Meghasandesam Serial Today Episode: శరత్‌ చంద్ర ఇంట్లో సూర్య కొడితే దెబ్బలతో ఆకాష్‌ గుడి దగ్గరకు వెళ్లి కూర్చుని ఏడుస్తుంటాడు. అప్పుడే భూమి వచ్చి పిలుస్తుంది. భూమిని చూసిన ఆకాష్‌ వెళ్లి హగ్‌ చేసుకుని మిమ్మల్ని చూడలేమోనని భయపడ్డాను అంటూ ఏడుస్తుంటే.. మీరు ఇక నన్ను ఎప్పటికీ కలవొద్దు అలాగైతేనే మీరు ప్రాణాలతో ఉంటారు. అది చెప్పడానికే వచ్చాను. ఇప్పటి వరకు మీరు నాకు చేసిన సాయానికి నేను మీకు థాంక్స్‌ చెప్తున్నాను. ఈ పెళ్లిని ఆపే ప్రయత్నం చేయకండి నా రాత ఎలా రాసి ఉంటే ఆలాగే బతుకుతాను అంటుంది.

భూమితోనే తన జీవితం అన్న ఆకాష్‌

<a title="ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

అందుకు ఆకాష్‌ ఏడుస్తూ మీరు అలా మాట్లాడకండి భూమి గారు ఇంతకాలం నేను చేసిన సాయం నా బాధ్యత అనుకున్నాను. మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలన్న ప్రేమతో మాత్రమే ఇదంతా చేశాను. నా రాత ఎవరూ రాయరు భూమి గారు. మనమే రాసుకోవాలి. నా రాతను మాత్రం నేన మీతోనే రాసుకున్నాను. ఎమైనా ఎప్పుడైనా ఈ పెళ్లి ఆపుతాను. మీ నాన్న అంగీకారంతోనే మనం ఈ పెళ్లి చేసుకుందాం అంటాడు. అందుకు భూమి వద్దు ఆకాష్‌ గారు ఇవన్నీ జరిగే పనులు కాదు. నేను దురదృష్టవంతురాలిని నేను కోరుకున్నవేవీ నాతో ఉండవు.. అదే విధంగా నా బావ నాకు దూరమై పోయాడు. ఇప్పుడు మీరు నాకోసం ఇన్ని అవమానాలు పడ్డారు. దెబ్బలు తిన్నారు మళ్లీ ఇప్పుడు పెళ్లి ఆపాలని చూస్తే మా వాల్లు మిమ్మల్ని చంపినా చంపేస్తారు. మీరు దూరంగా వెళ్లిపోండి అంటూ భూమి చెప్తుంది.

గగన్‌ తన ప్లేస్‌లో ఉంటే ఏం చేస్తాడన్న ఆకాష్‌

<a title="ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

అయితే నా ప్లేస్‌ లో గగన్‌ ఉండి ఉంటే ఏం చేసేవాడో చెప్పండి అని ఆకాష్‌ అడిగితే.. నన్ను వదిలిపెట్టి వెళ్లే వాడు కాదు.. ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నించేవాడు. అంటూ చెప్పగానే.. నేను అదే చేస్తున్నాను కదా భూమి గారు అంటూ ఆకాస్‌ చెప్తాడు. ఎలాగైనా ఈ పెళ్లి ఆపేస్తాను.. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనివ్వను.. అంతే కాదు నేను నిన్ను పెళ్లి చేసుకోకుండా చావను.. ఒకవేళ చస్తే నీ భర్తగా చస్తాను అంటూ చెప్తాడు ఆకాష్‌.

ఆకాష్‌ కోసం టెన్షన్‌ పడ్డ శారద

ఇంట్లో ఉన్న శారద టెన్షన్‌ పడుతుంటే.. పూరి, ఇందు వస్తారు. ఏంటి పెద్దమ్మ భోజనం చేయకుండా అన్నయ్య కోసం ఎదురుచూస్తున్నావు అని ఇందు అడిగితే.. ఏం లేదు ఇందు ఎందుకో నా మనసు కీడు శంకిస్తుంది అనగానే.. నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు అమ్మా అన్నయ్యకు ఏం కాదు అంటుంది పూరి. ఏమో పూరి ఈరోజు సంగీత్‌ను ఎలాగైనా ఆపుతానని చెప్పి వెళ్లాడు. ఇంత టైం అవుతున్నా..? ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్‌ చేస్తుంటే తీసయడం లేదు. చెర్రికి ఫోన్‌ చేస్తే కలవడం లేదు. భూమికి చేస్తే కూడా తీయడం లేదు. అక్కడ ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది. అసలే మనం అంటే వాళ్లకు అసలు పడదు. అందుకే భూమి పెళ్లి చెడగొట్టడానికి వెళ్లిన వాడిని వాళ్లు చూస్తే ఏమవుతుందోనని భయంగా ఉందని శారద చెప్తుంది. అప్పుడే ఆకాష్‌ దెబ్బలతో తూలుతూ ఇంట్లోకి వస్తాడు. ఆకాష్‌ను చూసి అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?