Manali Hot Snow: మనాలీ మంచులో స్విమ్ సూట్‌లో రీల్స్ - నెటిజన్ల ఆగ్రహం - కరెక్టేనా ?
2 months ago 7
ARTICLE AD
మనాలీ వంటి పవిత్రమైన, కుటుంబ సమేతంగా వచ్చే పర్యాటక ప్రాంతాల్లో ఇటువంటి కంటెంట్ సృష్టించడం స్థానికులను, ఇతర పర్యాటకులను అవమానించడమేనని  విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి పనులు పర్యాటక ప్రాంతాల గౌరవాన్ని దెబ్బతీస్తాయని, వీటిని అడ్డుకోవాలంటూ హిమాచల్ ప్రదేశ్ పోలీసులను  కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియా పాపులారిటీ కోసం ఎంతకైనా తెగించడం సరైన పద్ధతి కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
When we thought nothing worse was left to see, social media proves us wrong again. No respect for the place, no respect for locals. These are family spots and tourist destinations, not cheap content zones. Because of such people, these places are slowly getting ruined. pic.twitter.com/miGFHponVY
— Nikhil saini (@iNikhilsaini) January 22, 2026
ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను సమర్థిస్తుండగా, మెజారిటీ ప్రజలు మాత్రం బహిరంగ ప్రదేశాల్లో మర్యాదపూర్వకమైన ప్రవర్తన అవసరమని వాదిస్తున్నారు. హిమాచల్ పర్యాటక మార్గదర్శకాల ప్రకారం.. పర్యాటకులు బహిరంగ ప్రదేశాల్లో హుందాగా ఉండే దుస్తులను ధరించాలని స్పష్టమైన సూచనలు ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావాలనే తపనతో పర్యాటక ప్రాంతాల మర్యాదలను, స్థానిక సంప్రదాయాలను విస్మరించడం చర్చనీయాంశమైంది.
Why are people so offended?
Just because he called out a specific gender for not respecting the culture and decorum of a place?
He called out men too in other tweets. No one had a problem then.
Apna gender agenda kahin aur dikhao. Pehle achhe insaan bano.
Maggie tourist nahi https://t.co/mDW9mqNrLT
— BHAKTI (@bhakti_iii) January 23, 2026
ప్రస్తుతానికి ఈ వివాదాస్పద వీడియోపై హిమాచల్ ప్రదేశ్ పోలీసులు లేదా పర్యాటక శాఖ నుంచి ఎటువంటి అధికారిక ప్రతిస్పందన రాలేదు. అయితే, పర్యాటక కేంద్రాల్లో రీల్స్ పిచ్చి ముదురుతోందని, దీనివల్ల సాధారణ పర్యాటకులకు ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Read Entire Article