Makar Sankranti 2025: పల్లెకు పండగ కళ వచ్చేసింది, ఎటు చూసినా సంక్రాంతి సందడి

10 months ago 8
ARTICLE AD

Srikakulam News | ఈ సారి భోగికి ముందు శని, ఆదివారాలు సెలవు కలిసి రావడంతో రెండు రోజులు ముందే సందడి  ఆరంభమైంది. ప్రజలు రాకపోకలు ప్రారంభం కావడంతో సంక్రాంతిపండగ ఓ కలల వేడుకగా పల్లెనిలుస్తోంది. అందులో ప్రధానంగా విద్యార్థులకు సంక్రాంతి పండగ సెలవులివ్వడం, ఉద్యోగులకు రెండు రోజులు ముందుసెలవులు కలిసి రావడంతో మరింత సందడిగా మారింది. పట్టణాల్లో వస్త్ర దుకాణాలు, మార్కెట్ కలకలలాడుతున్నాయి. ఆన్లైన్ వ్యాపారాలు జోరం దుకున్నా వస్త దుకాణాలు కొనుగోలుదారులతో కళకళ లాడుతున్నాయి. ఈ పండగ సీజన్లో కోట్లాది రూపాయలు వ్యాపారం సాగుతుంది. వేర్వేరు ప్రాంతాలనుంచి వలస వచ్చిన వారంతా పట్టణాల్లో ప్రధాన కూడళ్ల వద్ద ఆఫర్ లంటు బురిడి కొడుతున్నారు.

అన్ని ప్రాంతాలు జనసంద్రంగా..

సంక్రాంతి పండగకు తప్పని సరిగా కొత్త దుస్తులు ధరించడం అనవాయితీ. దీంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు దుస్తులు కొనుగోలు చేయడాని వ్యాపారులు ముమ్మరంగా సాగుతున్నాయి. అందులో ఈ ఏడాది రైతులు విక్రయించడంతో డబ్బులు సకాలంలో జమవ్వడంతో అన్నదాతలు కొనుగోలుకు మరింత ఉత్సహం చూపుతున్నారు. పెద్దలను స్మరించుకుంటు కొత్త దుస్తులు చూపించడం ఆనవాయితీ. మొత్తం పైన మార్కెట్ అంతా బిజీబిజీగా సాగుతుంది. ప్రజలు గ్రామాలకు వస్తుండడంతో బస్సులు, రైళ్లు ఇలా అన్ని ప్రాంతాలు జనసంద్రంగా సందడిగా కనిపిస్తుంది. వలస వెళ్లిన వారు తిరిగి సొంతూళ్లకు చేరుతున్నారు. బస్సులు, రైళ్లు అన్నీ రద్దీగా మారాయి. అందరూ ఒకేసారి చేరుతుండడంతో గ్రామాలు కళకళ లాడుతున్నాయి. ఎలాగైనా పల్లెకు పోవాల్సిందే.. పండగ చేయాల్సిందే అంటూ నగరానికి వెళ్లిన వారంత పల్లె బాట పడుతున్నారు. గమ్యానికి చేరుకోవడానికి ప్రైవేటు బస్సు ఛార్జీలు భారం మోస్తున్నారు.

ప్రయాణికులపై ఛార్జీల భారం

ఆర్టీసీ బస్సులు ప్రైవేటుబస్సు ఛార్జీలు భారం మోస్తున్నారు. ఆరీసీ బస్సులు రేట్లు పెంచనప్పటికి సరిపోయినంతా లేకపోవడంతో ప్రైవేటు బస్సులదే పెత్తనంగా మారింది. హైదరాబాదుతో పాటు సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండగను నిర్వహించుకునేందుకు సొంతూరుకు చేరుకుంటున్నారు. దీంతో బస్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రైవేటు బస్సులు దోపిడీకి పాల్పడుతున్నా తప్పని పరిస్థితిలలో ప్రయాణాలను కొనసాగిస్తున్నామంటున్నారు. సంక్రాంతి పండగకు చేరుకుని కుటుంబాలతో తోటి బంధువులతో కలిసి మెలిసి సందడి చేసుకుని తిరిగి బతుకు జీవుడా అంటు వలస వెళ్లిపోతున్న వారే జిల్లాలో అధిక సంఖ్యలోఆర్టీసీ బస్సులు ప్రైవేటుబస్సు ఛార్జీలు భారం మోస్తున్నారు. ఆరీసీ బస్సులు రేట్లు పెంచనప్పటికి సరిపోయినంతా లేకపోవడంతో ప్రైవేటు బస్సులదే పెత్తనంగా మారింది. ప్రైవేటు బస్సులు దోపిడీకి పాల్పడుతున్నా తప్పని పరిస్థితిలలో ప్రయాణాలను కొనసాగిస్తున్నామంటున్నారు. ఏడాది పాటు నగరాల్లో శ్రమించి అక్కడ మకాం వేసుకున్నవారంతా ఒకసారి రావడంతో అన్ని వాహనాలు రద్దీగా ఉంటున్నాయి.

