Meghasandesam Serial Today Episode: భూమి, ప్రసాద్‌తో మాట్లాడిన వీడియో చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంద అపూర్వ. వంట చేసిన తర్వాత అందరినీ గౌరవంగా పిలవమని చెప్తుంది. అలాగేనని చెప్పి వెళ్లి చెర్రిని పిలవగానే చెర్రి సంతోషంతో కింద పడి పొర్లుతుంటాడు. ఇంతలో బిందు వచ్చి ఎందుకు అంతలా ఎగురుతున్నావు అని అడుగుతుంది. భూమి వచ్చిందని.. తనను భోజనానికి పిలిచిందని చెప్తాడు. దీంతో బిందు నవ్వుతూ.. నువ్వు ఎక్స్‌ట్రాలు ఆపితే మనం వెళ్లి భోజనం చేయోచ్చు అంటుంది. భూమి భోజనానికి అంతా రెడీ చేస్తుంది. ఇంతలో మీరా, ప్రసాద్‌ వస్తారు.

ప్రసాద్‌: భూమి అందరినీ భోజనానికి పిలిచావు. ఈరోజు ఏమైనా విశేషమా..?

భూమి: అలాంటిదేం అంకుల్‌ ఖాళీగా కూర్చుంటే బోర్‌ కొడుతుందని నేనే వంట చేశాను. అందుకే వంట అందరినీ పిలిచాను. నా వంట ఎలా ఉందో చెప్తారని..

శరత్‌: నువ్వు వంట చేశావా..? నీతో ఇవన్నీ వండించింది ఎవరు..? వంట మనిషికి హెల్త్‌ బాగాలేదు. సరే ఇంట్లో ఇంత మంది ఉండగా తను ఇంకా సెట్‌ కాలేదు. మీరందరూ హెల్ప్ చేయోచ్చు కదా..? ఏం అపూర్వ నువ్వు తనను మన నక్షత్రతో సమానంగా చూసుకో అంటే ఏం చేస్తున్నావు.

భూమి: అంకుల్‌ దయచేసి ఆవేశపడకండి.. ఇంట్లో ఎవ్వరినీ ఏమీ అనకండి. నాకు వంట చేయాలనిపించి చేశాను. మీరు ఇలా కోప్పడతారని తెలిసి ఉంటే అసలు వంట గదిలోకి వెళ్లే దాన్నే కాదు.

అపూర్వ: అయినా బావ కూతురు లాంటి మన భూమి ఆనందతో వంట చేస్తే తిరిగి తనను ఆనందం పెట్టకుండా తిడతావేంటి..?

శరత్‌: నీ ఆనందం కోసం నువ్వేమీ చేసినా నాకు ఓకే భూమి. కానీ నీ హెల్త్‌ను కూడా దృష్టిలో పెట్టుకో.. సరే కూర్చో.. నువ్వు తిను..

భూమి: నేను వడ్డిస్తాను అంకుల్‌.. తర్వాత నేను భోజనం చేస్తాను.

చెర్రి: ఒక్కదానివే ఎందుకు కష్టపడతావు. నేను హెల్ప్‌ చేస్తాను.

అపూర్వ: మేము వడ్డించడం చేతకాక కూర్చున్నామా..? తను వడ్డిస్తాను అంది కదా నువ్వు కూర్చోని తిని

చెర్రి: నా లవ్‌ స్టోరీకి మొదటి విలన్‌ మా నాన్న అయితే.. రెండో విలన్‌ బిందు. ఇప్పుడు అత్తయ్య కూడా విలన్‌ అయింది. ( అని మనసులో అనకుంటాడు)

భూమి అందరికీ వడ్డిస్తుంటే అందరూ తింటుంటారు. ప్రసాద్‌ వంటలు చాలా బాగున్నాయి అని మెచ్చుకుంటాడు. ఎవరేం అడిగినా భూమి అందరికీ అన్ని వడ్డిస్తుంది. మరోవైపు గగన్‌ ఇంట్లో శారద, పూరి, గగన్‌ భోజనం చేస్తుంటారు. గగన్‌ మాత్రం ఏమీ తినకుండా ఆలోచిస్తూ ఉంటాడు. భోజనం చేసిన తర్వాత శరత్‌ చంద్ర వంటలను మెచ్చుకుంటాడు.

శరత్‌: అమ్మా భూమి వంటలన్నీ అదిరిపోయాయి.

భూమి: థాంక్యూ అంకుల్‌..

శరత్‌: వంట చేసినందుకు కోపం వచ్చినా.. తిన్న తర్వాత చాలా సంతృప్తిగా అనిపించింది. నువ్వు కూడా కూర్చోమ్మా..

అపూర్వ: మీరు వెళ్లండి బావ.. మరీ భూమి ఇంతలా వడ్డిచాక నేను కూడా తనకు వడ్డించాలి కదా..?

శరత్‌: కరెక్టే.. అమ్మలా వడ్డించిరా..

అపూర్వ: అలాగే.. ఏంటి వంట చేసి అందరికి వడ్డించి అలసిపోయావా..? మేము అందరం తింటుంటే నీకు ఎలా ఉంటుందో అర్థం అయింది. ఆకలేస్తుందా..? తింటావా..? సరే తిను..

అంటూ కూరల్లో ఉప్పు కలిపుతుంది అపూర్వ. ఇప్పుడు తిను నీకు పట్టిన తుప్పు వదలాలంటే నేను చేస్తున్న ఉప్పు ట్రీట్‌మెంట్‌. ఆకలితో నువ్వు నకనకలాడాలి. ఇవన్నీ క్లీన్‌ చేసి తర్వాత నా రూంకి వచ్చేయ్‌ అని చెప్పి వెళ్లిపోతుంది అపూర్వ. భూమి ఏడుస్తుంది. తర్వాత తన రూంకి వచ్చిన భూమి చేత తన కాళ్లు పట్టించుకుంటుంది అపూర్వ. ఏడుస్తూ అపూర్వ కాళ్లు పడుతుంది భూమి. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!" href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_blank" rel="noopener">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!