Mancherial Latest News: మందమర్రి ప్రజలకు గుడ్ న్యూస్‌- మంచినీటి సమస్యపై కీలక ప్రకటన చేసిన మంత్రి వివేక్‌

2 months ago 3
ARTICLE AD

Mancherial Latest News: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలో కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. అర్హత గల ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ ఫలాలను అందిస్తున్నాం. నిరుపేద ప్రజలకు గూడు కల్పించే ఉద్దేశంతో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 ఇందిరమ్మ ఇండ్లు చొప్పున కేటాయించి అర్హత గల లబ్ధిదారులకు అందిస్తున్నాం. అర్హత కలిగి ఉండి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కానీ వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు" అని తెలిపారు.

గత 10 సంవత్సరాలలో అందని రేషన్ కార్డులను అర్హత గల ప్రతి ఒక్కరికి అందించి చౌక ధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి వివరించారు. సన్న బియ్యం పంపిణీ కోసం 9 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. నూతన గనుల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. మందమర్రి ప్రాంతంలో రహదారులు, మురుగు కాలువల వ్యవస్థను అభివృద్ధి చేసి ప్రజల ఇబ్బందులు తొలగించడం జరిగిందని, 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.

మందమర్రి ప్రజలను ఎప్పటి నుంచే పట్టి పీడిస్తున్న నీటి సమస్యు మంత్రి పరిష్కారాన్ని చూపారు. అమృత్ పథకం ద్వారా శాశ్వత మంచినీటి సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. విద్యావ్యవస్థను పటిష్టపరిచే చర్యలలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించి, దాదాపు 10 వేల మంది నిష్ణాతులైన ఉపాధ్యాయులను భర్తీ చేసినట్టు వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విద్య సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు.

ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం 500 రూపాయలకే రాయితీ గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 10 లక్షల రూపాయల పరిమితితో రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. అర్హత గల ప్రతి లబ్ధిదారుడికి అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం మండలంలోని 82 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

తర్వాత క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో 6 లక్షల రూపాయల మున్సిపల్ నిధులతో నూతనంగా పునరుద్ధరించిన మెప్మా కార్యాలయాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజు, మందమర్రి మండల తహసిల్దార్ సతీష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ఈ కార్యాలయం 567 స్వయం సహాయక సంఘాలలోని 5 వేల 948 మంది మహిళా సభ్యులు సమావేశాలు, బ్యాంకు సంబంధిత కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రుణ సదుపాయం కల్పించి ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని వినియోగించుకుని ఆర్థిక స్వావలంబన పొందాలని సూచించారు. తమ కుటుంబ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు.

మహిళ సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే రాయితీ గ్యాస్ సిలిండర్ అందించడంతో పాటు బ్యాంకు లింకేజీ ద్వారా రుణ సదుపాయం కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం క్యాతనపల్లి పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు 2 కోట్ల రూపాయల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read Entire Article