ఎప్పుడు బయలు దేరుతామో.. కాంట్రాక్టర్లు ఎప్పుడు కూలీ చెల్లిస్తారో తెలియక ముందుగా రైళ్లలో రిజర్వేషన్ చేసుకోలేమని, అందుచేత ఏడాది పనులు చేసుకుని సంపాదించిన సొమ్ముతోనే అదనపు చార్జీలు భారమైనా తప్పదని వలస వెళ్లిన వారం టున్నారు. రైళ్లలో అయితే కిక్కిరిసి ప్రయాణం చేస్తు గమ్యానికి చేరుతున్నారు. దీంతో రైల్వేస్టేషన్లు కిక్కిరిసి పోతున్నాయి. పల్లెలు ఇప్పుడిపుడు కళకళలాడు తున్నాయి. మొత్తంగా సోమవారం భోగి పండగైన అప్పుడే పల్లెలు, పట్టణాలు పండుగ శోభను సంతరించుకుంటున్నాయి.

పండుగ హడావుడి షురూ..

స్కూళ్లు, కళాశాలలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు కావడంతో పండుగ హాడావడి అన్ని చోట్ల కనిపిస్తుంది. సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవడానికి ఎవరికి వారుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పిల్లలంతా ఆటలలో నిమగ్నంకాగా పెద్దలంతా పనుల చక్కబాట్లుతో బిజిబిజీగా మారిపోయారు. మార్కెట్లన్నీ కూడా కళకళలాడుతున్నాయి. పండుగ వేళ అన్ని రకాల షాపులలో కూడా వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. షాపింగ్ మాల్స్ తో పాటు వస్త్రదుకాణాలు, రెడీమేడ్ షాపులు, ఫ్యాషన్ వస్తువులు విక్రయించే దుకాణాలు అన్నీ కూడా రద్దీగా కనిపిస్తున్నాయి. వ్యాపార సముదాయాలతో పాటు మార్కెట్లకు సంక్రాంతి శోభ వచ్చింది. రోడ్లన్నీ

కూడా రద్దీగా మారిపోయాయి. ఒక్క సారిగా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగను ఘనంగా చేసుకునేందుకు ప్రజలు సర్వం సిద్దం అయ్యారు. అదేవిదంగా గ్రామాలు, పట్టణాలలో కూడా సంక్రాంతికి శోభను హరిదాసులు, గంగిరెడ్ల వారు, చెంచులు, బుడగజంగాలు, డప్పు వాయిద్య కళాకారులు తీసుకువచ్చి హడావుడి చేస్తున్నారు. వారికి ఎవరికి తోచినవిదంగా వారు దానధర్మాలను చేస్తున్నారు. ఇలా రకరకాల జానపద కళాకారులు గ్రామాలు పట్టణాలకు వచ్చి ఆడుతూపాడుతూ సంక్రాంతికి మరింత వన్నె తెచ్చిపెడుతున్నారు.

ఇదే సందర్భంలో వరుసగా కొత్త సినిమాలు విడుదలవుతుండడంతో పండుగకు వినోదం తోడవుతోంది. టిక్కెట్లకోసం ధియేటర్ల చుట్టూ జనం ప్రదక్షిణలు చేస్తున్నారు. పండుగ రోజులలో ఇంటిల్లపాది సినిమాలు తిలకించేందుకు టిక్కెట్లను అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు.

స్వస్థలాల బాట పట్టిన వలసవాసులు... రద్దీగా ఆర్టీసి కాంప్లెక్స్

ఉపాధి కోసం వలసలు వెళ్ళిన వారంతా సంక్రాంతి నేపధ్యంలో తిరిగి గ్రామాలకు చేరుకున్నారు. ఇప్పటికే కొందరు స్వస్థలాలకు చేరుకోగా మరికొందరు పండుగ నేపధ్యంలో వస్తునే ఉన్నారు. దీంతో గ్రామాలలో సందడి నెలకొంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయి అక్కడ పనులు చేసుకుంటున్న వారు అధిక సంఖ్యలో ఉన్నారు. అలా వెళ్ళిన వారంతా కుటుంబాలతో కలిసి సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. స్వస్థలాలకి వచ్చిన వారు గ్రామాలలోని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి సందడి చేస్తున్నారు. పండుగ నేపధ్యంలో బస్సులు, రైళ్ళు అన్ని కూడా రద్దీగా మారిపోయాయి.

ఆర్టీసి కాంప్లెక్స్ కిటకిటలాడుతుంది. బస్సులను కూడా ప్రయాణీకులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ప్రయాణీకుల రద్దీకి తగ్గట్టుగా ఆర్టీసి అధికారులు బస్సు సర్వీసులను నడుపుతున్నారు. గమ్యస్థానాలకు చేరుకోవడంలో ప్రయాణీకులకు అవస్థలు తప్పడం లేదు. సొంత వాహనాలు ఉన్న వారు తమ ప్రయాణాల కోసం వాటినే వినియోగిస్తుండగా లేని వారు మాత్రం బస్సుల రద్దీ నేపధ్యంలో స్వస్థలాలకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం మీద చూస్తే జిల్లాలో ఎక్కడ చూసినా సంక్రాంతి సందడి కన్పిస్తోంది

Read Entire Article