Mass Jathara Movie Review: మాస్ మహారాజా రవితేజ 75వ సినిమా 'మాస్ జాతర'. భాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తూ... నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్. భీమ్స్ పాటలు మాస్ జనాల్లోకి వెళ్లాయి. ట్రైలర్ అయితే పక్కా మాస్ సినిమా అన్నట్టు ఉంది. మరి సినిమా ఎలా ఉంది?

'మాస్ జాతర' కథ ఏమిటి?
Mass Jathara Movie Story: లక్ష్మణ్ భేరి (రవితేజ) రైల్వే పోలీస్. శ్రీకాకుళం జిల్లా ప్రాంతంలో ఆయన పోస్టింగ్. అతను ఇంఛార్జ్‌గా ఉన్న రైల్వే స్టేషన్‌లో ఒక్కటంటే ఒక్క క్రైమ్ కూడా జరగకూడదని కంకణం కట్టుకుంటాడు. ఆ ఏరియాలో కేజీ రెడ్డి (నవీన్ చంద్ర) గంజాయి మాఫియా లీడర్. లక్ష్మణ్ భేరితో ఢీ అంటే ఢీ కొడతాడు. కేజీ రెడ్డిని లక్ష్మణ్ భేరి ఎలా అడ్డుకున్నాడు? మధ్యలో (శ్రీ లీలతో) హీరో ప్రేమకథ ఏమిటి? లక్ష్మణ్ భేరి తండ్రి (రాజేంద్రప్రసాద్) వల్ల కథ ఎటువంటి మలుపు తిరిగింది? అనేది సినిమా.

మరి మూవీ ఎలా ఉందేంటి?
Mass Jathara Review Telugu: అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మీటర్ సినిమా 'మాస్ జాతర'. రవితేజ హీరోయిజాన్ని ప్రేక్షకులు ఫీలయ్యేలా చేయడం, ఆయన కామెడీ టైమింగ్ ఎంజాయ్ చేసేలా సీన్లు తీయడం మీద దర్శకుడు భాను భోగవరపు ఎక్కువ కాన్సంట్రేట్ చేశారని తెలిసింది.

'మాస్ జాతర'లో కథ తక్కువ, ఫైట్స్ ఎక్కువ. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో మన ప్రేక్షకులు ఎటువంటి కథ అయితే చూశారో, ఈ 'మాస్ జాతర'లో ఇంచు మించు అటువంటి కథ ఉంటుంది తప్ప కొత్తగా ఏమీ లేదని తెలిసింది. యూనిట్ అంతా గొప్పగా చెబుతున్న క్లైమాక్స్ రాజేంద్ర ప్రసాద్ ట్విస్ట్ ఊహించడం పెద్ద కష్టం ఏమీ కాదు. అయితే... రెగ్యులర్ సినిమాల్లో హీరోయిన్ పాత్రకు కాస్త భిన్నంగా శ్రీ లీల క్యారెక్టర్ రాశారట. అందులో ఆవిడ నటన, క్యారెక్టర్ ట్విస్ట్ ఆడియన్స్ కాస్త కొత్తగా ఫీలయ్యే అవకాశం ఉంది.

Also Read: 'డీయస్ ఈరే' రివ్యూ: ప్రణవ్ మోహన్ లాల్ మిస్టరీ హారర్ థ్రిల్లర్... భూతకాలం, భ్రమయుగం దర్శకుడి సినిమా... ఎలా ఉందంటే?

'మాస్ జాతర'కు మెయిన్ అసెట్ రవితేజ - నవీన్ చంద్ర మధ్య యాక్షన్ అని ఫిల్మ్ నగర్ యూనిట్ సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. నవీన్ చంద్రది గంజాయి మాఫియా లీడర్ రోల్ అయినప్పటికీ అతని గెటప్, నటన బావున్నాయట. రవితేజతో ఢీ అంటే ఢీ అంటూ చేసిన ఫైట్స్ బాగా వచ్చాయట. ఆ యాక్షన్ సీక్వెన్సులకు భీమ్స్ ఇచ్చిన బీజీఎమ్ సైతం అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉందట. రవితేజ ఎప్పటిలా హుషారుగా తన పాత్రకు న్యాయం చేశారని టాక్. వింటేజ్ రవితేజ సీన్స్ ఆయన అభిమానులకు అమితంగా నచ్చుతాయట.

'మాస్ జాతర'లో ఆల్మోస్ట్ ఏడు ఫైట్స్ ఉన్నాయని తెలిసింది. ఆల్రెడీ విడుదలైన పాటలు హిట్ అయ్యాయి. ఫైట్స్, సాంగ్స్ మధ్యలో కథ తక్కువగా ఉన్నప్పటికీ... రొటీన్ రెగ్యులర్ కథలో ఎమోషన్ ప్రేక్షకులకు నచ్చితే సినిమా హిట్టే. లేదంటే మరొక రెగ్యులర్ అటెంప్ట్ అవుతుంది. రవితేజ రీసెంట్ ట్రాక్ రికార్డ్, ఆయా కథలతో పాటు వచ్చిన రిజల్ట్స్ చూస్తే సినిమా భారీ విజయం సాధించడం కష్టమే. ఫ్యాన్స్ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లడం మంచిదని ప్రీమియర్స్ కంటే ముందు వచ్చిన రిపోర్ట్.

Also Read: 'బాహుబలి ది ఎపిక్' రివ్యూ: రెండు కాదు... ఒక్క సినిమాగా ఎటువంటి ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చిందంటే?