Chiranjeevi's MSVPG OTT Release Date Locked : మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ బ్లాక్ బస్టర్ 'మన శంకవరప్రసాద్ గారు' ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.350 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో చిరు కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని మెగా ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఓటీటీలోకి ఎప్పుడంటే?

'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'ZEE5' సొంతం చేసుకోగా... థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రెస్పాన్స్‌ను మించి ఓటీటీ రెస్పాన్స్ వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే, ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇక శాటిలైట్ రైట్స్ కూడా 'జీ తెలుగు' సొంతం చేసుకుంది. మూవీ ఓటీటీలోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత వీకెండ్స్‌లో ఆ ఛానల్‌లో ప్రీమియర్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : ఓటీటీలోకి కన్నడ ఫాంటసీ థ్రిల్లర్ '45' - తెలుగులోనూ మల్టీ స్టారర్ మూవీ స్ట్రీమింగ్