Meghasandesam Serial Today Episode: సూర్య తాళి కట్టబోతున్న సమయానికి మండపానికి పోలీస్‌ గెటప్‌లో వెళ్తారు ఆకాష్‌, చెర్రి. పెళ్లి ఆపండి అంటాడు ఆకాష్‌ దగ్గరకు వెళ్లి చూస్తుంటే.. శరత్‌ చంద్ర ఎవరు మీరు అని అడగ్గానే.. ఐయామ్ డిఫ్యూటీ సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్ నరసింహ అని ఆకాష్‌ చెబితే.. కానిస్టేబుల్‌ కనకరాజు అని చెర్రి చెప్తాడు. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియదు కానీ ఇక్కడ జరుగుతున్న శుభకార్యాన్ని ఆపడం బావ్యం కాదు అంటూ శరత్‌ చంద్ర చెబితే.. నేను ఇక్కడ జరుగుతున్న పెళ్లి ఆపడానికి రాలేదు మిస్టర్‌ శరత్‌ చంద్ర మిమ్మల్ని అరెస్ట్‌ చేయడానికి వచ్చాను అంటూ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. సూర్య పీటల మీద నుంచి లేచి దగ్గరకు వెళ్తాడు. నన్ను అరెస్ట్‌ చేయడం ఏంటి..? అని శరత్‌ చంద్ర అడిగితే.. అబ్బబ్బా మీసాల రాజు చూశావా..? ఏమి యాక్టింగ్‌.. సారు యాక్టింగ్‌తో అదరగొడుతున్నాడు చేసిందంతా చేసి ఇలా పెద్ద మనిషిలా బలే యాక్టింగ్‌ చేస్తున్నావు అంటూ ఆకాష్ చెబితే.. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు మా బావ ఏం తప్పు చేశాడని అరెస్ట్‌ చేస్తారు అంటూ అరుస్తుంటే..

<a title="ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

మీరు ఆగండి అపూర్వ గారు అసలు మీరు ఏ స్టేషన్‌ నుంచి వచ్చారు అరెస్ట్‌ వారెంట్‌ తెచ్చారా..? అని అడిగితే.. ఆకాష్‌ మీసాల రాజు గివ్ మీ ద అరెస్ట్‌ వారెంట్‌ అంటే చెర్రి వారెంట్‌ తీసి ఆకాస్‌కు ఇస్తాడు. ఆకాష్‌ తీసుకుని సూర్యకు ఇస్తాడు. అసలు నేను చేసిన తప్పేంటో చెప్పకుండా ఈ అరెస్టులు వారెంట్లు ఏంటి సార్‌ ముందు నేను చేసిన తప్పేంటో చెప్పండి అని శరత్ అడగ్గానే.. మీ అల్లుడు గగన్‌ను షూట్‌ చేసి చంపేశారు మీరు అంటూ ఆకాష్‌ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు.. మీ కూతురు గగన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అందుకే సమయం చూసి గగన్‌ను షూట్‌ చేసి లోయలో పడేశారు అంటూ ఆకాష్‌ చెప్పగానే.. నేను చంపలేదు మీరు చెప్పిందంతా అబద్దం నన్ను అరెస్ట్‌ చేయడానికి ఏ ఆధారంతో వచ్చారు అని శరత్‌ చంద్ర అడిగితే.. ఆకాష్‌ మీసాల రాజు అంటే చెర్రి ఫోన్‌ తీసి అందులో శరత్‌ చంద్ర గగన్‌ను షూట్‌ చేసిన వీడియో ప్లే చేసి చూపిస్తాడు. అది చూసిన శరత్‌ చంద్ర షాకింగ్‌గా ఉండిపోతాడు. ఏంటి శరత్‌ చంద్ర ఈ ఆధారం సరిపోతుంది ఇంకా ఏమైనా కావాలా..? అని అడిగితే.. శరత్‌ చంద్ర మౌనంగా చూస్తుంటాడు.

కట్‌ చేస్తే కేపీ, శారదను తీసుకుని శరత్‌ చంద్ర ఇంటికి వెళ్తాడు. బెడ్‌ రూంలో మీరా తమ పెళ్లి ఫోటో చూస్తూ అలాగే నిల్చుని ఉంటుంది. కేపీ, శారద ఇంట్లో వెతుకుతుంటారు. ఎవ్వరూ కనిపించరు..? దీంతో అందరూ పెళ్లి మండపానికి వెళ్లి ఉంటారు. మనం వెళ్లి పెళ్లి ఆపేద్దాం అని శారద అంటే మనం వెళ్లినా పెళ్లి ఆపలేమని అక్కడికి వెళ్లినా అపూర్వ, శరత్‌ చంద్ర మన మాట వినరు కదా మనం ఇంటికి వెళ్లిపోదాం పద అంటూ బయటి నుంచి లాక్‌ చేసిన తమ బెడ్‌ రూం శారద ఒక్క నిమిషం ఆగు అంతా చూశాను కానీ మా రూం చూడలేదు అంటూ వెళ్లి రూం ఓపెన్‌ చేస్తాడు. మీరా రూంలో ఫోటో చూస్తూ ఉంటుంది. శారద, మీరా ఇక్కడే ఉంది అంటూ దగ్గరకు వెళ్లి మీరాను పిలుస్తాడు కేపీ భూమిని తీసుకొస్తానని చెప్పి నువ్వు ఇక్కడే ఉండిపోయావేంటి..? అని కేపీ అడిగితే మీరా కోపంగా తిరిగి శారదను చూస్తూ.. ఎందుకు ఇలా చేశావు అసలు ఎవరు నువ్వు అని అడుగుతుంది. అదేంటి మీరా నేను మీ అక్క శారదను కదా నేనేం చేశాను. అంటూ శారద చెబితే.. మా అక్కవు అయితే నా మొగుడుతో నీకేంటి పని..? నా మొగుడిని పట్టుకుని నీ మొగుడని ఎందుకు చెప్పావు అంటూ కోప్పడుతుంది మీరా.. ఆ దెబ్బకు శారద, కేపీ జడుసుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?