూ భూమి దగ్గరకు వెళ్లి నన్ను క్షమించు తల్లి అంటూ ఒరేయ్‌ సూర్య నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టనురా అంటూ వెళ్లిపోతాడు. వెనకే ఆకాష్‌, చెర్రి వెళ్లిపోతారు. భూమి ఏడుస్తూ ఉంటుంది.

నిజం తెలిసి శారదను పొడవబోయిన మీరా

మరోవైపు ఇంట్లో ఉన్న మీరా కోపంగా ఏంటి బావగారు ఫోటో చూశాక నోరు తెరవడం లేదు. మీ బండారం బయట పడిపోయాక మీరు నోరు తెరచి ఏం చెప్తారు లేండి.. నీకంటే బుద్ది లేదు కనీసం నీకైనా ఉండాలి కదా అంటూ తిడుతుంటే.. శారద భయంగా నేను అనుకున్నట్టుగానే మీరాకు గతం గుర్తుకు వచ్చినట్టు ఉంది ఇక ఏం చేయాలి అని మనసులో అనుకుంటుంటే.. మీరా కోపంగా ఏమే నీకు ఈ వయసులో మొగుడు కావాల్సి వచ్చిందా..? అంటూ తిడుతుంటే.. కేపీ కోపంగా మీరా నోటికి వచ్చినట్టు మాట్లాడకు అంటాడు. మీరా కోపంగా గట్టిగా మాట్లాడతాను అంటూ అరుస్తూ.. నా ప్రాణం కాపాడినట్టు కాపాడి నేను రామా..కృష్ణా అంటూ హాస్పిటల్‌ లో పడి ఉంటే దీని కళ్లు మీ మీద పడ్డాయి. నా అయిదో తనాన్ని లాక్కోవాలని చూసిన దీన్ని నేను అసలు విడిచిపెట్టను అంటూ అటూ ఇటూ ఏదో వెతుకుంతుంది. శారద కోపంగా కేపీని తిడుతుంది. మీరా ఒక కత్తి పట్టుకుని వచ్చి శారదను బెదిరిస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?