MBU యూనివర్సిటీ పంచాయితీ CM వద్దకు

10 months ago 8
ARTICLE AD

మోహన్ బాబు యూనివర్సిటీలో అరాచకాలు అంటూ మంచు మనోజ్ గత కొద్దిరోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీపై ఆరోపణలు చేస్తున్నాడు. యూనివర్సిటీలో అవినీతి, విద్యార్థుల జీవితాలతో మంచు విష్ణు ఆటలాడుతున్నాడు, తండ్రి మోహన్ బాబు ని అడ్డు పెట్టుకుని విష్ణు కోట్లు దోచేస్తున్నాడు అంటూ మంచు మనోజ్ ఓపెన్ గానే మాట్లాడుతున్నాడు. 

తాజాగా మోహబ్‌బాబు యూనివర్సిటీలో అరాచకాలు, మోహన్ బాబు యువనిర్సిటీ అవినీతి భాగోతం అంటూ మంచు పంచాయితీ ఇప్పుడు సీఎం చంద్రబాబు దగ్గరికి చేసింది. మోహన్‌బాబు యూనివర్సిటీ సిబ్బంది వేధింపులకు పాల్పడుతుంది అంటూ ప్రవేట్ హాస్టల్స్ యజమానులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు లేఖ రాయడం హాట్ టాపిక్ అయ్యింది. 

ప్రవేట్ హాటల్స్ లో ఉంటూ యూనివర్సిటీకి వెళుతున్న విద్యార్థులను ప్రవేట్ హాస్టల్స్ ఖాళి చెయ్యాలని, లేదంటే యూనివర్సిటీ హాస్టల్స్ కి ఫీజు చెల్లించాలని, లేకపోతె హాల్ టికెట్స్ ఇవ్వమంటూ MBU యూనివర్సిటీ సిబ్బంది ప్రవేట్ హాస్టల్స్ యజమానులు బెదిరిస్తున్నారు,  మధ్యాన్నం భోజనం తినకపోయినా 20 వేలు కట్టాలంటూ దౌర్జన్యం చేస్తున్నారు అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కి లేఖ రాసారు. 

మరి ఈ విషయంలో చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. కారణం చంద్రబాబు-మోహన్ బాబు సన్నిహితులు కాబట్టి. 

Read Entire Article