Meghasandesam Serial Today Episode: తనను అందరూ తిట్టి వెళ్లిపోయాక బాధపడుతుంటాడు. ఇంతలో భూమి వచ్చి సారీ చెప్తుంది. మిమ్మల్ని కాపాడుకోవడానికి అలా చేశానని అంటుంది. నన్ను క్షమించండి అని అడుగుతుంది. దీంతో ఆ శరత్ చంద్ర నా శత్రువే అయినా భూమి కారణం లేకుండా ఏమీ చేయదని చెప్పాడన్న కారణం దగ్గరే ఆగిపోయాను చెప్పు అసలు ఏం జరిగింది అని గగన్‌ అడగ్గానే.. అపూర్వ ఆడిన నాటకం చెప్తుంది భూమి.

గగన్‌: ప్రతిసారి నువ్వు నన్ను సేవ్‌ చేస్తూనే ఉన్నావు భూమి. నువ్వు భూమివి కాదు నా ఆత్మాభిమానం చుట్టు అల్లుకున్న కంచెవి. థాంక్యూ భూమి థాంక్యూ సో మచ్‌.

అంటూ గగన్, భూమిని హగ్‌ చేసుకుంటాడు. భూమి హగ్‌ చేసుకోబోయి ఆగిపోతుంది. వెంటనే గగన్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. లోపల ఎవరి ఫోన్లు వాళ్లకు ఇస్తారు.

మంత్రి: ఎవరి ఫోన్లలోనూ ఆ ఫోటోలు దొరకలేదు అంటే ఆ ఫోటోలు తీసిన వాడు వెళ్లిపోయి ఉంటాడు శరత్‌ చంద్ర గారు. ఒక మినిస్టర్‌ గా సైబర్‌ టీంను అలర్ట్‌ చేస్తాను. వస్తాను.

అంటూ మినిస్టర్‌ వెళ్లిపోతాడు. ఇంటికి వచ్చిన గెస్టులు వెళ్లిపోతారు. మరోవైపు బ్యాగులు తీసుకుని ఇంటికి వెళ్లిన రమేష్‌, సౌందర్య ఇంత డబ్బును లెక్క పెట్టడానికి మన చేతులు నొప్పి పుడతాయోమో అనుకుంటారు. ఇంతలో ఇందు, వంశీ రాగానే.. ఇందుకు సపర్యలు చేస్తూ.. ఓవరాక్షన్‌ చేస్తుంటారు. బాగ్స్‌ ఓపెన్‌ చేయగానే అందులో స్వీట్స్‌ ప్రూట్స్‌ ఉంటాయి.

సౌందర్య: ఏంటి ఇది ఇందు ఈ స్వీట్స్‌ ఫ్రూట్స్‌ మేము కొనుక్కోలేమా..? మీ ఇంటి పనోళ్లలా అక్కడి నుంచి ఇక్కడికి మోసకొచ్చుకోవాలా..?

ఇందు: అది నాకేం అర్థం కాలేదు అత్తయ్యా..

రమేష్‌: నాకు అర్థం అయింది. గొప్పింటోళ్లు అంతా మాటలు చెప్తారు. పెట్టడానికి మాత్రం చేతులు రావు. అయినా మేము ఏమైనా అడుక్కున్నామా..? కట్నం అడిగాము.

ఇందు: ఒక్కసారి నేను అడుగుతాను మామయ్యగారు.

రమేష్: ఏయ్‌ ఒక్కసారి నువ్వు అడిగితేనే ఇంత మోసం జరిగింది. మళ్లీ అడిగితే ఇంకెంత మోసం జరుగుతుందో.. ఇక అడగొద్దు.

సౌందర్య: ఈరోజు నుంచి నరకం ఎలా ఉంటుందో నీకు కనిపిస్తుంది.

రమేష్: ఆచారం అని మీ ఇద్దరిని దూరం ఉంచాము. కానీ ఆచారం కాదు.. కట్నం కోసం. అది వచ్చేదాకా మీ ఇద్దరికీ ఈ దూరం తప్పదు. ఏరా వంశీ ఏం మాట్లాడవేంటి..?

వంశీ: అవును దగ్గరకు కూడా రానివ్వను..

రమేష్: నిన్ను నమ్మడానికి లేదురా..? నువ్వు వెళ్లి నీ రూంలో పడుకో.. ఇందు నువ్వు ఇక్కడే నేల మీద పడుకో..

వంశీ: నాన్నా పాపం నాన్నా..

రమేష్‌: అప్పుడే పాపం దగ్గరకు వచ్చేశావా..? మధ్యాహ్నమే కదరా లక్ష్మీదేవి కలలోకి వచ్చింది మనకు కలిసి వస్తుందన్నావు.

అంటూ ఇందును తిడుతూ.. వంశీని లోపలికి వెళు అంటూ పంపిచేస్తారు. వీడి వాలకం చూస్తుంటే మనుక మొదటికే మోసం వచ్చేలా ఉందని జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. మరోవైపు నవ్వుతూ ఇంటికి వచ్చిన గగన్‌ను నక్షత్ర ఫంక్షన్‌కు ఎందుకు వెళ్లావు అని అడుగుతుంది శారద. మినిస్టర్‌ గారు తీసుకెళితే వెళ్లానని గగన్‌ చెప్తాడు. ఆ మనుషులన్నా పడని నువ్వు మినిస్టర్‌ తీసుకెళితే ఎలా వెళ్లావు అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో మినిస్టర్‌ తో మనకు ఏదైనా పని పడొచ్చని వెళ్లాను అంటాడు. దీంతో పూరి గగన్‌ను ఆట పటిస్తుంది. నువ్వు అబద్దం చెప్తున్నావు.. ఇదంతా చూస్తుంటే మాకు అర్థం కావడం లేదనుకున్నావా…? నువ్వు భూమితో ప్రేమలో కూరుకుపోయావు అన్నయ్య అంటుంది. గగన్‌ సిగ్గుతో పైకి వెళ్లిపోతాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!