ప్రముఖ మలయాళ కథానాయకుడు, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన మమ్ముట్టి (Mammootty) ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) బుధవారం ఉదయం దాడులు నిర్వహించింది. అయితే ఈడీ రైడ్స్ కేరళలో జరగలేదు. చెన్నైలో జరిగాయి. అసలు వివరాల్లోకి వెళితే...

చెన్నైలోని మమ్ముట్టి ఇంటిపై ఈడీ రైడ్స్...
లగ్జరీ కార్ల వివాదమా? లోక సినిమా విజయమా?
చెన్నైలోని గ్రీన్ వేస్ ‌రోడ్డులో మమ్ముట్టి కుటుంబానికి ఓ ఇల్లు ఉంది. అక్కడ ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి.‌ మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ సైతం పాపులర్ హీరో.‌ ఆయన ఒక్క భాషకు పరిమితం కాలేదు.‌ తన మాతృ భాష మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీలో సినిమాలు చేస్తున్నారు మరొకవైపు నిర్మాతగా కూడా బిజీగా ఉన్నారు.

కోయంబత్తూరుకు చెందిన ఓ సంస్థ భూటాన్ నుంచి ఇండియాకు కార్లు తెప్పించి తప్పుడు డాక్యుమెంట్స్ ద్వారా హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించింది. తర్వాత వాటిని సెలబ్రిటీలకు అమ్మింది. ఆ లగ్జరీ కార్లు కొనుగోలు చేసిన సెలబ్రిటీలలో దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నారు. ఆ కార్లు కొనుగోలు - అమ్మకం విషయంలో పన్ను అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం ఈడీ కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఆ అంశంపై రైడ్స్ జరుగుతున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.

Also Read: పవన్ సినిమాలో విలన్ రోల్... రిజక్ట్ చేసిన పాపులర్ పొలిటీషియన్!

కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో దుల్కర్ సల్మాన్ నిర్మించిన 'కొత్త లోక' సినిమా ఘన విజయం సాధించింది. ఆ చిత్రాన్ని వే ఫేర్ ఫిలిమ్స్ పతాకం మీద ప్రొడ్యూస్ చేశారు. అది మమ్ముట్టి కుటుంబానికి చెందిన ప్రొడక్షన్ హౌస్ లగ్జరీ కార్లతో పాటు సినిమా భారీ విజయం సాధించడంతో ఆదాయం పన్ను విషయంలో లెక్కలు తీస్తున్నట్లు తెలిసింది. ఒక్క దుల్కర్ సల్మాన్ ఇంటి మీద మాత్రమే కాదు కేరళలోని, తమిళనాడులోని పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ షకలకళ్ ఇళ్లలో సైతం కొన్ని రోజుల క్రితం సోదాలు జరిగాయి. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ హౌస్ ఉన్న ఇంటిలో సోదాలు జరుగుతున్నాయి.

Also Read: ఫ్లాపుల్లో ఉన్నా పూజా హెగ్డే రెమ్యూనరేషన్ తగ్గలేదు... దుల్కర్ సల్మాన్ సినిమాకు ఎంత తీసుకుంటుందో తెలుసా?