Smitha's Masaka Masaka OG Mix Song : తెలుగు ఓల్డ్ సాంగ్స్‌ను రీమిక్స్ చేసి తెలుగు పాప్ సింగర్‌గా ఫేమస్ అయ్యారు సింగర్ స్మిత. ఆమె పాడిన 'మసక మసక చీకటిలో' ఆమె కెరీర్‌లోనే ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఒకప్పటి మూవీ 'దేవుడు చేసిన మనుషులు' (1973) నుంచి ఈ పాటను రీమేక్ చేసి ట్రెండ్ క్రియేట్ చేశారు. 2000 సంవత్సరంలో ఈ పాట రీమేక్‌తో అదుర్స్ అనిపించారు.

ఇప్పుడు మరోసారి అదే పాటపై సరికొత్త ప్రయోగం చేశారు. పాత పాటకు సరికొత్త రీమిక్స్ రూపం ఇచ్చి ర్యాప్ జోడించి న్యూ వీడియో రిలీజ్ చేశారు. నటుడు, ఫ్రెండ్ ర్యాపర్ నోయల్‌తో కలిసి ఆమె స్టెప్పులేశారు. ఇప్పటికే స్మిత కెరీర్‌లో సిగ్నేచర్ హిట్‌గా పేరొందిన ఈ పాట... సరికొత్త వెర్షన్ మరో ట్రెండ్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. నోయల్, స్మిత కలిసి ఎన్నెన్నో ఆల్బమ్స్ చేయగా అవి ఫేమస్ అయ్యాయి. 'బాహుబలి' రిలీజ్ టైంలో పాపులర్ అయిన 'కిలికి' భాష నుంచి 'వహా కిలికి' అంటూ సాంగ్ తీసి సూపర్ అనిపించారు.

Also Read : ఎయిర్ పోర్టులో సమంత, రాజ్ నిడిమోరు - పెళ్లి తర్వాత ఫస్ట్ టైం కనిపించిన న్యూ కపుల్