Chiranjeevi's Mana Shankara Varaprasad Garu Premiere Shows Collections : ఈ సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్ గారు' హిట్టు కొట్టేశారు. మెగాస్టార్ చిరు, అనిల్ రావిపూడి కాంబో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. చాలా రోజుల తర్వాత వింటేజ్ చిరును చూశామంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ప్రీమియర్స్‌తోనే మూవీ టీం సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసింది.

ప్రీమియర్స్ కలెక్షన్స్ ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం రాత్రి ప్రీమియర్ షోస్ వేయగా కలెక్షన్స్ అదరగొట్టింది. ఇప్పటికే టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. ఈ క్రమంలో కేవలం ప్రీమియర్లతో రూ.25 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ పండుగకు మెగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి ఓపెనింగ్స్ సాధించిందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక సంక్రాంతి సీజన్ కావడంతో కలెక్షన్స్ భారీగా పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

అప్పుడే వన్ మిలియన్ క్లబ్‌లోకి...

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అటు ఓవర్సీస్‌లోనూ రికార్డులతో దూసుకెళ్తోంది. ప్రీమియర్స్‌లోనే వన్ మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన చిరు రెండో చిత్రంగా నిలిచింది. ఇక ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో 24 గంటల్లో 2 లక్షల 86 వేల టికెట్స్ సేల్ అయినట్లు తెలిపింది. ఈ జోష్ ఇంకా కొనసాగుతోంది.

సంబరాల్లో మూవీ టీం

'మన శంకరవరప్రసాద్ గారు' హిట్ టాక్ తెచ్చుకోవడంతో మూవీ టీం ఆనందం వ్యక్తం చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు డైరెక్టర్ అనిల్, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కేక్ కట్ చేసి స్వీట్స్ తినిపించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

A beautiful moment celebrating a MEGA BLOCKBUSTER RESPONSE 😀❤️‍🔥

Hit Machine, director @AnilRavipudi, producers @sahugarapati7 & @sushkonidela met Megastar @KChiruTweets to share the happiness after the blockbuster response from the premieres of #ManaShankaraVaraPrasadGaru 🔥… pic.twitter.com/ZL8Tsch547

— Gold Box Entertainments (@GoldBoxEnt) January 11, 2026

Also Read : సినిమాల సందడి... అదిరిపోద్ది సంక్రాంతి - ఈ వారం థియేటర్స్, ఓటీటీ మూవీస్ ఫుల్ లిస్ట్ ఇదే!