<p>గడ్చిరోలి: మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి అలియాస్ సోను లొంగిపోయారు. దాదాపు 60 మంది తన మావోయిస్టు సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ ఎదుట బుధవారం ఉదయం లొంగిపోయారు. సీఎం ఫడ్నవీస్ చేతికి తన ఆయుధాన్ని సమర్పించారు. ఆయనతో పాటు లొంగిపోయిన మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు సమర్పించారు. మావోయిస్టు పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.</p>
<p>మహారాష్ట్రలో మావోయిస్టులకు మల్లోజుల వేణుగోపాల్ నాయకత్వం వహిస్తున్నారు. సాయుధ ఉద్యమం బలహీనపడుతున్న సమయంలో మల్లోజుల 60 మంది సహచర మావోయిస్టులతో కలిసి ఫడ్నవీడస్ సమక్షంలో లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిశారు. ఆయనపై రూ.10 కోట్ల రివార్డ్ సైతం ఉంది. అయితే ఫడ్నవీస్ సమక్షంలోనే లొంగిపోతానని గడ్చిరోలి పోలీసులనుకలిసిన సమయంలో మల్లోజుల కండీషన్ పెట్టారు. దాంతో మహారాష్ట్ర సీఎం ఫడ్నీవీస్ ఎదుట పటిష్ట భద్రత నడుమ మావోయిస్టులను పోలీసులు హాజరుపరిచారు. అనంతరం మల్లోజుల, 60 మంది మావోయిస్టులు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిశారని పోలీసులు ప్రకటించారు.</p>